RSS NEWS

  • ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 
    ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు – వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసి, సాధించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లో 1975-77 మధ్య కాలంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ భారత చరిత్రలోనే మర్చిపోలేని చీకటి అధ్యాయం. 25 జూన్ 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 21 మర్చి 1977 వరకు 21 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దేశంలో అస్థిరత […]
  • నియంతృత్వ ఎమర్జెన్సీకి 49 ఏళ్లు
    -ప్రదక్షిణ వరిష్ట పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహంగారి పుస్తకం `ఎమర్జెన్సీ జ్ఞ్యాపకాలు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం’ ఆధారంగా ఈ వ్యాసం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ విధించిన 25 జూన్ 1975 రాత్రి నుంచి తీవ్రమైన దమనకాండ ప్రారంభమైంది. ప్రజల పౌరహక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా అధికారికంగా హరించబడ్డాయి. పత్రికలపై పూర్తి స్థాయి సెన్సర్షిప్ విధించబడింది. అన్ని రాజ్యాంగ సంస్థలు పూర్తిగా, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె ఆంతరంగిక బృందం ఆధీనంలో ఉండి, […]
  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం […]
  • వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ – హిందూ సామ్రాజ్య దినోత్సవం
    1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన […]
  • వీరనారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి
    భారతదేశం ఎందరో వీరులను వీర మాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు వీర మాతలు ఈ గడ్డ పై జన్మించారు. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణపాయంగా ఎంచి తల్లిభారతి పాదాల చెంత సమ్పర్పించారు. తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యులారు ‘మణి’ కర్ణిక… మన రాణి ఝాన్సీ లక్ష్మీ భాయి. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి […]
  • శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్
    -అనంత్ సేథ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 5వ సర్ సంఘచాలక్ శ్రీ కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్ జీ ఆషాఢ శుద్ధ తృతీయ, 18 జూన్ 1931 నాడు రాయ్ పూర్ లో జన్మించారు. వారు 9 సం|| వయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళటం ప్రారంభించారు. వారు 6 దశాబ్దాలు సంఘ ప్రచారక్ గా సేవచేసి, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ్ జీ తర్వాత 2000 సం|| లో సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. చదువు రీత్యా ఇంజనీర్ అయిన వారు, శారీరిక దార్ఢ్యత మరియు […]
  • RSS Sarsanghchalak Late KS Sudarshan Birth Anniversary: Committed to swadeshi and economic self-reliance
    KS Sudarshan was directly associated with Swadeshi Jagran Manch (SJM) as Marg-darshak for about 7 years before taking up the responsibility of Sarsanghachalak. After the formation of SJM by Dattopant Thengadi in 1991, Swadeshi movement took off only after its national convention of 1993 in Delhi. With the support from karyakartas of Rashtriya Swayamsevak Sangh […]
  • ఐరోపాలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభం
    ఐరోపాలో అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతంలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభోత్సవం జరిగింది. జూన్‌ 4 న ఈ ఉత్సవాలు ప్రారంభమై… పదమూడో తేదీ వరకూ వైభవోపేతంగా జరిగాయి. దేవాలయ ప్రారంభోత్సవం, మహా కుంభాభిషేకం తమిళనాడుకి చెందిన భూపతి శివాచార్య స్వామిగల్‌, వెంకటేష్‌ జయరామ్‌ అనే అర్చకులు నిర్వహించారు. సంప్రదాయమైన ముఖ్య ఘట్టాలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత శివునితో పాటు శ్రీ కర్పగ నాధర్‌, బ్రహ్మంద్‌ […]
  • మోహన్ భాగవత్ అలా అనలేదు : క్లారిటీ ఇచ్చిన సంఘ్
    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌  వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా హిందీ పత్రిక దైనిక్‌ జాగరణ్‌ ఓ వార్త ప్రచురించింది. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆరెస్సెస్ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మోహన్‌ భాగవత్‌ స్పందించారని ఆ పత్రిక పేర్కొంది. “మన దేశంలోని ప్రతి పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్చ వుందని, నడ్డా […]
  • దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు
    మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలన్న (డీ లిస్టింగ్‌) ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. వనవాసీ సంఘాలు దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో డీ లిస్టింగ్‌ డిమాండ్‌ తో ‘‘పోస్ట్‌కార్డ్‌’’ ఉద్యమాన్ని కూడా చేస్తున్నారు. కొందరు గిరిజనులు మతం మారినా… ఇప్పటికీ గిరిజన సమాజానికి వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ:వ్యాప్తంగా ‘‘జనజాతి సురక్షా మంచ్‌’’ పేరుతో గిరిజనులందరూ ఏకమై పెద్ద […]

