ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కాకతీయ రాజుల పేరు సుపరిచితము.కాకతీయ ప్రభువులు తమ శక్తి సామర్థ్యాలు,ఆర్థిక అభివృద్ధి, ప్రజాసంక్షేమ పాలనతో అందరి మనసులలో చిరస్థాయిగా మిగిలిపోయారు.11, 14 శతాబ్దాల మధ్య వీరి పాలన సాగినా, తమిళనాడు ప్రాంతంలో సాగిన చోళ,పాండ్య రాజ్యపాలనకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు కాకతీయ పాలనకు రాలేదు. కారణం వీరి పాలన గురించి ఆంధ్రదేశం బయట పెద్దగా తెలియకపోవడమే.
కాకతీయులు అపారమైన తమ శక్తి సామర్థ్యాలతో తెలుగుజాతికి విశేష గుర్తింపు తీసుకువచ్చి, స్వయం ప్రతిపత్తి గల సాంస్కృతిక వైభవంతో కాకతీయ సామ్రాజ్యం నెలకొల్పారు .ప్రస్తుతం ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు, దక్షిణ ఒరిస్సా ప్రాంతము కాకతీయ పాలనలో ఉండేవి.ప్రారంభంలో ఓరుగల్లు (ప్రస్తుత వరంగల్) ను రాజధానిగా ఏర్పరచుకుని కళ్యాణి ప్రాంతమును పాలించే చాళుక్య రాజలకు సామంతులుగా కాకతీయుల పాలన సాగింది. ప్రోల రాజుగా
ప్రసిదికేక్కిన బేత రాజుతో ప్రారంభమైన కాకతీయ వంశము రెండో ప్రోల రాజు కుమారుడైన ప్రతాపరుద్రుని పాలనలో సర్వ స్వతంత్ర రాజ్యంగా ఏర్పడినది.ప్రతాపరుతుడు కాకతీయ సామ్రాజ్యమును 1158-1195 మధ్య కాలంలో పరిపాలించినాడు.కాకతీయ రాజులలో 1199- 1262 సంవత్సరాల మధ్య అతి దీర్ఘకాలం పాలించిన గణపతి దేవుడు తన పరిపాల సామర్థ్యంతో అత్యంత ప్రతిభావంతునిగా పేరుగాంచాడు.కాకతీయుల పాలనలో చిన్న చిన్న ప్రభువులు, పరిపాలకుల ద్వారా పటిష్టమైన పాలన సాగడంతో వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెంది ఇతర ఖండాలకు విస్తరించాయి.అనేక శాసనాల ద్వారా వీరి పాలనలో సాగిన ఆర్థిక వాణిజ్య అభివృద్ధి దక్షిణ భారతదేశ౦ అంతట ఎలా విస్తరి౦చిందో తెలుస్తుంది.వర్తక వాణిజ్యమే కాదు- వీరు వ్యవసాయం,నీటిపారుదల రంగాలను ఎంతో అభివృద్ధి చేశారు. కాకతీయ సామ్రాజ్యంలో ఉన్న అనేక ప్రకృతి వనరులను,సస్యశ్యామలమైన భూములను వ్యవసాయోగ్యంగా మార్చినారు.కాకతీయ కాలంలోని శాసనాల ద్వారా తెలుస్తున్న మరో విశేషమైన విషయం- కాకతీయ రాజులు,వీరి క్రింద పరిపాలకులు అనేక గ్రామాలను నెలకొల్పారు. ఈ గ్రామాల్లో జీవనానికి అవసరమైన అనేక తటకాలను త్రవించారు.చెరువులలో నీరు నిండుటకు, వ్యవసాయ యోగ్యం చేయబడిన అనేక బీడు భూములు సాగునకు కాలువలు త్రవ్వించారు.ఎంతో దూర దృష్టితో వీరు త్రవ్వించిన చెరువులు,తటాకాలు నేటికి వీరు పాలించిన ప్రాంతములలో సజీవ దర్పణాలుగా వెలుగొ౦దుతున్నాయి .ఆర్థిక,వాణిజ్యాభివృద్ధియే కాదు,కాకతీయ సామ్రాజ్యం గొప్ప సాంస్కృతిక వైభవంతో వెలుగొందింది. వరంగల్ లో కాకతీయ రాజులచే నిర్మింపబడిన వెయ్యి స్తంభాల గుడి వీరి సాంస్కృతికి వారసత్వమే.
కాకతీయ రాజుల పాలనలో సాగిన ఆర్థిక,వాణిజ్యఅభివృద్ధి
సమూలమైన మార్పులకు నాంది పలికింది.ఎటువంటి పక్షపాత వైఖరి అవలంబించకుండా అనేక వర్తక సముదాయాలు నెలకొల్పారు.తమ రాజ్యానికే పరిమితం కాకుండా వర్తక వాణిజ్యాలు ఇతర ప్రాంతాలకు విస్తరింపచేశారు.ఇందు కోసం వాణిజ్యాన్ని దేశీయ, పరదేశీయా వ్యాపారులుగా విభజించారు.దేశీయ వర్తకం తమ సామ్రాజ్యంలో మాత్రమే జరుగుతుంటే,పరదేశీ వర్తక౦ ఇతర రాజ్యాలతో జరుగుతుండేది.వర్తకం జరిగే ప్రదేశాన్ని “పెంట” లేదా “పేట” అని పిలిచేవారు. నేడు ఊరు పేరు చివర “పేట” ఉన్న అనేక పట్టణాలు కాకతీయ పాలనలో వాణిజ్య కేంద్రాలుగా బాసిల్లినవే.ఈ విధంగా అభివృద్ధి చెందిన వర్తకులతో ఆర్థిక అభివృద్ధికి అనుకూల వాతావరణం, రాజ్యంలో వృత్తి ఉద్యోగాలకు కొరత లేకుండా జరిగింది.క్రీస్తు శకం 1228 వ సంవత్సరంలో గణపతి దేవుడికి చెందిన కోటలో క్రీస్తు శకం 1228 లో రూపొందించిన శాసనముల ద్వారా నాటి కాలం లో ఇతర ప్రాంతాల వర్తకులు బహుకరించిన బహుమానాల వివరాలు చూస్తే,కాకతీయుల పాలనలో వాణిజ్య విస్తరణ ఎంత ఘనంగా జరిగిందో విధితమవుతుంది. ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని మోటుపల్లి నౌకాశ్రయం నేటికీ కాకతీయుల వాణిజ్య అభివృద్ధికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది.గణపతి దేవుని “మోటుపల్లి అభయ శాసనం”ద్వారా నాటి కాలంలో అనేక దక్షిణాసియా, కొన్ని యూరోప్ దేశాలలో సాగిన వాణిజ్య సంబంధాల గురించి తెలుస్తుంది.ప్రఖ్యాత విదేశీ పర్యాటకుడు మార్కోపోలో ఈ మోటుపల్లి నౌకాశ్రయాన్ని సందర్శించాడు.అప్పుడు రాణి రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యాన్ని పాలిస్తుంది.రాణి రుద్రమదేవి అత్యంత ప్రతిభావంతమైన రాణి అని,ఆమె పాలలో ప్రజలందరూ సమానంగా న్యాయబద్ధంగా పరిపాలించబడ్డారని మార్పుపోలో పేర్కొన్నాడు. అంతేకాదు ప్రజలందరి చేత అభిమానింపబడ్డ,కీర్తించబడ్డ మరొక పాలకుడు లేడని మార్కోపోలు అన్నాడు .నాటి వాణిజ్యం గురించి మార్కోపోలో మరింత ముందుకు వెళుతూ కాకతీయ సామ్రాజ్యంలో వజ్రాలు,అత్యంత విశిష్టమైన నాణ్యత గల పత్తి లభ్యమయ్యేవి అని రాస్తాడు. నాణ్యత గల పట్టు వస్త్రాలు,వజ్రాలు,మరెన్నో వస్తువులు మోటుపల్లి నౌకాశ్రయం ద్వారా తూర్పు దేశాలతో వాణిజ్యం చేసేవారని మార్కోపోలో తన అనుభవాలను రాస్తాడు.రాణి రుద్రమ పాలనలో ప్రజలందరికీ పౌష్టికరమైన వరి,పాలు,పండ్లు మరియు చేపలు ఆహరంగా లభించేవి. కాకతీయుల పాలనలో మోటుపల్లి నౌకాశ్రయం ముఖ్యమైన అంతర్జాతీయ వర్తక కేంద్రంగా మారింది.