RSS NEWS

  • ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 
    ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు – వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసి, సాధించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లో 1975-77 మధ్య కాలంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ భారత చరిత్రలోనే మర్చిపోలేని చీకటి అధ్యాయం. 25 జూన్ 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 21 మర్చి 1977 వరకు 21 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దేశంలో అస్థిరత […]
  • నియంతృత్వ ఎమర్జెన్సీకి 49 ఏళ్లు
    -ప్రదక్షిణ వరిష్ట పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహంగారి పుస్తకం `ఎమర్జెన్సీ జ్ఞ్యాపకాలు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం’ ఆధారంగా ఈ వ్యాసం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ విధించిన 25 జూన్ 1975 రాత్రి నుంచి తీవ్రమైన దమనకాండ ప్రారంభమైంది. ప్రజల పౌరహక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా అధికారికంగా హరించబడ్డాయి. పత్రికలపై పూర్తి స్థాయి సెన్సర్షిప్ విధించబడింది. అన్ని రాజ్యాంగ సంస్థలు పూర్తిగా, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె ఆంతరంగిక బృందం ఆధీనంలో ఉండి, […]
  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం […]
  • వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ – హిందూ సామ్రాజ్య దినోత్సవం
    1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన […]
  • వీరనారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి
    భారతదేశం ఎందరో వీరులను వీర మాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు వీర మాతలు ఈ గడ్డ పై జన్మించారు. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణపాయంగా ఎంచి తల్లిభారతి పాదాల చెంత సమ్పర్పించారు. తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యులారు ‘మణి’ కర్ణిక… మన రాణి ఝాన్సీ లక్ష్మీ భాయి. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి […]
  • శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్
    -అనంత్ సేథ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 5వ సర్ సంఘచాలక్ శ్రీ కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్ జీ ఆషాఢ శుద్ధ తృతీయ, 18 జూన్ 1931 నాడు రాయ్ పూర్ లో జన్మించారు. వారు 9 సం|| వయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళటం ప్రారంభించారు. వారు 6 దశాబ్దాలు సంఘ ప్రచారక్ గా సేవచేసి, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ్ జీ తర్వాత 2000 సం|| లో సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. చదువు రీత్యా ఇంజనీర్ అయిన వారు, శారీరిక దార్ఢ్యత మరియు […]
  • RSS Sarsanghchalak Late KS Sudarshan Birth Anniversary: Committed to swadeshi and economic self-reliance
    KS Sudarshan was directly associated with Swadeshi Jagran Manch (SJM) as Marg-darshak for about 7 years before taking up the responsibility of Sarsanghachalak. After the formation of SJM by Dattopant Thengadi in 1991, Swadeshi movement took off only after its national convention of 1993 in Delhi. With the support from karyakartas of Rashtriya Swayamsevak Sangh […]
  • ఐరోపాలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభం
    ఐరోపాలో అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతంలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభోత్సవం జరిగింది. జూన్‌ 4 న ఈ ఉత్సవాలు ప్రారంభమై… పదమూడో తేదీ వరకూ వైభవోపేతంగా జరిగాయి. దేవాలయ ప్రారంభోత్సవం, మహా కుంభాభిషేకం తమిళనాడుకి చెందిన భూపతి శివాచార్య స్వామిగల్‌, వెంకటేష్‌ జయరామ్‌ అనే అర్చకులు నిర్వహించారు. సంప్రదాయమైన ముఖ్య ఘట్టాలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత శివునితో పాటు శ్రీ కర్పగ నాధర్‌, బ్రహ్మంద్‌ […]
  • మోహన్ భాగవత్ అలా అనలేదు : క్లారిటీ ఇచ్చిన సంఘ్
    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌  వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా హిందీ పత్రిక దైనిక్‌ జాగరణ్‌ ఓ వార్త ప్రచురించింది. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆరెస్సెస్ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మోహన్‌ భాగవత్‌ స్పందించారని ఆ పత్రిక పేర్కొంది. “మన దేశంలోని ప్రతి పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్చ వుందని, నడ్డా […]
  • దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు
    మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలన్న (డీ లిస్టింగ్‌) ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. వనవాసీ సంఘాలు దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో డీ లిస్టింగ్‌ డిమాండ్‌ తో ‘‘పోస్ట్‌కార్డ్‌’’ ఉద్యమాన్ని కూడా చేస్తున్నారు. కొందరు గిరిజనులు మతం మారినా… ఇప్పటికీ గిరిజన సమాజానికి వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ:వ్యాప్తంగా ‘‘జనజాతి సురక్షా మంచ్‌’’ పేరుతో గిరిజనులందరూ ఏకమై పెద్ద […]