నిజాం అస్తవ్యస్త పరిపాలన

బ్రిటీష్ వాళ్ళకి “నమ్మకస్తుడైన నిజాం అస్తవ్యస్త ఆర్ధిక వ్యవహారాలు –  బ్రిటీష్ వాళ్ళ దోపిడి” 1724 – 1948

అసఫ్ జాహీ – నిజాం రాజ్యం మొదలైంది వినాశనం తోనే. వారు పరిపాలించిన ప్రాంతం అలనాడు కాకతీయ సామ్రాజ్యంలో గొలుసుకట్టు చెరువుల ద్వారా ప్రణాళికా బద్దంగా అభివృద్ధి చేసిన చక్కటి ఆదాయాన్ని ఇచ్చిన భాగం. అయినా సరే వారు రాజ్యం చేసిన దాదాపు రెండు వందల సంవత్సరాల కాలంలో సగానికి పైగా పాలన ఆర్ధిక అస్తవ్యస్తం తో రెండు మూడు సార్లు దివాలా దిశగా కూడా నడిచింది. అప్పులు తీర్చడానికి రాజ్యంలో కొంత భాగాన్ని అమ్మడమో తాకట్టు పెట్టడమే కూడా జరిగింది.

ఈ అసఫి జాహీలు ఎలా అధికారానికి వచ్చారో గమనిస్తే ఆ విధానమే మతమౌడ్యం నిండిన దాడి చేయడం, ఉన్న సంపదను దోచుకొని తినడం. అంతకు పూర్వం గొల్లకొండను( గోల్కొండను) పరిపాలించింది కుతుబ్ షాహిలు. వారి పాలనలో చివరి రాజు కాలంలో అరాచకమే ఆలంబనగా ప్రజలను పీడించుకు తింటున్న ‘కుతుబ్ షాహీ రాజ్య ‘ ముస్లిం అమీర్ లు, సైన్యాధికారులను అక్కన్న – మాదన్న సోదరులు మంత్రాంగంతో అడ్డుకోవడం. రాజు అబుల్ హసన్ తానీషా అక్కన్న మాదన్నల మాట కు విలువ ఇవ్వడం.  ఈ అక్కన్న-మాదన్నల చాకచక్యం, వారి వ్యవస్థాగత నిర్వహణ శైలి, ధర్మబద్ధమైన, పక్షపాతం లేని వ్యవహరం  పైగా తమ ముస్లిం రాజు వారితో కలిసి పోవడం ఆ ముస్లిం అమీర్ లకు కంటగింపుగా ఉంది. రాజ్యంలో వ్యవస్థను చక్కదిద్దుకున్నందుకూ, శివాజీ మహరాజును ఆహ్వానించి సాదర  స్వాగతం పలికినందుకూ ఇంకా కుళ్ళిపోయి ఇంత శాంతీ సౌభ్రాతృత్వం ఓర్వలేని రాజు బంధువులు ఔరంగజేబ్ ను ఎగదోస్తే, ఆ అరాచక రాజు ఔరంగజేబ్ భాగ్యనగరం పై పడి సర్వనాశనం చేసి కుతుబ్ షాహి పాలనకు అంతం పలికి, ఇదిగో ఈ అసఫ్ జాహీ పాలనకు దారి ఇచ్చాడు.

1724 సంవత్సరంలో మొదలైన వీరి పరిపాలన వీరత్వం గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. వారి రాజ్యపాలన గురించీ, ఆర్ధిక వ్యవహారాల గురించీ మనకు తెలియాలి అంటే ఆ కాలంలో బ్రిటీషర్లు తమ రిపోర్ట్ లో ఏమి  రాశారో గమనిస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. రెండు పుస్తకాలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఉటంకించడం ముఖ్యం.

