
సామాన్య శకం 8వ శతాబ్దంలో నిర్మించిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారమై విలసిల్లుతోంది. కోరిన కోరికలు తీర్చే వేములవాడ రాజన్న ఆలయం ఎంతో పురాతన ప్రాశస్త్యం కలిగినది. పశ్చిమ చాళుక్యల వారికి ఈ ప్రాంతం రాజధానిగా వుండేదని పురాతత్వ ఆధారాలు తెలుపుతున్నాయి. దానిప్రకారం క్రీ.శ. 8వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించబడినట్లు ఆధారాలున్నాయి.
ఆనాటి వేములవాడ ప్రాంతానికి మొదటి చాళిక్యరాజు అయిన నరసింహుడు రాజుగా ఉండేవారు. ఆయనకు ‘రాజాదిత్య’ అనే బిరుదు ఉండేది. ఆయన పేరు మీదుగానే ఈ ఆలయానికి రాజరాజేశ్వర ఆలయం అని పేరు వచ్చిందని చరిత్రకారులు అభిప్రాయపడుతుంటారు.
చాళిక్యుల కాలంలో ఈ క్షేత్రం మహామహివాన్విత క్షేత్రంగా వెలుగొందని చరిత్రకారుల అంచనా. ఈ ఆలయం చుట్టూ వున్న దేవాలయాలను నిర్మించడానికి ఆనాటి చాళిక్యుల కాలంలో సుమారు 220 సంవత్సరాల కాలం పట్టిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయ లింగ ప్రతిష్ట వెనుక కూడా ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం అర్జునుడి మునిమనవడయిన నరేంద్రుడు ఒక మునిని చంపడం వల్ల అతనికి బ్రహ్మ హత్యాపాతకం కలుగుతుంది. దాని నుండి విమోచన పొందడం కోసం నరేంద్రుడు దేశాటన చేస్తూ వేములవాడ ప్రాంతానికి చేరుకున్నాడు. ఇక్కడే వున్న ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తూ కాలాన్ని గడిపాడు.
అలా ఆవిధంగా జపం చేస్తున్న నరేంద్రునికి ఒకరోజు కొలనులో ఒక శివలింగం దొరికిందట. ఆ శివలింగాన్ని అతను ఇప్పుడున్న వేములవాడ ప్రాంతంలో ప్రతిష్టించి భక్తితో పూజించడం మొదలుపెట్టాడు. శివుడు అతడి భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నరేంద్రుడు తనని బ్రహ్మ హత్యాపాతకం నుండి విమోచనం చేయవలసిందని కోరగా… శివుడు అతడికి విముక్తి ప్రసాదిస్తాడు.
ఇలా ఈవిధంగా ఏర్పడిన ఈ క్షేత్రం ‘లేంబాల వాటిక’గా, ‘భాస్కర క్షేత్రం’, ‘హరిహర క్షేత్రం’గా పిలవబడింది. ఈ రాజేశ్వర ఖండంకు సంబంధించిన కథ భవిష్కోత్తర పురాణంలో వివరంగా చెప్పబడి వుంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా 100 మంది అర్చకులతో ఈ మహాలింగానికి అర్చన చేయబడుతుంది.
ఇక్కడ భక్తులు నిర్వహించుకునే ప్రధాన పూజలలో కోడెముక్కు ఒకటి. ఈ పూజలో మొదటగా భక్తులు ఒక గిత్తను తీసుకుని గుడిచుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. ఆ తరువాత ఆలయ ప్రాంగణంలో దానిని కట్టేసి, దక్షిణగా ఇచ్చేస్తారు. ఈ విధంగా ఈ పూజను నిర్వహించుకోవడం వల్ల వారికి సంతానం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.
