ముసునూరి ప్రోలయ నాయకుడు

– రామకృష్ణ వెల్లంకి

వందల సంవత్సరాల ముస్లిం దురాక్రమణదారుల పాలనలో హిందువులు ఘోరంగా అణచివేతకు గురిచేయబడి అత్యంత క్రూరంగా హింసించబడ్డారు.  

ముసునూరి వంశానికి చెందిన విలాసదాన శాసనంలోని ప్రోలయ నాయకుడు నాటి హిందువుల దుస్థితిని ఇలా వర్ణించాడు –ధనవంతులను వివిధ క్రూరమైన మార్గాల ద్వారా దోచుకున్నారు, బ్రాహ్మణులు తమ తమ ధర్మానుసారం కర్మలు చేయడానికి అనుమతించబడలేదు, వేద పండితుల కోసం సమకూర్చిన అగ్రహారాలను లాక్కున్నారు, అనేక దేవాలయాలను ధ్వంసం చేశారు, దేవతా విగ్రహాలను అపవిత్రం చేశారు.  నాటి విధ్వంసకర పాలనలో అనేక మంది హిందువులు చనిపోవడానికి సిద్ధపడినారు.  ముష్కర పాలకులు రైతుల నుండి పచ్చని పొలాలను లాక్కుని పంటలను దోచుకున్నారుధనికులు, పేదలు ఇద్దరూ లేమితో బాధపడ్డారు భయానక పరిస్థితుల్లో ప్రజలు తమ సంపదను, భూములను, మహిళలను తమవిగా భావించలేకపోయారు. ముస్లిములు మద్యపానం, గొడ్డు మాంసం తినడం, స్త్రీలపై అత్యాచారాలు చేయడం, బ్రాహ్మణులను చంపడంలో పైశాచికానందం పొందసాగారు. నాటి ప్రజలు  బ్రతకడమెలాగో అర్థంకాక, తమను రక్షించేదెవరు అని వాపోసాగారు.  త్రిలింగ భూమిలో ప్రతి పౌరుడూ రక్షణ లేక దిక్కులేనివారైనారు.  యవనులు, ముస్లిములు రాక్షసులను పోలి ఉంటారు.   దేశము అగ్నికి ఆహుతి అవుతున్న అడవి కాసాగింది.

ముసునూరి ప్రోలయ నాయకునిచే జరిపిన అనేక యుద్ధాలను విలాసశాసనం వివరిస్తుంది. ప్రోలయనాయకుడు బ్రాహ్మణుల నుండి దూరాక్రమణదారులు దోచుకున్న అగ్రహారాలను తిరిగి ఇప్పించాడు.  తురుష్కులు అడుగు పెట్టి అపవిత్రం చేసిన భూములపై యజ్ఞాలు నిర్వహించి, తిరిగి వాటిని పుణ్యభూములుగా చేశాడు.  ప్రోలయ నాయకుడు చేపట్టిన ప్రజోపయోగ పాలనకు సంతసించిన రైతులు సంతోషంతో తమ ఆదాయంలో సింహభాగం  రాజుకు విరాళంగా ఇచ్చారుప్రోలయ నాయకుడు మునుపటి హిందూ వైభవాన్ని పునః ప్రతిష్టించాడు.

నాటి తురుష్కుల నాయకుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ నిరంకుశ పాలనను, భారీ పన్నులు విధించి వ్యవసాయాన్ని, రైతులను నాశనం చేసి, ప్రజలను అణచివేసిన తీరును జియాజుద్దీన్ బర్నీ వంటి ముస్లిం చరిత్రకారులే ఈ విధంగా  వర్ణించారు. “వ్యవసాయం తీవ్రమైన నిరాదరణకు నోచుకుంది, ఆహార ధాన్యాలకు తీవ్రమైన కొరత ఏర్పడింది, ఫలితంగా వేలాది మంది ఆకలితో అలమటిస్తూ మరణించారు.

జియాజుద్దీన్ బర్నీ ఇంకా ఇలా వ్రాశాడు, “సుల్తాన్, దేశాన్ని మరియు ప్రజలను నాశనం చేయడానికి కుత్సిత ప్రణాళిక వేశాడురెండు నదుల మధ్య ఉన్న సువిశాల భూముల్లో రైతులపై 10 శాతానికి పైగా అదనపు పన్నులు విధించాడు.  రైతులను వెన్నుపోటు పొడిచే వరకు సుల్తాన్ నిద్రపోలేదు.   అత్యధిక పన్నులు అత్యంత హింసాత్మకంగా వసూలు చేయడంతో,  సంపన్న రైతులు సయితం  బిచ్చగాళ్లుగా మారారుభూములు, వ్యవసాయం సర్వనాశనమయ్యాయి.   ప్రాంతమంతా ఓ బీడుభూమిగా మారింది“.

అటువంటి దుర్భర పరిస్థితులలో హిందూ సమాజాన్ని కాపాడడానికి, విష్ణు అంశగా వచ్చినట్లు, నాలుగవ  కులానికి చెందిన ముసునూరి కుటుంబంలో పుట్టిన  ప్రోల రాజు ఈ పవిత్ర భూమి సార్వభౌమత్వాన్ని స్వీకరించాడు. తన బలాన్ని ఎదిరించలేక కోటలను వదిలి అజ్ఞాత ప్రాంతాలకు పారిపోయిన యవనులను వెంటాడి వారి శక్తిని నాశనం చేశాడుయవనుల చేతిలో ఎనలేని బాధలు అనుభవించిన దేశ ప్రజలు ప్రోలయ నాయకుని ఛత్రచ్చాయలో రక్షణ పొంది అమిత ధైర్యంతో శత్రువులను తుద ముట్టించారు.” 

 

ముసునూరి నాయకులు (ఆంధ్రుల చరిత్రలో మరచిపోయిన అధ్యాయం)

శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ

ప్రచురణ:  ఆంధ్ర విశ్వవిద్యాలయం, గుంటూరు (1944)