  1. Smith elder & Co London వారు 1865 లో ప్రచురించిన Captain  Hastings Frazer  రచన “ Our Faithful Ally THE NIZAM”  being a historical sketch of events Showing the value of NIZAMS ALLIENCE to British Government India and his services  during mutinies “ అనే పుస్తకం.  లింకు: https://archive.org/details/in.ernet.dli.2015.285088/mode/1up
  2. Cosmo publications వారు 1887  ఫిబ్రవరి లో ప్రచురించిన Temple R vol 38(i) “Hyderabad, Kashmir, Sikkim and Nepal, a historical and political record “ అనే పుస్తకం. లింకు: https://archive.org/details/in.ernet.dli.2015.54036/mode/1up

ఈ రెండు పుస్తకాలను చదివితే కీలకమైన అనేక విషయాలు మనకు తెలుస్తాయి.

మొదటి పుస్తకంలో అధ్యాయాలు కేటాయించి మరీ నిజాం రాజు అస్తవ్యస్త పాలన గురించి రచయిత వివరంగా చెప్పారు. పైగా ఆ నిజాం రాజ్యపాలన విషయం లో నమ్మకం లేక బ్రిటీష్ వారు ఒక్కో పరిపాలన విభాగం లో ఏ విధంగా నిఘా కోసం తమ అధికారులను నియమించు కొన్నారో తెలియజేశారు.

నిజాం పరిపాలన గురించి పైన పేర్కొన్న రెండవ పుస్తకం లో “ ప్రైవేట్ డైరీ అఫ్ పాలిటిక్స్ ఎట్ ది కోర్టు ఆఫ్ నిజాం ఆఫ్ హైదరాబాద్ “ 7 ఏప్రిల్ 1867 నుండి జనవరి 3 1868 వరకు  అన్నవిభాగం లో పరిచయం  లో పేర్కొన్న విషయాలు ఆశ్చర్యం, ఆందోళన కలగజేస్తాయి.  ఆ పుస్తకం వ్రాసిన సమయానికి యాభై సంవత్సరాల క్రితం విషయం పాఠకుడికి చెబుతూ

“ఈ విషయం మీ దృష్టిలో ఉండకపోతే విషయం తెలియక ఇబ్బంది పడతారని చెబుతున్నాము“ అంటారు రచయిత.

1750-1760 ల మధ్య టిప్పు తో యుద్దం చేయడానికి, నిజాం ఫ్రెంచ్ వారితో ఒప్పందం లో వారికి యుద్ద ఖర్చుల నిమిత్తం 1753 లో ఉత్తర సిర్కార్ ప్రాంతాన్ని కోల్పోయాడు. వారితో ఒప్పందాలు చెడిపోయిన తరువాత 1759 లో బ్రిటీష్ వారితో ఇంకో ఒప్పందం చేసుకున్నాడు,  ఈ ఒప్పందం పర్యవసానం గా బ్రిటీష్ వారికి సాదరు ఖర్చులకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది (మరాఠాలు ఎక్కడ దాడి చేస్తారేమో అని భయం ఉండి ఉండొచ్చు.) పర్యవసానం గా అదే ఉత్తర సిర్కార్ ప్రాంతాన్ని శాశ్వతం గా వదులుకొన్నాడు. అప్పుడైనా జాగ్రత్త పడి రాజ్యపాలన ఖర్చుల పై కాస్త దృష్టి పెట్టాలి కదా, లేదు.

తరువాత కాలంలో రాజ్యం నడుపుకోవడానికి  Palmer & Co అనే పేరుగల బ్రిటీష్ వారి “అప్పులు ఇచ్చే సంస్థ తో”,1811 సంవత్సరం లో మొదలు పెట్టి 18%-24% వడ్డీతో నెలవారీ అప్పులు చేస్తూ 1823 నవంబర్ వచ్చేసరికి బ్రిటిష్ వారి సైన్యానికి ఇవ్వాల్సిన జీతాలతో( 20, 00,000 ) కలిపి మొత్తం 1,16,66,666/- బాకీ పడి దివాలా తీసే పరిస్థితి వస్తే “సంపన్న బేరర్ ప్రాంతం  “ బ్రిటీష్ వారికి సమర్పించుకొని బ్రతుకు జీవుడా అని బయట పడ్డాడు. ఈ లావాదేవీ చూస్తే ఎంతో ఆశ్చర్యం కలిగిస్తూ చాలా హాస్యాస్పదం గా ఉంటుంది. అప్పు చేసి రాజ్యం నడపడం ఏమిటి??. వివరం చూడండి.

