చరిత్రలో
కొన్ని పేర్లు మాత్రమే నిలిచిపోతాయి. మరికొన్ని పేర్లు,
అసాధారణ పరాక్రమాన్ని ప్రదర్శించినా, కాలగర్భంలో కలిసిపోతాయి. అలాంటి ఓ గొప్ప యోధుడి కథే ఇది.
చరిత్ర పుస్తకాల నుంచి
మాయమైపోయినప్పటికీ, ఆయన సాహస గాథ గుండెల్లో దడ పుట్టిస్తుంది. ఈ కథానాయకుడి పేరు సుబేదార్ తుకోజీరావు హోల్కర్.
ఇండోర్ సింహాసనాన్ని అధిష్టించిన ఈయన, ఓ సాధారణ పాలకుడు కాదు. మాతృశ్రీ అహల్యాబాయి హోల్కర్ చేత స్వయంగా సైన్యాధిపతిగా నియమితులైన ధీశాలి.
చిన్నప్పటి నుంచీ యుద్ధ భూమిలో పెరిగిన తుకోజీరావు, కేవలం ఆయుధాలతోనే కాదు, వ్యూహాలతోనూ శత్రువులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు.
పీష్వాల దగ్గర
సలహాదారుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన సలహాలు, సూచనలు ఎంతగానో ఉపయోగపడేవి. ఒక విధంగా చెప్పాలంటే, మరాఠా రాజ్యానికి ఆయన ఓ కవచంలా నిలిచారు.
కానీ,
ఆయన అసలైన పోరాటం అప్పుడే మొదలయ్యింది.
అటు దక్షిణాన టిప్పు సుల్తాన్ మత దురహంకారంతో లక్షలాది మంది హిందువులను బలవంతంగా మతం మార్చి, ఔరంగజేబులా ఆధిపత్యం చలాయించాలని చూశాడు.
ఆ సమయంలో హిందూ సమాజం భయంతో వణికిపోయింది. ఆ అణచివేతకు అడ్డుకట్ట వేయాలని మరాఠాలు నిర్ణయించుకున్నారు.
అప్పుడు రంగంలోకి దిగినవాడే మన తుకోజీరావు హోల్కర్. నానా ఫడ్నవీస్ ఆదేశాలతో, తుకోజీరావు తన సైన్యంతో కత్తి దూశారు.
1786లో
బదామి కోటపై మెరుపుదాడి చేసి, మూడు వారాల భీకర పోరాటం తర్వాత దాన్ని గెలుచుకున్నారు. ఆ తర్వాత గజంద్రగఢ్, ధార్వాడ్, సవనూర్ వంటి కోటలను వరుసగా స్వాధీనం చేసుకుంటూ టిప్పు గుండెల్లో గుబులు పుట్టించారు.
సవనూర్ యుద్ధంలో తుకోజీరావు, హరిపంత్‌తో కలిసి గెరిల్లా పోరాటం చేసి, టిప్పు సుల్తాన్ సైన్యాన్ని చీల్చి చెండాడారు. మరాఠాల అకస్మాత్తు దాడులకు, వేలాది మంది టిప్పు సైనికులు నేలకొరిగారు.
టిప్పు సైన్యం తట్టుకోలేకపోయింది. అజేయుడు అనుకున్న టిప్పు సుల్తాన్ అప్పటికే ఓటమి అంచున ఉన్నా, పన్నాగం పన్ని సంధికి దిగాడు.
కానీ,
అది కేవలం ఒక మోసం అని తెలుసుకున్న తుకోజీరావు, మరింత ఉధృతంగా దాడి చేశారు. ఆ దెబ్బకు టిప్పు సైన్యం తోకముడిచి పారిపోయింది.
టిప్పు కూడా ఓటమిని అంగీకరించి,
ప్రాణాలు రక్షించుకోవడానికి యుద్ధభూమి నుంచి పలాయనం చిత్తగించాడు. తుకోజీరావు హోల్కర్ వదిలిపెట్టలేదు.
పారిపోతున్న టిప్పు సైన్యాన్ని
వెంటాడి, వాళ్ల ఆయుధాలను ధ్వంసం చేసి, సైనికులను బందీలుగా పట్టుకున్నారు. తుకోజీరావు కరవాలం దెబ్బకు టిప్పు సుల్తాన్ పూర్తిగా నిర్వీర్యుడైపోయాడు.
చివరికి,
ఒక సంధికి దిగక తప్పలేదు. ఆ సంధి ప్రకారం టిప్పు సుల్తాన్ భారీ మొత్తంలో ధనాన్ని మరాఠాలకు ఇవ్వడమే కాకుండా, తన ఇద్దరు కుమారులను కూడా బందీలుగా అప్పగించాల్సి వచ్చింది.
ఈ విజయంతో
మరాఠా రాజ్యం విస్తరించి, సరిహద్దు కృష్ణా నది నుంచి తుంగభద్ర వరకు చేరింది. ఆ తర్వాత మరాఠాలు, బ్రిటిష్ వారితో కలిసి టిప్పు సుల్తాన్ పాలనను పూర్తిగా అంతమొందించారు.
తుకోజీరావు హోల్కర్ చూపిన తెగువ, దక్షత, వ్యూహ నైపుణ్యం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవి.
కానీ, ఆయన పేరు మాత్రం చరిత్ర పుటల్లో మరుగున పడిపోయింది. ఈ గొప్ప యోధుడి త్యాగం, పరాక్రమం మనందరికీ స్ఫూర్తిదాయకం.
Source : Facebook
More Stories
12 నవంబరును జాతీయ దేవాలయ ప్రవేశ ఉత్సవంగా నిర్వహించుకుందాం!
మన ప్రాచీన విద్యా సంస్థలు
వీరాంగన ” నీరా ఆర్య” మొదటి మహిళా గూఢాచారి