RSS NEWS

  • ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 
    ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు – వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసి, సాధించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లో 1975-77 మధ్య కాలంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ భారత చరిత్రలోనే మర్చిపోలేని చీకటి అధ్యాయం. 25 జూన్ 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 21 మర్చి 1977 వరకు 21 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దేశంలో అస్థిరత […]
  • నియంతృత్వ ఎమర్జెన్సీకి 49 ఏళ్లు
    -ప్రదక్షిణ వరిష్ట పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహంగారి పుస్తకం `ఎమర్జెన్సీ జ్ఞ్యాపకాలు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం’ ఆధారంగా ఈ వ్యాసం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ విధించిన 25 జూన్ 1975 రాత్రి నుంచి తీవ్రమైన దమనకాండ ప్రారంభమైంది. ప్రజల పౌరహక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా అధికారికంగా హరించబడ్డాయి. పత్రికలపై పూర్తి స్థాయి సెన్సర్షిప్ విధించబడింది. అన్ని రాజ్యాంగ సంస్థలు పూర్తిగా, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె ఆంతరంగిక బృందం ఆధీనంలో ఉండి, […]
  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం […]
  • వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ – హిందూ సామ్రాజ్య దినోత్సవం
    1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన […]
  • వీరనారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి
    భారతదేశం ఎందరో వీరులను వీర మాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు వీర మాతలు ఈ గడ్డ పై జన్మించారు. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణపాయంగా ఎంచి తల్లిభారతి పాదాల చెంత సమ్పర్పించారు. తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యులారు ‘మణి’ కర్ణిక… మన రాణి ఝాన్సీ లక్ష్మీ భాయి. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి […]
  • శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్
    -అనంత్ సేథ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 5వ సర్ సంఘచాలక్ శ్రీ కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్ జీ ఆషాఢ శుద్ధ తృతీయ, 18 జూన్ 1931 నాడు రాయ్ పూర్ లో జన్మించారు. వారు 9 సం|| వయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళటం ప్రారంభించారు. వారు 6 దశాబ్దాలు సంఘ ప్రచారక్ గా సేవచేసి, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ్ జీ తర్వాత 2000 సం|| లో సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. చదువు రీత్యా ఇంజనీర్ అయిన వారు, శారీరిక దార్ఢ్యత మరియు […]
  • RSS Sarsanghchalak Late KS Sudarshan Birth Anniversary: Committed to swadeshi and economic self-reliance
    KS Sudarshan was directly associated with Swadeshi Jagran Manch (SJM) as Marg-darshak for about 7 years before taking up the responsibility of Sarsanghachalak. After the formation of SJM by Dattopant Thengadi in 1991, Swadeshi movement took off only after its national convention of 1993 in Delhi. With the support from karyakartas of Rashtriya Swayamsevak Sangh […]
  • ఐరోపాలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభం
    ఐరోపాలో అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతంలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభోత్సవం జరిగింది. జూన్‌ 4 న ఈ ఉత్సవాలు ప్రారంభమై… పదమూడో తేదీ వరకూ వైభవోపేతంగా జరిగాయి. దేవాలయ ప్రారంభోత్సవం, మహా కుంభాభిషేకం తమిళనాడుకి చెందిన భూపతి శివాచార్య స్వామిగల్‌, వెంకటేష్‌ జయరామ్‌ అనే అర్చకులు నిర్వహించారు. సంప్రదాయమైన ముఖ్య ఘట్టాలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత శివునితో పాటు శ్రీ కర్పగ నాధర్‌, బ్రహ్మంద్‌ […]
  • మోహన్ భాగవత్ అలా అనలేదు : క్లారిటీ ఇచ్చిన సంఘ్
    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌  వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా హిందీ పత్రిక దైనిక్‌ జాగరణ్‌ ఓ వార్త ప్రచురించింది. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆరెస్సెస్ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మోహన్‌ భాగవత్‌ స్పందించారని ఆ పత్రిక పేర్కొంది. “మన దేశంలోని ప్రతి పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్చ వుందని, నడ్డా […]
  • దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు
    మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలన్న (డీ లిస్టింగ్‌) ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. వనవాసీ సంఘాలు దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో డీ లిస్టింగ్‌ డిమాండ్‌ తో ‘‘పోస్ట్‌కార్డ్‌’’ ఉద్యమాన్ని కూడా చేస్తున్నారు. కొందరు గిరిజనులు మతం మారినా… ఇప్పటికీ గిరిజన సమాజానికి వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ:వ్యాప్తంగా ‘‘జనజాతి సురక్షా మంచ్‌’’ పేరుతో గిరిజనులందరూ ఏకమై పెద్ద […]

హిందీ సాహిత్యానికి తెలుగువారి సేవ

హిందీ సాహిత్యానికి తెలుగువారి సేవ

తెలుగువారికి హిందీభాషపట్ల  అమితమైన అభిమానం, జాతీయభాషగా ప్రచారానికి నోచుకున్న హిందీ భాషా వికాసానికి, దాని సాహిత్య సృజనకి, పరివ్యాప్తికి తెలుగువారు చేసిన కృషి నిరుపమానం.  తెలుగువారైన మహనీయులు కొందరు హిందీ సాహిత్యాన్ని ప్రభావితం చేయగా, మరికొందరు హిందీ సాహిత్యాన్ని సృజించడంలో ప్రతిభను చాటి, దాని అభివృద్ధికి ఎనలేని కృషిచేశారు. నేటికీ ఎంతోమంది హిందీసాహిత్యసేవలో నిమగ్నమై ఉన్నారు.

తెలుగు, హిందీ భాషల మధ్య అనుబంధం శతాబ్దాలనాటిది.  మధ్యయుగాల నుండి నేటివరకు తెలుగువారు నిరంతరం హిందీకి సేవచేస్తూనే ఉన్నారు.  కృష్ణభక్తి సాహిత్యాన్ని ప్రోత్సహించడంలో పుష్టి మార్గం స్థానం చాలా ప్రముఖమైనది.  పుష్టి మార్గానికి మూలకర్త అయిన మహాప్రభు వల్లభాచార్యుడు తెలుగు మూలానికి చెందినవారు.  వీరి కుటుంబం తెలుగునాట గోదావరి తీరం నుండి యమునా తీరానికి వలస వెళ్ళింది.  తెలుగు మూలాలకి చెందిన వల్లభాచార్యుడు సూరదాసును కృష్ణభక్తి వైపు ప్రేరేపించారు.  హిందీ సాహిత్యంలో భానునిగా భావించబడే సూరదాసు అష్టచాప్ కవులుగా పేర్కొనబడే 8 మంది కృష్ణ భక్తకవుల్లో అగ్రగణ్యుడు.  భక్తి యుగంలో కృష్ణభక్తిని పెంపొందించడంలో ప్రధాన పాత్ర పోషించిన సూరదాసు, వల్లభాచార్యుడు, అతని కుమారుడైన విఠలనాథుల  శిష్యుడు.  తెలుగుమూలానికి చెందిన ఒకే ఆచార్యుడు హిందీ సాహిత్యంలో స్వర్ణయుగంగా పరిగణించబడే భక్తియుగంలోని ఒక ప్రధాన భక్తిశాఖా సాహిత్యాన్ని విశేషంగా ప్రభావితం చేయటం తెలుగువారందరికీ గర్వకారణం.

‘గాథాసప్తశతి’ సృష్టికర్త హాలశాతవాహనుడు కూడా తెలుగువాడే.  ఆయన చేసిన ఈ రచన హిందీలో ‘సతసయీ’ సంప్రదాయానికి పునాది వేసింది.  హిందీలో ‘రీతికాల్’ అని పేరొందిన సాంప్రదాయ యుగానికి చెందిన ప్రసిద్ధ కవి బిహారీలాల్ ని ‘బిహారీ సతసయీ’ రాయడానికి ప్రేరణనిచ్చింది గాథాసప్తశతే.  పద్మాకర్ భట్టు రీతికాలానికి చెందిన మరొక ప్రసిద్ధ కవి.  బ్రజ     భాషపై అసాధారణమైన పట్టు కలిగినవాడు.  ఆయన కూడా తెలుగువాడే.  ఆయన ‘హిమ్మత్ బహదూర్ బిరుదావలి’, ‘జగద్వినోద్’, ‘పద్మాభరణ్’, ‘జై సింహ్  బిరుదావలి’, ‘హితోదేశ్’, ‘రామ్ రసాయన్’, ‘ప్రబోధ్ పచాసా’, ‘గంగా లహారెన్’ మొదలైన కావ్యాలు రచించాడు.  హిందీ సాహిత్య వికాసంలో తెలుగు మూలానికి చెందిన పద్మాకర్ భట్టు చేసిన కృషి ప్రశంసనీయం.  పైన పేర్కొన్న తెలుగువారైన హిందీకవుల సృజన సంప్రదాయాన్ని ఆ తరువాత తరాలవారు మరింత ముందుకు తీసుకువెళ్లారు.

ఆధునిక యుగంలో..

హిందీ ఆధునిక కాలపు భారతేందుయుగంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాదెండ్ల పురుషోత్తమ కవి 1880 ప్రాంతాల్లో హిందీలో 32 నాటకాలు రచించారు.  సాహిత్య సేవలో ఇది అపూర్వమైన అంశం.  ఎందుకంటే అప్పటి వరకు తెలుగునాట హిందీ ప్రచారోద్యమం ప్రారంభం కూడా కాలేదు.  ఈ నాటకాలు తెలుగునాట అనేక పట్టణాల్లో ప్రదర్శించబడ్డాయి.  హిందీ ప్రాంతంలో కూడా అప్పుడప్పుడే నాటకాలు రాయడం మొదలైంది.  పురుషోత్తమకవి మచిలిపట్నంలోని హిందూ థియేటర్ కోసం తెలుగు లిపిలో హిందీ నాటకాలు రాసేవారు.

దక్షిణా భారత హిందీ ప్రచారసభ ప్రాంతీయ కార్యాలయం విజయవాడలో స్థాపించబడినప్పటి నుండి వందల మంది హిందీ ప్రేమికులు హిందీని ప్రోత్సహించే పనిలో నిమగ్నమయ్యారు.  పెద్ద సంఖ్యలో పురుషులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు జాతీయభాష హిందీ వైపు ఆకర్షితులయ్యారు.  ఉత్సాహంతో హిందీ నేర్చుకున్నారు.  వారిలో చాలామంది హిందీ భాషలో ప్రావీణ్యం సంపాదించి హిందీ సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేశారు.  అలాంటి వ్యక్తులు హిందీలోని వివిధ ప్రక్రియల్లో రచనలు కూడా చేసి తమ ప్రతిభను చాటుకున్నారు.  వారి కృషి వల్ల తెలుగునాట ఎన్నో హిందీ గ్రంథాలు రూపుదిద్దుకున్నా ద్వివేది యుగానికి ప్రవర్తకుడైన మహావీర్ ప్రసాద్ ద్వివేది హిందీలో ఆధునిక గద్య జనకుడుగా భావించబడుతున్నారు.  ఆయనకు సమకాలీనులైన తెలుగువారు జంధ్యాల శివన్నశాస్త్రి హిందీలో అగ్రశ్రేణి పత్రిక అయిన ‘సరస్వతి’ లో ప్రచురణ కోసం అనేక వ్యాసాలు రాశారు.  ‘ఖడీబోలీ’ ని ప్రామాణిక హిందీగా స్థిరీకరించాలన్న ఆలోచనలు జరుగుతున్న సమయంలో గుడివాడ పట్టణానికి సమీపంలోని కొర్నిపాడు అగ్రహారం అనే కుగ్రామంలో నివసించిన శివన్నశాస్త్రి ఆ విషయమై ఉత్తర భారతావనిలోని ఎంతోమంది హిందీ పండితులతో సంప్రదింపులు జరిపారు.  శివన్నశాస్త్రి  ఖడీబోలీ రూప స్వభావాల్ని గురించి పండిట్ మహావీర్ ప్రసాద్ ద్వివేదితో కూడా ఉత్తరప్రత్యుత్తరాలు జరిపారు.

తర్కం, వ్యాకరణంలోనే కాక సాహిత్యంలోనూ పండితులైన శివన్నశాస్త్రి తొలిగా తెలుగు-హిందీ నిఘంటువు, హిందీ-తెలుగు నిఘంటువులను రూపొందించారు.  హిందీ-తెలుగు వ్యాకరణం, బ్రజ్ భాషా వ్యాకరణం కూడా వ్రాశారు.  వెంకటేశ్వరశర్మ కూడా హిందీ-తెలుగు నిఘంటువు రూపొందించారు.  ఆధ్యాత్మ యోగం, చిత్త వికలన్ అనే పుస్తకాలను రచించారు.  నిఘంటు రూపకర్తల్లో ఆయాచితుల హనుమచ్ఛాస్త్రి, కామాక్షీరావు ప్రముఖులు.  దక్షిణభారతదేశంలో హిందీ ప్రచారంలో అనుభవజ్ఞులైన మోటూరి సత్యనారాయణ ‘విశ్వ హిందీకోశ్’ కి సంపాదకత్వం వహించారు.

తెలుగువారి హిందీకవితాసృజన     

ఆధునికకాలంలో ప్రతిభావంతులైన తెలుగుకవులు హిందీలో కవిత్వం రాస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు.  లాజపతి పింగళ్ తెలుగువారైన హిందీకవులలో చాలా ప్రసిద్ధులు.  ఆయన 1929 లో బ్రజ్ భాషలో ‘భక్తరామదాసు’అనే కావ్యాన్ని రచించారు.  ఈ కావ్యంలో లాజపతి రామభక్తుడైన కంచర్ల గోపన్న జీవిత గాధను, రాముడి పట్ల ఆయన అద్వితీయభక్తిని అద్భుతంగా చిత్రీకరించారు. ఇందులో ఆయన మృదుమధురమైన భావాభివ్యక్తి ప్రశంసనీయం.

కర్ణ వీరనాగేశ్వరరావు ‘దళితోన్ కీ వినతీ’ అనే కావ్యం ద్విపదల్లో రాశారు.  ఇందులో ఆయన సామాజిక అసమానతలను, కులవివక్షను తీవ్రంగా ఖండించారు.  తెలుగువారైన హిందీ కవుల అభ్యుదయభావాలను ఈ కావ్యం స్పష్టం చేస్తుంది.  తెలుగు ప్రాంతానికి చెందిన మరో హిందీకవి బి. బాలకృష్ణారావు ‘కౌముది’, ‘రాత్ బీతీ’, ‘హమారీ రాహ్’, ‘అర్థశతి’ మొదలైన కావ్యాలని రచించారు.  వారణాసి రామమూర్తి ‘రేణు’ సాంఘిక దురాచారాలను ఖండిస్తూ ‘విహాగ్’ అనే కవితాసంపుటిని వెలువరించారు.  ‘గీత్ విహార్’ కవితాసంకలనంలో ‘రేణు’ ప్రకృతి సౌందర్యాన్ని దేశభక్తిని చక్కగా అభివ్యక్తీకరించారు.

అందమైన ఊహల వ్యక్తీకరణకు తెలుగువారైన హిందీకవి ఆలూరి బైరాగి ప్రసిద్ధి.  నైరూప్యానికి మూర్తరూపాన్ని ఇవ్వడంలో బైరాగి నిపుణుడు.  నిర్జీవ, వికార వస్తువులను కూడా తన ఊహతో సజీవంగా మార్చగల ప్రతిభ బైరాగి సొంతం.  ఆయన ప్రసిద్ధకవితా సంకలనం ‘పలాయన్’ 1951 లో ప్రచురితమైంది.  మరొక రచన ‘టూటా దర్పణ్’.  దీనిలో బైరాగి పరిపక్వత ఎంతోమంది ప్రశంసలందుకుంది.  ‘తెలుగు కీ ఆధునిక్ కవితా’ పేరుతో తెలుగుకవుల కవితల్ని ఆయన హిందీలోకి అనువదించారు.

తెలుగువారైన హిందీకవులలో మృదుమధుర భావాలు గల సుప్రసిద్ధ కవి ఆచార్య పి. ఆదేశ్వరరావు.  ఆయన రచించిన కవితా సంపుటి ‘అంతరాల్’.  ఈ కవితాసంపుటిలో కవి అద్భుతమైన ప్రణయభావాలను ఆవిష్కరించారు.  ఈ రచన ఎంతోమంది హిందీకవులు, కవితాప్రియుల ప్రశంసలు అందుకుంది.  ఈ కావ్యసృజనతో ఆచార్య ఆదేశ్వరరావు హిందీ ప్రాంత చాయా (భావ) వాదకవులతో సమానమైన స్థానాన్ని అందుకున్నారు.

ఈ క్రమంలో బూదరాజు వెంకట సుబ్బారావు రచించిన ‘భారతశ్రీ’, ‘రేష్మీకుర్తా’, ‘మృణాళిని’, ‘హంపీ కే ఖండహర్’ మొదలైన కావ్యాలు, సూర్యనారాయణ భాను రచన ‘రూప్ రాగ్’; ఇలపావులూరి పాండురంగారావు రచించిన ‘కామాక్షీ విలాస్’; చావలి సూర్యనారాయణ ‘సతీ ఊర్మిల’; అన్నపరెడ్డి శ్రీరాంరెడ్డి గారి ‘సుమన్ మన్’; పుల్లయ్య రావు రచన ‘సోనే కీ రాహ్’; కాజ వేంకటేశ్వరరావు ‘అంతఃస్థల్’; నరేంద్ర రాయ్ రచన ‘అంధేరే కే ఖిలాఫ్’, ‘కూహాసే కీ ధూప్’, ‘ఎహసాస్ కే సాయే’; వేణుగోపాల్ గారి ‘వే హత్ హోతె హై; ఆచార్య రోహితాశ్వ రచించిన ‘శబ్ద దోగ్లె నహీ హోతె’ మొదలైనవి తెలుగువారైన హిందీకవుల కవితా ప్రతిభను వెల్లడిస్తాయి.

వీరందరి కృషి వల్ల హిందీ కవిస్తవం చాలా సుసంపన్నమైంది.  వీరి గొప్పతనాన్ని కవితావస్తువు, శిల్పం రెండింటిలోనూ చూడవచ్చు.  ఇది హిందీ కవిత్వానికి తెలుగు కవులు చేసిన అద్వితీయ సేవ.  ప్రచారానికి దూరంగా ఉన్నప్పటికీ, తెలుగు కవులు హిందీ సాహిత్యానికి చేసిన సేవ ప్రశంసింపదగినది.

గద్యరచనలో తెలుగువారైన హిందీ రచయితల కృషి

తెలుగు సాహిత్యవేత్తలు హిందీ గద్య ప్రక్రియల్లో దాదాపు అన్నింటిలో రచనలను చేయటం ద్వారా ఉత్తర భారతదేశంలోని హిందీ రచయితలకు సరిసాటిగా నిలిచారు.  హిందీలో నవలలు, కథలు, నాటకాలు, విమర్శతో పాటు పరిశోధనా గ్రంథాలు రాయడంలో తమదైన ముద్రవేశారు.  తెలుగువారైన హిందీ రచయితలు తులనాత్మక అధ్యయనంలో చాలా ముందున్నారు.

అరిగపూడి రమేష్ చౌదరి తెలుగువారైన హిందీ నవలా రచయితలలో చాలా ప్రసిద్ధి గాంచినవారు.  ఆయన తన నవలల్లో దక్షిణ భారతదేశ సంస్కృతిని, జనజీవితాన్ని చాలా సజీవంగా, సమర్థంగా చిత్రించారు.  మానవ జీవితంలోని అనేక సమస్యలు, వాటి పరిష్కారాలు ఆయన నవలల్లో కనిపిస్తాయి.  చౌదరి మొత్తం 25 నవలలు రాశారు.  ‘భూలే భటకే’, ‘అపనీ కరనీ’, ‘దూర్ కే డోల్’, ‘ఖరే ఖోటే’, ‘ధన్యభిక్షు’, ‘ఆదరణీయ్’, ‘అప్నేపరాయే’, ‘పతితపావనీ’, ‘అపవాద్’, ‘ముద్రాహీన్’, ‘యహ్ భీ హోతా హై’, ‘సాంఠ-గాంఠ’, ‘సారా సంసార్ మేరా’, ‘ఝూట్ ఫానూస్’, ‘నిర్లజ్జీ’, ‘ఉల్టీగంగా’, ‘చరిత్రవాన్’, ‘ఉధార్ కే పంఖ’, ‘నదీ కా షోర్’, ‘చోటే బడే లోగ్’, ‘చమత్కార్’, ‘అభిశాప్’, ‘సబ్ స్వార్థీ హై’, ‘సరలా’, ‘అంతిమ్ ఉపాయ్’ మొదలైనవి చౌదరి గారు రాసిన నవలలు.  తెలుగువారైన హిందీ రచయితల హిందీభాషా సామర్థ్యాన్ని, సృజనాత్మక ప్రతిభని ఉత్తరాది హిందీ రచయితలకు, పాఠకులకు ఆయన రుచి చూపించారు.  రమేష్ చౌదరి హిందీ రచయితలకు దీటుగా, సరిసాటిగా రచనలు చేసి, సాహిత్య జగత్తులో పేరుప్రఖ్యాతులు పొందిన గొప్ప నవలా రచయిత.

తెలుగువారైన డా. బాలశౌరి రెడ్డి సమర్థుడైన మరొక హిందీ నవలా రచయిత.  ఆయన పౌరాణిక, చారిత్రక, సామాజిక నవలలను రచించారు. ‘శబరి’ ఆయన పౌరాణిక నవల.  ఇందులో శబరి ద్వారా స్త్రీల ఆదర్శ, త్యాగమయ జీవితం చిత్రీకరించబడింది.  ‘లకుమా’, ‘దావానల్’’, ‘ప్రకాశ్ ఔర్ పరఛాయీ’ ఆయన చారిత్రక నాటకాలు.  వీటిలో స్త్రీల అద్భుతమైన త్యాగానికి కారణమైన పరిస్థితులు ప్రస్ఫుటమవుతాయి.  అంతేకాక ‘పల్నాటి యుద్ధం’ కి కారణభూతమైన పరిస్థితులు, మధ్యయుగం నాటి జీవిత విలువలపై వెలుగులు ప్రసరింపచేయబడ్డాయి.  ‘జిందగీ కీ రాహ్’, ‘భగ్న సీమాయే’,’బారిష్టర్’, ‘స్వర్ణ ఔర్ సత్య’, ‘ధరతీ మేరీ మా’, ‘ప్రొఫెసర్’ మొదలైన సామాజిక నవలల్లో మధ్యతరగతి జీవితం, మహానగర జీవితం, పర్యావరణం, ప్రేమ, వివాహం, విశ్వచైతన్యం, పాశ్చాత్య సంస్కృతి ప్రభావం మొదలైనవాటికి సంబంధించిన సమస్యలు చర్చించబడ్డాయి. బాలశౌరి రెడ్డి బహుముఖ ప్రతిభ గల హిందీ సాహితీవేత్తగా పేరుగాంచారు.

పైన పేర్కొన్న ఇద్దరు నవలా రచయితలే కాకుండా, తెలుగువారైన హిందీ రచయితలు అనేకులు జీవితంలోని అనేక పార్శ్వలను స్పృశిస్తూ నవలలు రాశారు. దండమూడి వెంకటకృష్ణారావు ‘శకకర్త శాలివాహన’, ‘చిత్రాంగి’ అనే చారిత్రక నవలలు రాశారు.  కిషోరీలా వ్యాస్ ‘రజాకార్’, ‘నయా సవేరా’ నవలలు రాశారు.  ఆచార్య రేగులపాటి మాధవరావు ‘సాక్షి’ నవల రాశారు.  వినోదిని గోయెంకా ‘దేశ్-విదేశ్’ నవల రాశారు.  ఆంధ్ర చరిత్రలోని పల్నాటి యుద్ధం ఆధారంగా డాక్టర్ కె. మల్లికార్జున ‘ప్రతిశోధ’ అనే మాండలిక నవల రాశారు.  వై. సీ. పి. వెంకటరెడ్డి ‘నిర్ణయ్’ అనే నవల రాశారు.  బూదరాజు వెంకట సుబ్బారావు గారు ‘తుఫాన్’ అనే నవల రాశారు. ఈ విధంగా అనేకమంది తెలుగువారు హిందీ సాహితీ లోకంలో విశేష ప్రాచుర్యాన్ని పొందారు.

 

డా|| వెన్నా వల్లభరావు

హైదరాబాద్, సెల్: 9490337978