మరాఠాలకు నిజామ్ పాలకుడు సంప్రదాయ శత్రువు. నిజాం రాజు 1748 లో మరణించడంతో అతని ఇద్దరు కుమారులు – ఘజియుద్దీన్ ఖాన్ మరియు సలాబత్ జంగ్ మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. మరాఠాలు ఘాజీ–ఉద్దీన్ ఖాన్ కు మద్దతు ఇవ్వగా, ఫ్రెంచ్ వారు సలాబత్ జంగ్ కు మద్దతు ఇచ్చారు. 1752 అక్టోబరు 16 న గాజియుద్దీన్ మరణించాడు. సలాబత్ జంగ్ మరాఠా పేష్వాతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనితో 1756 వరకు నిజాం, మరాఠాల మధ్య తిరిగి యుద్ధం జరగలేదు. అయితే చివరకు 1759లో బాలాజీ బాజీ పీష్వా నిజాంను అణచివేయాలని నిర్ణయించుకున్నాడు.
ఉద్గిర్ వద్ద పోరాటం 18వ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్యానికి, హైదరాబాద్ నిజాంకు మధ్యన జరిగినది. ఇది అక్టోబరు 1759 మరియు ఫిబ్రవరి 1760 మధ్య సంభవించి, చివరికి ఫిబ్రవరి 3 న ముగిసింది.
సదాశివరావు భావు నాయకత్వంలోని మరాఠాలు సలాబత్ జంగ్ సైన్యాన్ని ఓడించారు, యుద్ధంలో గెలిచి, నిజాం పదవిని చేపట్టాలన్నది సలాబత్ జంగ్ ఉద్దేశ్యం. మరాఠా సామ్రాజ్యానికి చెందిన అప్పటి పీష్వా బాలాజీ బాజీ రావు అలియాస్ నానాసాహెబ్ 40,000 గుర్రాలు, 10,000 శిక్షణ పొందిన పదాతిదళాన్ని ముందుకు నడిపించి సలాబత్ జంగ్ ను మట్టి కరిపించాడు.
యుద్ధానంతరం నిజాం సేనలు అహ్మద్ నగర్, దౌలతాబాద్, శివనేరి, బుర్హాన్ పూర్ (అసిర్ గఢ్ కోట), బీజాపూర్ నగరాలతో సహా 60-62 లక్షల వార్షిక ఆదాయం కలిగిన భూభాగాలను మారాఠాలకు అప్పగించే ఒప్పందంపై సంతకం చేశాయి. జె.ఓ. లిండ్సే దీనిని “దక్కన్ లో మరాఠాల శక్తి యొక్క అపోజీ” గా అభివర్ణించాడు.
ఉదగీర్ యుద్ధం తరువాత మరాఠాలు మూడవ పానిపట్ యుద్ధంలో అహ్మద్ షా దుర్రానీ నేతృత్వంలోని ఆఫ్ఘన్ దళాన్ని ఎదుర్కోవటానికి ఉత్తరం వైపు తిరిగాయి.
More Stories
తెలంగాణ కాలాపానీ జైలు మన్ననూరు
వెల్లూరు తిరుగుబాటు (జులై 10)
విద్యారణ్య స్వామి శృంగేరి పీఠాధిపతి, విజయనగర సామ్రాజ్య రాజ గురువు