RSS NEWS

  • ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 
    ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు – వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసి, సాధించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లో 1975-77 మధ్య కాలంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ భారత చరిత్రలోనే మర్చిపోలేని చీకటి అధ్యాయం. 25 జూన్ 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 21 మర్చి 1977 వరకు 21 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దేశంలో అస్థిరత […]
  • నియంతృత్వ ఎమర్జెన్సీకి 49 ఏళ్లు
    -ప్రదక్షిణ వరిష్ట పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహంగారి పుస్తకం `ఎమర్జెన్సీ జ్ఞ్యాపకాలు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం’ ఆధారంగా ఈ వ్యాసం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ విధించిన 25 జూన్ 1975 రాత్రి నుంచి తీవ్రమైన దమనకాండ ప్రారంభమైంది. ప్రజల పౌరహక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా అధికారికంగా హరించబడ్డాయి. పత్రికలపై పూర్తి స్థాయి సెన్సర్షిప్ విధించబడింది. అన్ని రాజ్యాంగ సంస్థలు పూర్తిగా, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె ఆంతరంగిక బృందం ఆధీనంలో ఉండి, […]
  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం […]
  • వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ – హిందూ సామ్రాజ్య దినోత్సవం
    1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన […]
  • వీరనారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి
    భారతదేశం ఎందరో వీరులను వీర మాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు వీర మాతలు ఈ గడ్డ పై జన్మించారు. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణపాయంగా ఎంచి తల్లిభారతి పాదాల చెంత సమ్పర్పించారు. తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యులారు ‘మణి’ కర్ణిక… మన రాణి ఝాన్సీ లక్ష్మీ భాయి. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి […]
  • శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్
    -అనంత్ సేథ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 5వ సర్ సంఘచాలక్ శ్రీ కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్ జీ ఆషాఢ శుద్ధ తృతీయ, 18 జూన్ 1931 నాడు రాయ్ పూర్ లో జన్మించారు. వారు 9 సం|| వయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళటం ప్రారంభించారు. వారు 6 దశాబ్దాలు సంఘ ప్రచారక్ గా సేవచేసి, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ్ జీ తర్వాత 2000 సం|| లో సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. చదువు రీత్యా ఇంజనీర్ అయిన వారు, శారీరిక దార్ఢ్యత మరియు […]
  • RSS Sarsanghchalak Late KS Sudarshan Birth Anniversary: Committed to swadeshi and economic self-reliance
    KS Sudarshan was directly associated with Swadeshi Jagran Manch (SJM) as Marg-darshak for about 7 years before taking up the responsibility of Sarsanghachalak. After the formation of SJM by Dattopant Thengadi in 1991, Swadeshi movement took off only after its national convention of 1993 in Delhi. With the support from karyakartas of Rashtriya Swayamsevak Sangh […]
  • ఐరోపాలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభం
    ఐరోపాలో అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతంలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభోత్సవం జరిగింది. జూన్‌ 4 న ఈ ఉత్సవాలు ప్రారంభమై… పదమూడో తేదీ వరకూ వైభవోపేతంగా జరిగాయి. దేవాలయ ప్రారంభోత్సవం, మహా కుంభాభిషేకం తమిళనాడుకి చెందిన భూపతి శివాచార్య స్వామిగల్‌, వెంకటేష్‌ జయరామ్‌ అనే అర్చకులు నిర్వహించారు. సంప్రదాయమైన ముఖ్య ఘట్టాలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత శివునితో పాటు శ్రీ కర్పగ నాధర్‌, బ్రహ్మంద్‌ […]
  • మోహన్ భాగవత్ అలా అనలేదు : క్లారిటీ ఇచ్చిన సంఘ్
    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌  వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా హిందీ పత్రిక దైనిక్‌ జాగరణ్‌ ఓ వార్త ప్రచురించింది. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆరెస్సెస్ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మోహన్‌ భాగవత్‌ స్పందించారని ఆ పత్రిక పేర్కొంది. “మన దేశంలోని ప్రతి పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్చ వుందని, నడ్డా […]
  • దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు
    మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలన్న (డీ లిస్టింగ్‌) ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. వనవాసీ సంఘాలు దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో డీ లిస్టింగ్‌ డిమాండ్‌ తో ‘‘పోస్ట్‌కార్డ్‌’’ ఉద్యమాన్ని కూడా చేస్తున్నారు. కొందరు గిరిజనులు మతం మారినా… ఇప్పటికీ గిరిజన సమాజానికి వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ:వ్యాప్తంగా ‘‘జనజాతి సురక్షా మంచ్‌’’ పేరుతో గిరిజనులందరూ ఏకమై పెద్ద […]

గుడిమాన్యాన్ని కాపాడిన ‘సుదర్శనచక్రం’

తిరుమల ఆలయానికి ఏయే గ్రామాలను దేవదేయంగా రాజులు లేదా సంస్థానాధీశులు ఇస్తారో, ఆయా గ్రామాల్ని, మాన్యాల్ని శ్రీనివాసుడి ‘సుదర్శనచక్రం’ కాపాడుతుండేది.
అదెలా జరిగిందంటే…