ఈ పామర్ & కంపెనీ వ్యవహరం 19 వ శతాబ్దం లో ప్రపంచంలో జరిగిన అతి పెద్ద కుంభకోణాలలో ఒకటి. ఈ వ్యవహరం మూడవ నిజాము సమయంలో జరిగింది. రాజు గారి ఆజ్ఙమేరకు మంత్రి (దివాన్) చందూలాల్ రాజ్యం నడపడానికి, బ్రిటీష్ సైనికుల జీతాలు ఇవ్వడానికి వేరే మార్గం లేక బ్రిటిష్ రెసిడెంట్ వసతిలోనే ఏర్పాటైన ఈ పామర్ & కంపెనీ ఫైనాన్సింగ్ సంస్థ నుండి 1811 నుండి అప్పు తీసుకోవటం మొదలుపెట్టాడు. ఆ సంస్థ కు ఎటువంటి అనుమతి  లేదు అయినా అప్పటి బ్రిటీష్ రెసిడెంట్ అండతో నెలనెలా అప్పు ఇచ్చారు, ఎందుకైనా మంచిదీ అనుకున్నారేమో 1816 లో అనుమతి పొంది  రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

ఆ సంస్థ వడ్డి మీద వడ్డి లెఖ్ఖ కడుతూ అసలుకు వడ్డీ కలిపి మళ్ళా పాత అప్పు తీర్చడం కోసం కొత్త అప్పు ఇలా పెంచుకుంటూ  1820 కి వచ్చేసరికి 60 లక్షల అప్పు లెఖ్ఖ తేలిస్తే. ఆ విషయాన్ని మెట్ కాఫే అనే పేరుగల బ్రిటీష్ రెసిడెంట్ గమనించి ఇది తీరే అప్పు కాదని గమనించి. అప్పటీ గవర్నర్ జనరల్ లార్డ్ హేష్టింగ్ గారి ఆశీస్సుల తో ఆయన అల్లుడు ‘సర్ విలియమ్ రంబోల్డ్’ (ఇతను పామర్ & కంపెనీ లో ఒక డైరెక్టర్), హెన్రీ రస్సేల్ (ఈయన హైదరాబాద్ రెసిడెంట్ గా పని చేశారు) కలిసి చేసిన ఈ దోపిడిని ఇంగ్లాండ్ లోని బొర్డ్ ఆఫ్ డైరెక్టర్ల దృష్టి కి తీసుకు వెళితే, వారు పరిశీలించి ఇది తప్పు అని ఆ పామర్ & కంపెనీని మూసేయమని ఆదేశించారు. మరి వారు ఇచ్చిన దొంగ అప్పులు ఏమవ్వాలి?? న్యాయంగా రద్దు కావడమొ. సరైన లెఖ్ఖలు వేయించి తగ్గించడమో జరగాలి కదా?? కాని అలా కాకుండా బ్రిటీష్ కంపెనీ వారి “జమ”లోకి వెళ్ళి పైన చెప్పిన విధంగా నిజాము ఆధీనంలోని అతి సారవంతమైన బేరార్  ప్రాంతం శాశ్వతం గా రాయించుకోవడం జరిగింది. ఆ తరువాత గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటీ అంటే బ్రిటీష్ వారు “శ్రీయుత నిజాం “గారి నిర్వహణ సామర్ధ్యం పై పూర్తి నమ్మకం తో నిజాం ఆధీనంలోని ప్రతి జిల్లాలో నూ తమ అధికారులను పర్యవేక్షణ కోసం నియమించుకొన్నారు కూడా.

 

సంకలనం చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి సీనియర్ రీసెర్చ్ అసోసియేట్, సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీస్