దక్షిణభారతం ( దక్షిణావర్త అని కూడా పిలుస్తారు) –
సాంప్రదాయకంగా మన దేశంలో వింధ్యకు దక్షిణాన ఉన్న భూమి దక్షిణావర్తము లేదా దక్షిణాపథంగా పరిగణించబడుతుంది.
భారతీయ ఏకాత్మత స్పూర్తిగా సమాజాన్ని, మారుతున్న కాలాన్ని ప్రతిబింబిస్తూ గొప్ప రాజకీయ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజలు, స్ఫూర్తిదాయక చిహ్నాలను సంగ్రహించడం, సమీకరించడం దక్షిణాపథం (దక్షిణావర్త) పేరట నడిపే ఈ పోర్టల్ లక్ష్యం. మన దేశ దక్షిణావర్తం యొక్క సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భౌగోళిక రాజకీయాలు, సంస్కృతి, లలిత కళలు, ఆధ్యాత్మిక సంప్రదాయాల సమ్మేళనాన్ని విస్తృతంగా ప్రజలకు అందిచాలన్నది మా అభిమతం. ఈ ప్రాంతానికి సంబంధించి ఈ నెలలో చోటుచేసుకునే ముఖ్యమైన విశేషాలను సృజిస్తూ పత్రికా రూపకంగా మీ ముందుకు తెస్తున్నాము.
దక్షిణ భారతదేశం, దక్షిణ్ సాంప్రదాయకంగా వింధ్యకు దక్షిణాన ఉన్న భూమిగా పరిగణించబడుతుంది. వింధ్య పర్వతాలు విపరీతంగా ఎత్తు పెరగడం ద్వారా హిమాలయాలతో పోటీపడటానికి ప్రయత్నిస్తున్నందున, భూభాగానికి సమతుల్యతను తీసుకురావడానికి అగస్త్య మహర్షిని వింధ్యకు దక్షిణాన ఉన్న ప్రదేశానికి వలస వెళ్ళమని మహాశివుడు కోరాడని పురాణాలు చెబుతున్నాయి. అతను దారిలో ప్రయాణిస్తున్నప్పుడు, వింధ్యులు అతని ముందు సాష్టాంగ నమస్కారం చేస్తారు, మరియు అతను తిరిగి వచ్చే వరకు పర్వతాలను పడుకోమని అడుగుతాడు. శ్రీ అగస్త్యుడు ఎప్పటికీ తిరిగి రాడు. దానితో వింధ్యలు తక్కువ ఎత్తుగల పర్వత శ్రేణులుగా ఉండిపోతాయి. అగస్త్య మహాముని మరియు అతని భార్య లోపముద్ర ఋగ్వేద శ్లోకాలకు దోహదపడిన వేద ఋషులు. ఈ జంట రామాయణం, మహాభారత ఇతిహాసాలతో పాటు స్కంద పురాణంతో సహా పురాణ సాహిత్యానికి చెందిన అనేక గ్రంథాలలో కనిపిస్తుంది.
దక్షిణ ద్వీపకల్ప భూభాగంలో మూడు వైపులా సముద్రాలు – తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నాయి. రాష్ట్రాల పరంగా చూస్తే దక్షిణాపథం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పాండిచ్చేరి, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలను సూచింస్తుంది. ప్రస్తుతమున్న మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ మరియు ఒడిషాలోని కొన్ని ప్రాంతాలు కూడా దక్షిణాపథం క్రిందికే వస్తాయి.
పర్వతాలు, అడవులు మరియు నదులు
వింధ్య మరియు సాత్పురా శ్రేణులు మధ్యభారతదేశంలోని ప్రధాన పర్వత శ్రేణులు. దక్షిణ పశ్చిమ తీరం వెంబడి ఉన్న సహ్యాద్రి కొండలు అని కూడా పిలువబడే పశ్చిమ కనుమలు ఎత్తైన మరియు పొడవైన పర్వత శ్రేణులు. పశ్చిమ కనుమల వలె విస్తృతముగా లేనప్పటికీ నల్లమల శ్రేణిని కలిగి ఉన్న తూర్పు కనుమలు తూర్పు తీరంలో ఉన్నాయి. దండకారణ్యం- అబుజ్మార్ అడవులు చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల గుండా ప్రయాణిస్తాయి. తమిళనాడులోని వండలూరు రిజర్వ్ ఫారెస్ట్, తూర్పు మరియు పశ్చిమ కనుమలలోని అనేక చిన్న ప్రాంతాలు పచ్చదనాన్ని అందిస్తాయి. పశ్చిమ కనుమ పర్వత శ్రేణులు గోదావరి, కావేరి, కృష్ణ మరియు నర్మదాతో సహా అనేక శక్తివంతమైన నదులకు నిలయంగా ఉన్నాయి, అయినప్పటికీ ఎక్కువగా కాలానుగుణ రుతుపవనాల ద్వారా నీరు అందుతుంది.