ఐనవోలు మల్లన్న దేవాలయం

తెలంగాణ జీవన విధానానికి, జానపదుల సంస్కృతికి వేదిక ఐనవోలు. అతి పురాతన చరిత్ర గల పుణ్యక్షేత్రమైన ఐనవోలు మల్లన్న జాతరను పూర్వకాలమందు జానపదుల జాతరగా పిలిచేవారు. దీనికి కారణం మైలారు దేవుడు మల్లన్నగా కొలువుదీరిన ప్రాంతం ఐనవోలు కావడమే. తెలంగాణ రాష్ట్రంలో ఈ విగ్రహంను పోలిన దేవాలయాలు ఐదు కలవు. నాలుగు దేవాలయాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండగా , ఒకటి మాత్రమే కరీంనగర్ జిల్లాలో కలదు. కాకతీయ పరిపాలన కాలంలో అయ్యన్న దేవుడనే మంత్రి ఉండేవాడు. ఆయన ఈ దేవాలయం నిర్మించినట్లుగా శాసనముల ద్వారా తెలియుచున్నది.

1100 యేళ్ల చరిత్ర కల్గిన పురాతన శైవక్షేత్రంను అయ్యన్న నిర్మించడం వలన ఈ గ్రామమునకు అయ్యన్నవోలు అనే పేరు వచ్చింది. ఇది కాల క్రమేనా ఐనవోలు, ఐలోనిగా రూపాంతరము చెందినట్లుగా తెలుస్తుంది. ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతున్న హనుమకొండ జిల్లా ఐనవోలు గ్రామంలో కొలువుదీరిన ఈ ఆలయం విశాల ప్రాంగణంతో , శిల్పకళా వైభవంతో , అష్టోత్తర స్తంభములతో, కాకతీయుల కళాతోరణములతో, సింహద్వారములతో చూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది. కోటి వరాలిచ్చే భక్తుల కొంగు బంగారం, ఆపదలను తీర్చే మల్లికార్జునుడు.

పుట్టమన్నుతో పూజలు అందుకునే మల్లికార్జునస్వామి కొలువుదీరిన ప్రాంతమే ఐనవోలు. కోరమీసాల మల్లన్న ఓ చేతిలో ఖడ్గం, మరో చేతిలో త్రిశూలంతో ఖండేలు రాయుడిగా భక్తులకు దర్శనం ఇస్తాడు. కుడిపాదం కింద మల్లన్న చేతిలో చనిపోయిన మాణిమల్లసురుల శిరస్సులు కనిపిస్తాయి. మల్లన్నకు కుడివైపున గొల్ల కేతమ్మ, ఎడమవైపున బలిజ మేడలమ్మ అమ్మవార్లు కొలువుదీరి ఉంటారు.. గొల్ల కేతమ్మ మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన అమ్మవారిగా చెబుతారు. తన ఆడపడుచు గొల్లకేతమ్మను పెళ్లి చేసుకున్నదున మల్లికార్జునస్వామిని వారి ఇలవేల్పుగా గొల్లకురుమలు పసుపు బండారితో పూజిస్తారు.

ఇక రెండో భార్య బలిజమేడలమ్మ కర్ణాటక ప్రాంతవాసి. కర్ణాటక ప్రాంతంలో పుట్టిన ఖండేలు రాయుడు కర్ణాటక నుంచి మహారాష్ట్ర వరకు పరిపాలించాడు. కనుక మల్లన్న కర్ణాటక ప్రాంతానికి చెందిన బలిజ మేడలమ్మను కూడా వివాహం చేసుకున్నాడు. ఈ విగ్రహాల ఎదురుగా నిర్వికార నిరహంకార స్థితి లింగస్వరూపంలో మూలవిరాట్ మల్లికార్జునస్వామి ఉండటము. ఇట్టి లింగస్వరూపం అర్ధపానపట్టం కల్గి ఉండటం విశేషం. ఇలాంటి లింగాలు ఉండటం అరుదు. ఈ లింగం శ్వేత వర్ణం కలిగి ఉందని, ఎంతో ప్రాచీనమైనదని శైవాగమ పండితుల అభిప్రాయం.

రాష్ట్ర కూటులు, కళ్యాని చాళుక్యులు, కాకతీయులు – ఏ రాజుల చరిత్రను పరిశీలించినా వారంతా ఐనవోలు మల్లికార్జునస్వామి భక్తులేనని చారిత్రక ఆనవాళ్లు, శిలా శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. శివభక్తులకు మహా పుణ్యక్షేత్రం ఐనవోలు. సంక్రాంతి నుంచి ఉగాది వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతుండటం ఈ ఆలయ విశిష్టత. ఒగ్గు కథలతో, శివసత్తుల పూనకాలు, దేవుడి పట్నాలు, బోనాలతో సందడిగా మారి, ఆధ్యాత్మికతను సంతరించుకుంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి గాంచిన ఐనవోలు  మల్లన్న జాతరలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఎడ్ల బండ్లల్లో, వాహనాల్లో, కాలినడకన, సవారీ జంతువులపైన కూడా భక్తులు రెండ్రోజుల ముందుగానే ఐనవోలు క్షేత్రాన్ని చేరుకుని విడిది చేస్తారు. బోనం, పట్నాలు, బండారి సమర్పించి మల్లన్నను తరిస్తారు.