•••

ప్రాచీన కాలంనుంచీ – అంటే మనకు తిరుమల ఆలయచరిత్ర శాసనాల ద్వారా తెలుస్తున్నప్పటి నుంచీ చూస్తే, ఆలయానికి వస్తున్న ఆదాయం పైన, ఆలయానికి దేవదేయాలుగా దానాలు చేసిన భూములపైన, గ్రామాలపైన ఆయాకాలపు రాజులు – వారికి కట్టవలసిన సుంకాలు, పన్నులలో మినహాయింపు ఇచ్చే సంప్రదాయం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 1801 సంవత్సరంలో ఆలయం ఈస్టిండియా కంపెనీవారి యాజమాన్యంలోకి వచ్చే వరకూ అదే కొనసాగింది (ఆతర్వాత ఏమయిందో కంపెనీ విషయాలు చర్చించినప్పుడు చూద్దాం).

మాలిక్కాఫరు దండయాత్రల వరకూ తిరుమల ఆలయం యాదవరాజుల పాలనలో ఉండేది. ఆలయ అవసరాలకు, నైవేద్యాలకు నిధులు చాలకపోతే, యాదవరాజులు ఆలయ కార్యక్రమాల్లో లోపం లేకుండా నిధులు సమకూర్చేవారు.
మొదట ముస్లిం దండయాత్రలతో రాజకీయ కల్లోలం దక్షిణభారతంలో మొదలై, మళ్లీ విజయనగర సామ్రాజ్యం స్థిరపడేవరకూ (అంటే విజయనగర స్థాపన జరిగిన తర్వాత కూడా 5/6 దశాబ్దాల వరకూ) అనిశ్చిత పరిస్థితులు సాగాయి. అంటే- ఇంచుమించుగా 1350 నుంచి 1568 వరకూ ఈ పరిస్థితులు కొనసాగాయని చెప్పుకోవచ్చు.

అది తెలుసుకొనేముందు ఆ కాలంలో గ్రామాలలో వ్యవసాయ పరిస్థితి, రైతులు పన్ను ఎంత కట్టాలి, గ్రామం నుండి ఎటువంటి పన్నులు వసూలు చేసేవారు, దేవదేయంగా భూములు గాని, గ్రామాలు గాని ఆలయానికి ఇస్తే- పంటలో రాజుకెంత, రైతుకెంత, ఆలయానికెంత భాగం వెళ్లేది… అన్నవి ఆసక్తికరమైన విషయాలు.

ఆ కాలంలో నాలుగురకాల వారికి భూముల మీద హక్కులుండేవి.

1. భండారవాడ : ఇవి రాజుగారి భూములు. వాటి ఆదాయాలు రాజుగారి ఖజానాకు నేరుగా వెళ్తాయి.

2. అమరం : నాయకులు లేదా పాలెగాళ్ల చేతుల్లో ఉన్న భూములు. వీరి అధీనంలో ఉన్న భూములు, గ్రామాలపై వచ్చే ఆదాయాన్ని ఈ నాయకులు తీసుకొని, రాజు తరఫున, ఈ ఆదాయంతో కొంత సైన్యాన్ని ఏర్పాటుచేసి, రాజు అవసరాలను బట్టి, సహాయానికి పంపాలి. వీటిలో రకరకాలున్నాయి. పూర్తి ఆదాయం సైన్యం మీద ఖర్చు పెట్టడం లేదా కొంత సైన్యానికి, కొంత నాయకునికి, కొంత రాజుకు ఇలా… భాగాలుగా ఖర్చులు పెట్టడం చేసేవాళ్లు. ముఖ్యంగా వచ్చే ఆదాయం వెచ్చించడంలో తయారుగా ఉంచాల్సిన సైనికుల సంఖ్యను బట్టి మార్పులుంటాయి.

3. ఎలిమోసనరీ లేదా దేవదేయాలు : ఆలయాలకు దానాలుగా ఇచ్చిన భూములు, గ్రామాలు, బ్రాహ్మణులకు ఈనాములుగా ఇచ్చినవి, వేద పాఠశాలలకు, శాస్త్రపాఠశాలలకు ఇచ్చినవి, మఠాలకు, సన్న్యాసుల అధీనంలోని భూములు.

4. రైతుల అధీనంలోని భూములు : దీనిమీద చాలా చర్చ ఉంది. భూమి ఎవరిదైనా భూమి మీద వచ్చే పంటను ఆ రోజుల్లో రెండు భాగాలు చేసేవారు. ‘మేలవరం’ అంటే భూమి హక్కుదారు భాగం, ‘కుడివరం’ అంటే భూమి సాగుచేసే రైతు భాగం.