మనదేశంలో అనేక హిందూ దేవలయాలనానుకుని విదేశీ దూరాక్రమనదారులచే నిర్మింపబడిన మసీదులూ, దర్గాలూ ఉన్నట్లే మన వేములవాడ దేవాలయం పరిక్రమలో కూడా ఒక అక్రమ దర్గా నిర్మింపబడింది. ఈ అక్రమ మసీదులు, దర్గాల నిర్మాణం గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
హిందూ దేశం తన సుదీర్ఘమైన చరిత్రలో ఎన్నో విదేశీ దండయాత్రలను ఎదుర్కోవలసి వచ్చింది. అటువంటి దండయాత్రలను ఎదిరించటమే గాక, ఆ ఆక్రామకులను తరిమికొట్టిన చరిత్ర హిందువులకు ఉన్నది. కాగా క్రీ.శ. 712లో బాగ్దాద్లోని అరబ్ పాలకుల ద్వారా పంపబడిన మొహమ్మద్ బిన్ కోసం దండయాత్రతో మొదలుకొని కొన్ని శతాబ్దాలపాటు హిందువులు జీవన్మరణ సమస్యగా దాపురించిన అనేక దండయాత్రలను ఎదుర్కోవలసి వచ్చింది. అనుక్షణమూ పోరాడుతూ గడపవలసి వచ్చింది. క్రీ.శ.712 నాటి అరబ్బుల దండయాత్ర నుండి క్రీ.శ 1707లో ఔరంగజేబ్ మరణం వరకూ గల కాలఖండం ఒక సుదీరమైన పీడకల. ఐరోపాలో ‘నూరు సంవత్సరాల యుద్ధం’గా వర్ణింపబడిన యుద్ధముకు ఇంగ్లాండ్, ఫ్రాన్సు దేశాల మధ్య సంభవించింది. కాగా ఇక్కడ మనదేశంలో హిందువులు ఆక్రామకులుగా వచ్చిన మహమ్మదీయులతో వేయిసంవత్సరాలపాటు యుద్ధం సాగించవలసి వచ్చింది.
ముస్లింల ఈ దండయాత్రలలో చెప్పనలవి కాని బాధలకు, అంతకు ముందెన్నడూ వినియండని దుస్సహమైన అవమానాలకు ఇక్కడి ప్రజలను గురిచేశారు. ఒకరి తర్వాత ఒకరుగా గుంపులు గుంపులుగా రాక్షసమూకలుగా వచ్చిన ఆక్రామకులు ఈ దేశాన్ని మృత్యుసాగరంలోకి త్రోసివేయ యత్నించారు. తమ సేనలలోని యువకులను రెచ్చగొట్టారు. ఇలా దుష్కృత్యాలు సాగిపోతున్న సమయంలో హిందువులు ఎంతో నిబ్బరంగా వాటిని ఎదుర్కొన్నారు. హిందువులు శారీరకంగా ఎన్నో బాధలు పడి ఉండవచ్చు కాని తలవంచలేదు. ఆక్రామకులు ఎన్నో విధాలుగా హిందువులను గాయపరచి ఉండవచ్చు. అయిన హిందువులు తమ వినమ్రతను సహజమైన మంచిగుణాన్ని వదిలిపెట్టలేదు. భయంకరమైన నరమేధం, బలవంతంగా మతాంతరీకరణలు, స్త్రీల అపహరణములు, దేవాలయాల విధ్వంసము నిత్యకృత్యాలుగా జరిగిపోతున్న రోజులలో సైతం హిందువులు ఎంతగా ధైర్యం వహించి, ఈ ఆపదలను సహించారో, ఓర్చుకున్నారో తెలిసికొన్నపుడు ఎంతటివారైనా అవాక్కవుతారు. తమకు ఎదురే లేదు అనుకొని విర్రవీగిన వారిని హిందువులు నిలువరించి సవాలు చేశారు. జయం లభించినా కూడా కొన్ని చోటల మనకున్న ఆధ్యాత్మిక భావన వలన విదేశీ దురాక్రమణ దారుల సమాధులను దర్గాల పేరుతో మనం పూజించడం చూస్తున్నాం. అలాంటి వాటిలో వేముల వాడ లోని మహశివలింగంతో పాటుగా హజరత్ దర్గాని కూడా పూజించడం జరుగుతోంది. ఆ దర్గాకి సంభందించిన కొన్ని వివరాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాము.