దక్కన్ పీఠభూమి – దక్కన్ (దక్షిణ్ నుండి ఉద్భవించింది) పీఠభూమి చాలా పురాతన ఖండం. దీనిని గోండ్వానా భూభాగంలో ఒక విభాగంగా చెబుతారు, ఇది భారతదేశంలోని పురాతన మరియు అత్యంత స్థిరమైన భూభాగం. సాధారణంగా రాతినెలతో ఉండిన పొడి ప్రదేశం. బసాల్ట్ మరియు గ్రానైట్ శిలలతో ఏర్పడిన పీఠభూమి. మైకా మరియు ఇనుప ఖనిజం యొక్క ప్రాధమిక ఖనిజాలతో సమృద్ధిగా ఉంది. ఇది తెలంగాణ, మహారాష్ట్ర మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను కలిగి ఉంది. ఈ పీఠభూమిలోనే గతంలో గోల్కొండ ప్రాంతంలో వజ్రాలు, ఇతర లోహాలు కూడా దొరికాయి.
భాషలు మరియు సంస్కృతి
సజీవంగా మాట్లాడే శాస్త్రీయ భాషలు, సాంస్కృతిక సంపద, లలిత కళల అభివృద్ధి, శాస్త్రీయ సంగీతం, నృత్యం, గంభీరమైన దేవాలయాల నిర్మాణ వైభవం – ఇవన్నీ దక్షిణాపథంలో ఔషకాలం మరియు భరత కాలం నాటి ప్రాచీనతను ప్రతిబింబిస్తాయి. దక్షిణాపథం యొక్క ప్రధాన భాషలు కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం మరియు తెలుగు. కొంకణి మరియు తుళు కర్ణాటకలో ప్రధానంగా మాట్లాడే ప్రధాన మాండలికాలు. దక్షిణ ప్రాంతం యొక్క వైవిధ్యం మరియు గొప్పతనం మాట్లాడే బహుళ భాషలలో ప్రతిబింబిస్తుంది.
శాస్త్రీయ భాషలు – ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దక్షిణాపథంలో మాట్లాడే నాలుగు ప్రధాన భాషలు – కన్నడ, మలయాళం, తమిళం మరియు తెలుగు కూడా భారత ప్రభుత్వంచే గుర్తింపుపొందిన ఐదు శాస్త్రీయ భాషలలొనివి (ఐదవది ఒడిషాలో మాట్లాడే ఒడియా). దక్షిణాపథంలో సంస్కృతం మరియు అన్ని దక్షిణ భాషలలో విస్తృతమైన సాహిత్యవాఙ్మయాలు వర్ధిల్లాయి.
దక్షిణాపథం (దక్షిణావర్త అని కూడా పిలుస్తారు) శాంతి మరియు రాజకీయ స్థిరత్వంతో కూడినదై ఉండటంవల్ల శాస్త్రీయ కళలు, సంగీతం మరియు నృత్యం వైభవంగా వెలుగొందినాయి. శతాబ్దాల క్రితం నుండీ అనేక హిందూ పాలక రాజవంశాలు నిర్మించిన గొప్ప దేవాలయాలకు దక్షిణాపథం నిలయం. ఆక్రమణల కారణంగా కొన్ని కోల్పోయినప్పటికీ, వాటిలో ఎక్కువ భాగం నేటికీ వర్ధిల్లుతున్నాయి. శైవ, వైష్ణవ, శాక్తేయ సంప్రదాయాలలో హిందూ ఆచారాలు వివిధ మఠాలు, పీఠాలలో ప్రతిబింబిస్తాయి. జైన, బౌద్ధ మతాలు కూడా వివిధ కాలాల్లో వర్ధిల్లి, సుసంపన్నమైన సాంస్కృతిక వైభవాన్ని మిగిల్చాయి.