గణపతి దేవుడు అందుకు అనుగుణంగా అక్కడ ప్రజల,వర్తకులకు సముద్ర దొంగల నుండి విపత్తు రాకుండా తగు చర్యలు తీసుకునేవాడు . గణపతి దేవుడు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సుసంపన్నమైన మోటుపల్లి నౌకాశ్రయం విదేశీ దండయాత్రలకు గురై,వర్తకం అతలాకుతలమై౦ది. గణపతి దేవుని మోటుపల్లి అభయ వర్తక శాసనం ద్వారా నాటి వర్తకుల భద్రత, వారి ఉత్పత్తుల భద్రతకు ఎటువంటి అభయమిచ్చారో తెలుపుతుంది.వీరభద్ర స్వామి దేవాలయం ముందర గల స్థంభం మీద చెక్కబడిన ఈ అపురూప శాసనం ద్వారా గణపతి దేవుని పాలనలో వాణిజ్య పన్నులు ఎంత సులభంగా ఉండెవో విధితమవుతుంది .అంతేకాదు కాకతీయులు వర్తక వాణిజ్యాభివృద్ధి పట్ల ఎంత శ్రద్ధ చూపారో,వాటి రక్షణకు ఎటువంటి కఠిన చట్టాలు తీసుకు వచ్చారో మనకు అర్థమవుతుంది.పురాతన కాలం నుండి మన రాజులు దేశయ,అంతర్జాతీయ వర్తకం వాటి విధి విధానాలు,పన్నుల పట్ల ఎంత ప్రణాళికబద్ధంగా వ్యవహరించేవారో కూడా అర్థమవుతుంది.1323సం:లో ప్రతాపరుద్రుని పాలనలో కాకతీయుల నుండి మహమ్మద్ బిన్ తుగ్లక్ వశమైన మోటుపల్లి నౌకాశ్రయం ను తిరిగి అన్నపోతారెడ్డి వశపరచుకున్నాడు. వీరభద్ర స్వామి దేవాలయం ముందరగల మరో స్తంభ౦ పై తెలుగు,తమిళంలో అన్నపోతారెడ్డి మరో శాసనం చెక్కించాడు.ఆఖండ భారత దేశంలో అనేకమంది రాజులు ఎంతో దూర దృష్టితో క్రమబద్ధమైన వర్ధక వాణిజ్య వ్యవస్థ, పన్నుల విధానాలను రూపొందించారో తెలుసుకోవడానికి పైన పేర్కొన్నది ఒక తార్కాణం.ఇటువంటి వ్యవస్థల గురించి మన దేశంలో అనేక శాసనాలు ఉన్నాయి.అవి నేటి తరం వాణిజ్య సంబంధాలకు ఆదర్శమే.
మన పూర్వీకులు అందమైన ఆభారణము లు,వస్త్రములు,ఖనిజ ఉత్పత్తులు,వైద్యం,ముద్రణ,ఆయుధాల తయారీ ,యుద్ధ విద్యాల యందు ఎంతో పరిణతి చెందినవారు.ఇది ఎవరు కాదనలేని అక్షర సత్యం.
భారతీయులుగా మనం ఇతరుల నుండి నేర్చుకునే అవసరం లేని వారసత్వం మనకు మన పూర్వీకులు సముపార్జి౦ఛి పెట్టారు.మానవాలి అభివృద్ధికి భారతదేశ౦ అందించిన జ్ఞానం ,సహకారం విశిష్టమైన,వెలకట్టలేనిది. ఈ వారసత్వాన్ని మనం కాపాడుకొని,రాబోయే తరములకు అందించాలి . తద్వార మాత్రమే మనం మన సంస్కృతిని, అపురూపమైన వారసత్వాన్ని కాపాడుకోగలం.
Compilation and translation by Sri Vellanki Ramakrishna
More Stories
తెలంగాణ కాలాపానీ జైలు మన్ననూరు
విద్యారణ్య స్వామి శృంగేరి పీఠాధిపతి, విజయనగర సామ్రాజ్య రాజ గురువు
వేములవాడ రాజన్న ఆలయ చరిత్ర