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయములో ఉన్న హజరత్ బాబ ఖాజ దర్గా రూపంలో వున్న సమాధి ఒక కీచకుడిది. వేములవాడలో కొలువైన శివలింగం అత్యంత పవిత్రమైన క్షేత్రం. ఈ శివలింగాన్ని దర్శించుకోడానికి వందలాది హిందువులు వచ్చేవారు. నిత్యం రకరకాల అభిషేకాలతో శివలింగాన్ని పూజించుకునేవారు మన హిందువులు. ఆ సమయంలో నైజాం పాలకుల్లో ఒకడైన “హజరత్ ఖాజ” తన బలగాలతో హిందూ భక్తుల పై దాడిచేసి, హిందువులు పరమపవిత్రంగా పూజించే మహాశివలింగంపై మూత్రం పోసి అపవిత్రం చేశాడు. దానిని శుద్ధీకరణ చేసి హిందువులు ఆ మహా శివలింగాన్ని పూజించారు.
ఇది తెలిసిన ఆ హజరత్ ఖాజా, మళ్ళీ వాడి సైన్యంతో వచ్చి హిందువులపై దాడి చేసి తిరిగి మూత్రవిసర్జన చేసాడు. ఇలా ఆ దుష్ట ముస్లీము హిందువులపై హిందూ దేవుళ్ళపై దాడులు చేశాడు. మహాశివరాత్రి రోజున వేములవాడలో శివలింగానికి అభిషేకం చేస్తున్న సమయంలో హజరత్ ఖాజ తన సైన్యంతో వచ్చి హిందువులపై విచ్చలవిడిగా దాడులు చేస్తూ శివలింగం పై మూత్రవిసర్జన చేస్తున్న సమయంలో శివభక్తులు అందరూ కలిసి ఆ హజరత్ ఖాజ అనబడే దుర్మార్గుడిని చంపివేసారు.. ఈ విషయాన్ని తెలుసుకున్న నైజాం పాలకులు వేములవాడ చేరుకొని విచక్షణా రహితంగా, దుర్మార్గంగా హిందువులపై దాడులుచేసి అనేకమంది శివభక్తులను చంపివేసి మహిళల మానప్రాణాలు చెరిపి, ఆ హజరత్ ఖాజ దుర్మార్గుడి శవాన్ని అక్కడే శివలిగానికి ఎదురుగా పాతిపెట్టి, సమాధి కట్టి హజరత్ బాబ ఖాజ దర్గాగా మార్చి శివలింగాన్ని దర్శించుకునే హిందువులందరూ ముందుగా ఆ హజరత్ ఖాజ అనే కీచకుని దర్గాను దర్శించుకోవాలని ఆంక్షలు విధించారు. ఆ విధంగా విధించబడిన బలవంతపు ఆంక్షలు, కాలక్రమేణా ఓ రివాజుగా మారి నేటికీ అనేకమంది హిందువులు ఆ దర్గా అని పిలువబడే ఒక పాశవికుని సమాధిని దర్శిస్తూనే ఉన్నారు.
హిందూ జాతిపై, హిందూ దేవుళ్ళ విగ్రహాలపై, హిందూ స్త్రీలపై, దాడులు చేసిన హజరత్ బాబ ఖాజ దర్గా వేములవాడ పవిత్ర రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉండడం మన జాతికి ఓ కళంకం. అటువంటి కళంకితుడైన ఓ దుష్టుడిని దర్శించుకోవడం ఎంతవరకూ సహేతుకం అన్నది హిందూ బంధువులందరూ ఆలోచించాలి. దేవాలయ పరిక్రమలోనుండి దర్గాగా పిలువబడే అ సమాధిని తొలగించిననాడే హిందూ సమాజానికి నిష్కృతి.
More Stories
ఒంటిమిట్ట రామాలయం
తెలంగాణ కాలాపానీ జైలు మన్ననూరు
ఐనవోలు మల్లన్న దేవాలయం