విద్యారణ్యస్వామి గురించిన ఉపన్యాసము

దక్షిణాపథ అధ్యయన సంస్థ ఆధ్వర్యంలోని భాగ్యనగర విభాగం దక్షిణ భారత అధ్యయన కేంద్రం, శ్రీ విద్యారణ్య మహర్షి జన్మ తిథి అయిన “ వైశాఖ శుక్ల సప్తమి పవిత్ర దినాన (ఏప్రియల్ 24, 2026) శ్రీ విద్యారణ్య స్వామి పై ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించింది.

కార్యక్రమంలో ముఖ్య వక్తగా సంచార జాతుల బాలల సదానం , సేవాభారతి సంస్థ ఉపాధ్యక్షులు శ్రీ కే రవీంద్రనాథ్ గారు పాల్గొనివిద్యారణ్య స్వామి వారి  జీవితం, తత్వం, చారిత్రక సేవల గురించి లోతైన మరియు ఆలోచనాత్మక ఉపన్యాసాన్ని అందించారు.

ఆయన తన ప్రసంగంలో, భారతదేశం చరిత్రలో  ఒక క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు  హిందూ సంస్కృతిని  పునరుద్ధరించడంలో విద్యారణ్య స్వామి వారి కీలక పాత్రను వివరించారు. ఆయన మార్గదర్శకత్వంలో హరిహరరాయ మరియు బుక్కరాయ హిందూ ధర్మంలోకి తిరిగి వచ్చి, ఒక శక్తివంతమైన రాజ్యాన్ని స్థాపించారని చెప్పారు. రాజ్యం దక్షిణాపథ ప్రాంతంలో దూరాక్రమణలకు  వ్యతిరేకంగా బలమైన కేంద్రంగా నిలిచిందని వివరించారు.

స్వామి విద్యారణ్య మహర్షి గారి దూరదృష్టి, మార్గనిర్దేశం వల్ల దక్షిణ భారతదేశంలో ధర్మ పరిరక్షణ, హిందూ సంస్కృతి పునరుద్ధరణ సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. మహోన్నత సేవల కారణంగా ఆయననుహిందూ ధర్మ స్థాపన ఆచార్యుడుగా గౌరవిస్తారని తెలిపారు.

ప్రస్తుత సమాజం కూడా ఆయన జీవితం నుండి స్ఫూర్తి పొందాలని, ముఖ్యంగా హిందువుల మధ్య ఐక్యతను పెంపొందించుకోవాలని రవీంద్రనాథ్ గారు పిలుపునిచ్చారు.పన్యాసం ముగిసిన తరువాత ఆహుతులు విద్యారణ్య స్వామి చిత్రపటానికి పూల తో నివాళి అందించారు. దక్షిణా పధం సంస్థ భాగ్యనగర్ చాప్టర్ హెడ్ శ్రీ కళ్యాణచక్రవర్తి మాట్లాడుతూ దక్షిణపథ సంస్థ అనేక పరిశోధనల పై పని చేస్తోందని . ఉత్సాహవంతులైన వారు సంస్థ తో అనుసంధానం కావచ్చు అని తెలియజేశారు . చక్కటి వేదిక ను అందించినందుకు adtoitec సంస్థ కూ ధన్యవాదాలు తెలియజేశారు. వందన సమర్పరణ తో కార్యక్రమం ముగిసింది .ఈ కార్యక్రమంలో పరిశోధకులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని సార్థకం చేశారు.