రాజుకు వెళ్లినా, నాయకునికి వెళ్లినా, ఆలయానికి వెళ్లినా, వేద పాఠశాలలకు వెళ్లినా, మఠాధిపతులకు వెళ్లినా, భూమి సొంతదారులకు వెళ్లినా, అది ‘మేలవరం’ భాగం మాత్రమే. ఎటువంటి భూమిఖాతా అయినా, దున్ని పండించే వాడి ‘కుడివరం’ భాగంలో మార్పు లేదు. అది ఆ పండించిన రైతుకు చెందాల్సిందే. ‘మేలవరం’ భాగంలోనే భూకామందులకు, రాజుకు, ఆలయాలకు భాగాలు. మిగతావారి విషయంలో ఎలావున్నా తిరుమల ఆలయానికి సంబంధించినంతవరకూ రాజులు దానాలిచ్చినా, ఇతర దాతలిచ్చినా, వాటిని దేవదేయాలుగా భావించి, మేలవరం భాగమంతా గ్రామాధికారులే వసూళ్లు చేసి, ఆలయానికి అందచేసే సంప్రదాయం ఉండేది.

గ్రామాలనుండి, ఈ ‘మేలవరం’ భాగంలోని పన్నులే కాక, ఇతర పన్నులు కూడా వసూలు చేసేవారు. బంగారం కొనుగోలు – అమ్మకాల మీద పన్ను, ధాన్యం కొనుగోలు-అమ్మకాలపై పన్ను, భూమి అమ్మకం/కొనుగోలు పన్ను, ఉచితంగా సేవలందించడానికి పన్ను, జంతువుల మీద పన్ను, రాకపోకల పన్ను, వర్తకదారులమీద పన్ను, నూనె తీసేవారి మీద పన్ను, బట్టలు నేసేవారి మీద పన్ను, తోటలు పెంపకంపై పన్ను, చేపల చెరువులపై పన్ను, బందెలదొడ్ల పన్ను – తప్పిపోయిన జంతువులు… ఇలా రకరకాల పన్నులు- కొన్ని సందర్భాలలో ‘యువరాజు పెంపకానికి’, ‘రాజమాత ఖర్చులకు’ విడిగా పన్నులు వసూలు చేశారు. రాజుగారిని శత్రువులు ఎత్తుకుపోతే చెరవిడిపించడానికి శత్రువులకు కట్టడానికి గ్రామానికింత అని వసూలు చేసే పన్ను…!

తిరుమల ఆలయం విషయంలో గ్రామాన్ని దేవదేయంగా రాజు ఇచ్చినా, ఇతర దాతలు ఇచ్చినా ఆ గ్రామం విషయంలో పై చెప్పిన పన్నులన్నీ రద్దయినట్లే. అంటే ఆ గ్రామం నుండి వచ్చే అన్నిరకాల ఆదాయాలూ ఆలయానికి చెందుతాయి.
గ్రామాన్ని ఏ దాతైనా దానంగా ఇవ్వాలనుకుంటే, ఆ గ్రామంపై రాజుకు వచ్చే ఆదాయం, ఇతరులకు వచ్చే ఆదాయం, అంతా కలుపుకొని, ఆ గ్రామానికి ఒక ధర నిర్ణయించి, అంత ధనం కట్టినవారికి, దేవదేయం చేయిస్తారు. అందులో కొంత భూకామందులకు వారి భాగం, ఇతరులకు వారి భాగం, మిగతాది రాజుకు వెళతాయి. ఈ మార్పు వలన భూమిని నిజంగా సాగు చేసేవారి భాగంలో ఎటువంటి మార్పు లేదు.

‘తిరుపతి’ గ్రామాన్ని దేవదేయంగా తిరువేంకటనాథ యాదవరాయరు (అప్పటి సామంతరాజు) చేసినప్పుడు, చెక్కించిన శిలాశాసనంలో ఈ విషయాలు చాలా విపులంగా ఉన్నాయి.

ఇటువంటి దేవదేయాలు – గ్రామాల పరిధిలో కాని, లేదా ఆలయ అధికారుల సమక్షంలో కాని జరగవచ్చు. గ్రామాల పరిధిలో జరిగితే, ఇచ్చిన దేవదేయాల గురించి ఆలయ స్థానత్తారులకు (అధికారులకు) గ్రామాధికారులు తెలియజేస్తారు.
తిరుమల ఆలయ భూముల్ని, దేవదేయంగా వచ్చిన గ్రామాల్ని కాపాడుకోవడం ఒక పెద్ద సమస్య.

అయితే ప్రజలలో దైవభక్తి, పాపభీతి బాగా ఉండటంవల్ల తిరుమల శ్రీనివాసుడి భూముల, గ్రామాల సరిహద్దుల్ని సూచిస్తూ సర్వే రాళ్లన్నింటిమీద సుదర్శనచక్రాన్ని చెక్కించేవారు. ప్రజలు ఆ సుదర్శనచక్రాన్ని చూస్తూనే ‘‘దేవుడి మాన్యం’’ అనుకుంటూ భక్తితో పక్కకి తప్పుకునేవారు. అలా ‘సుదర్శనచక్రం’ ఆ స్వామివారి దేవదేయాన్ని కాపాడుతూ ఉండేది.
•••

PVRK ప్రసాద్

Note : నా ఆధ్యాత్మిక జీవితాన్ని పూర్తిగా మార్చివేసిన T.T.D E.O. పోస్ట్, ఊహకందని శ్రీనివాసుని లీలల సమాహారం – నాహం కర్తా హరిః కర్తా