ఇక్కడ స్వామివారికి బండారి అంటే పసుపుని భక్తులు కానుకగా చెల్లిస్తారు. అదే పసుపును ప్రసాదంగా తీసుకుంటారు. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే స్వామివారి చేతిలో ఉన్న పసుపును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఉత్సవ సమయాల్లో కిలోల కొద్ది పసుపు ఉపయోగిస్తారు. మల్లన్న స్వామి భక్తుల ద్వారా జరిగే ముఖ్య పూజలలో బోనాలు సమర్పించడం, పట్నాలు వేయడం, ఒగ్గు పూజారీల ద్వారా చెల్లించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులలో చాలామంది సంతానము గురించి టెంకాయ బంధనం కట్టి వారికి సంతానం కల్గిన తర్వాత టెంకాయ ముడుపు విప్పి, మల్లన్న మొక్కు చెల్లిస్తారు.

ఇక గండాలు తీరితే గండదీపం పెడతాం, కోరికలు తీరితే కోడెలు కడతాం, పంటలు పండితే పట్నాలు వేస్తాం, ఇంటిల్లిపాది చల్లగా ఉంటే శేవలు తీస్తాం, తలనీలాలు సమర్పిస్తాం అని భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఇక ఈ జాతరలో పెద్ద బోనం, చిన్న బోనం, నిలువ బొట్ల బోనం, చుక్కల బోనం అని భక్తులు తమ ఆనవాయితీ ప్రకారం బోనం చేసి స్వామివారికి నివేదిస్తారు. ఇక ఈ జాతరలో గొల్ల , కురుమలే ఒగ్గు పూజారులుగా తమ కథాగానం వినిపిస్తారు. పట్నాలు వేసి, ఒగ్గు పూజారిచే పూజలు చేపిస్తేనే అసలుసిసలైన బోనం సమర్పించినట్లుగా భక్తుల విశ్వాసం. అంతేకాదు శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, ఢమరుకం మోతలతో ఈ జాతర మార్మోగుతుంది.

భోగి, సంక్రాంతి పర్వదినం ముందు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఐలోని మల్లన్న జాతర వేడుకల్లో భోగి నుంచి కనుమ వరకు భక్తుల లక్షలాది సంఖ్యలో పాల్గొంటారు. మకర సంక్రాంతి పండుగ రోజు రాత్రి ప్రభల బండ్లు తిరుగుట ఈ జాతరలో విశేషం. మార్నేని వంశస్తుల శిడినథాన్ని పునరుద్దరించి దేవుడి పెద్దరథంగా మార్చి ఉత్సవాలలో ప్రదక్షినం చేయిస్తున్నారు. దీనితో పాటు కుక్కల కొట్లాట, చల్లకుండల నెత్తుట, తలబండారి పెట్టుకొని మొక్కులు చెల్లించుతారు. భక్తిభావంతో పాటు వినోదాత్మకంగా సాగుతుండే ఈ జాతర బహుప్రాశస్త్యమైంది.

కాకతీయుల కాలం నుంచి ఆలయ నిర్వహణ స్థానిక మార్నేని వంశస్తులు, కురుమలు, శైవారాధకులు ( తమ్మలు) సంయుక్తంగా నిర్వహించేవారు. జానపదుల జాతరగా పేరుగాంచిన ఐనవోలు కీర్తి మరింత విస్తరించి ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో అప్పటి వరకు హక్కుదారుగా కొనసాగిన మార్నేని వంశీయులు 1968 లో స్వచ్ఛందంగా ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చారు. తొలి సారి చైర్మన్ గా భాద్యతలు స్వీకరించిన మార్నేని జగన్నాథరావు అభివృద్ధికి శ్రీకారం చుట్టడంతో నాటి నుంచి నేటి వరకు అంచెలంచెలుగా ఎదిగి శ్రీ మల్లికార్జున స్వామి ఘనవైభవం నలుదిశలా విస్తరించింది.

వరంగల్ మహానగరానికి సుమారు 16 కిలో మీటర్ల దూరంలో ఉండే ఐనవోలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యాక అభివృద్ధికి నోచుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ఐనవోలు మల్లన్న క్షేత్రాన్ని అభివృద్ధి చేసింది. బ్రహ్మోత్సవాల సమయంలోనే కాకుండా యేడాది పాటు భక్తులు మల్లన్నను దర్శించుకునేందుకు వస్తూనే ఉంటారు. భక్తుల సౌకర్యార్థం అధునాతన గదులు, అతిథి గృహాలు  నిర్మించారు.  స్త్రీల స్నానాల గదులు, మరుగుదొడ్లు , నూతనంగా ధ్వజస్తంభం, నందికేశ్వర, విఘ్నేశ్వరులను ప్రతిష్టించారు. సాలహార నిర్మాణం జరిగింది. ఇక పిల్లలు ఆడుకునేందుకు ఎగ్జిబిషన్ ఏర్పాటు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, తినుబండారాల దుకాణాలు ఇక్కడ చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి.