RSS NEWS

  • ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 
    ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు – వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసి, సాధించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లో 1975-77 మధ్య కాలంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ భారత చరిత్రలోనే మర్చిపోలేని చీకటి అధ్యాయం. 25 జూన్ 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 21 మర్చి 1977 వరకు 21 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దేశంలో అస్థిరత […]
  • నియంతృత్వ ఎమర్జెన్సీకి 49 ఏళ్లు
    -ప్రదక్షిణ వరిష్ట పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహంగారి పుస్తకం `ఎమర్జెన్సీ జ్ఞ్యాపకాలు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం’ ఆధారంగా ఈ వ్యాసం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ విధించిన 25 జూన్ 1975 రాత్రి నుంచి తీవ్రమైన దమనకాండ ప్రారంభమైంది. ప్రజల పౌరహక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా అధికారికంగా హరించబడ్డాయి. పత్రికలపై పూర్తి స్థాయి సెన్సర్షిప్ విధించబడింది. అన్ని రాజ్యాంగ సంస్థలు పూర్తిగా, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె ఆంతరంగిక బృందం ఆధీనంలో ఉండి, […]
  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం […]
  • వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ – హిందూ సామ్రాజ్య దినోత్సవం
    1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన […]
  • వీరనారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి
    భారతదేశం ఎందరో వీరులను వీర మాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు వీర మాతలు ఈ గడ్డ పై జన్మించారు. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణపాయంగా ఎంచి తల్లిభారతి పాదాల చెంత సమ్పర్పించారు. తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యులారు ‘మణి’ కర్ణిక… మన రాణి ఝాన్సీ లక్ష్మీ భాయి. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి […]
  • శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్
    -అనంత్ సేథ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 5వ సర్ సంఘచాలక్ శ్రీ కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్ జీ ఆషాఢ శుద్ధ తృతీయ, 18 జూన్ 1931 నాడు రాయ్ పూర్ లో జన్మించారు. వారు 9 సం|| వయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళటం ప్రారంభించారు. వారు 6 దశాబ్దాలు సంఘ ప్రచారక్ గా సేవచేసి, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ్ జీ తర్వాత 2000 సం|| లో సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. చదువు రీత్యా ఇంజనీర్ అయిన వారు, శారీరిక దార్ఢ్యత మరియు […]
  • RSS Sarsanghchalak Late KS Sudarshan Birth Anniversary: Committed to swadeshi and economic self-reliance
    KS Sudarshan was directly associated with Swadeshi Jagran Manch (SJM) as Marg-darshak for about 7 years before taking up the responsibility of Sarsanghachalak. After the formation of SJM by Dattopant Thengadi in 1991, Swadeshi movement took off only after its national convention of 1993 in Delhi. With the support from karyakartas of Rashtriya Swayamsevak Sangh […]
  • ఐరోపాలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభం
    ఐరోపాలో అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతంలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభోత్సవం జరిగింది. జూన్‌ 4 న ఈ ఉత్సవాలు ప్రారంభమై… పదమూడో తేదీ వరకూ వైభవోపేతంగా జరిగాయి. దేవాలయ ప్రారంభోత్సవం, మహా కుంభాభిషేకం తమిళనాడుకి చెందిన భూపతి శివాచార్య స్వామిగల్‌, వెంకటేష్‌ జయరామ్‌ అనే అర్చకులు నిర్వహించారు. సంప్రదాయమైన ముఖ్య ఘట్టాలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత శివునితో పాటు శ్రీ కర్పగ నాధర్‌, బ్రహ్మంద్‌ […]
  • మోహన్ భాగవత్ అలా అనలేదు : క్లారిటీ ఇచ్చిన సంఘ్
    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌  వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా హిందీ పత్రిక దైనిక్‌ జాగరణ్‌ ఓ వార్త ప్రచురించింది. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆరెస్సెస్ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మోహన్‌ భాగవత్‌ స్పందించారని ఆ పత్రిక పేర్కొంది. “మన దేశంలోని ప్రతి పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్చ వుందని, నడ్డా […]
  • దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు
    మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలన్న (డీ లిస్టింగ్‌) ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. వనవాసీ సంఘాలు దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో డీ లిస్టింగ్‌ డిమాండ్‌ తో ‘‘పోస్ట్‌కార్డ్‌’’ ఉద్యమాన్ని కూడా చేస్తున్నారు. కొందరు గిరిజనులు మతం మారినా… ఇప్పటికీ గిరిజన సమాజానికి వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ:వ్యాప్తంగా ‘‘జనజాతి సురక్షా మంచ్‌’’ పేరుతో గిరిజనులందరూ ఏకమై పెద్ద […]

చరితార్థుల కథలు-పద్మశ్రీ వనజీవి రామయ్య

డాక్టర్ తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి గారి ముఖపుస్తకం నుండీ సేకరణ

వనంలో వనమై
వనమంతా తానై…
పర్యావరణానికి ప్రాణమిత్రుడు
కోటి మొక్కలు నాటిన ప్రకృతి ప్రేమికుడు
దరిపల్లి రామయ్య
అతడే
ఆకుపచ్చని ముద్ర…వనజీవి రామయ్య…!
బాగా ఎరిగిన వాళ్ళకు చెట్ల రామయ్య..!

▪️వివరాలు

ఖమ్మం జిల్లా ముత్తగూడెం గ్రామానికి చెందిన దరిపల్లి లాలయ్య, పుల్లమ్మ దంపతులకు 1937 ప్రాంతంలో రామయ్య జన్మించాడు. ముత్తగూడెం గ్రామంలోనే ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత వీరి కుటుంబం ముత్తగూడెం నుండి వ్యవసాయం కోసం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లికి వచ్చి స్థిరపడింది. అట్లా ప్రస్తుతం రెడ్డిపల్లి గ్రామం రామయ్య స్వస్థలం.

కుటుంబ పోషణలో భాగంగా వృత్తి రీత్యా కుండలు చేయడం, పాలు అమ్మడం, మరోవైపు వ్యవసాయం చేయడం, ఇన్ని పనులు ఉన్నప్పటికీ మొక్కలు పెంచే ప్రవృత్తిని రామయ్య ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు.
కొద్దికాలం క్రితం రెండో కుమారుడు
అనారోగ్యంతో మృతి చెందాడు. శోకం వేటాడినప్పటికీ రామయ్య తన వన యజ్ఞాన్ని మాత్రం వదులుకోలేదు.కొడుకు పేరు మీద మరిన్ని మొక్కలు పెంచాడు.

బాల్యం నుండే రామయ్యకి మొక్కలు పెంచడం ఒక అలవాటు. ఈ అలవాటు క్రమంగా వ్యసనం అయ్యింది. వ్యసనం జీవిత వ్యాపకం అయ్యింది.
చివరకు జీవితమే వనం అయింది.

1970 ప్రాంతంలో మొక్కుల పెంపకానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఈ ప్రకారం
ఆ సంవత్సరానికి ప్రాంతాలను ఎంపిక చేసుకోవడం,వేసవిలో విత్తనాలు సేకరించడం, తొలకరి రాగానే విత్తనాలు చల్లడం, చల్లి వదిలి వేయకుండా కొన్ని కొన్ని జాగ్రత్తలతో సంరక్షించడం చేస్తూ వచ్చాడు.

అడవుల వెంబడి, చెరువు కట్టల వెంబడి, బాటల వెంబడి , జాతర జరిగే చోట్లా,దేవాలయాల్లో, పాఠశాలల్లో, ప్రభుత్వ కర్యాలయాల్లో, ప్రస్తుతం రామయ్య పెంచిన మొక్కలు వనమై వృక్షోరక్షతి రక్షితః మాటను ప్రచారం చేస్తున్నాయి

రామయ్య పెంచిన వనాలు బాటసారులకు పశువులకు నీడనిస్తున్నాయి. ఎన్నో పక్షులకు అవాసాన్ని కల్పిస్తున్నాయి.

▪️రామయ్య నిబంధనలు

1 పెండ్లిల్లు గృహప్రవేశాలు వంటి శుభకర్యానికి వెళ్లినా మొక్కలనే బహుమతిగా ఇచ్చేవాడు.
2. తమ ఇంటికి ఎవరు అతిథులు వచ్చినా మొక్కలనే కానకగా ఇచ్చేవాడు.
3.ఆత్మీయులు మిత్రులు ఎవరైనా మరణిస్తే వారి పేరు మీద మొక్కలు నాటేవాడు
4.ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా “వృక్షోరక్షతి రక్షిత:” అని రాసివున్న ప్లకార్డులను మెడకు తగిలించుకుని వెళ్లి ప్రచారం చేసేవాడు.
5. రహదారుల వెంబడి , ఖాళీ స్థలాల్లో, జనసంచారం ఉండే ఇతర ప్రాంతాల్లో ప్లకార్డులను తగిలించి వెళ్ళవాడు. . తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డులో కూడా ఈ ప్లకార్డులను మనం గమనించవచ్చు. ఈ ప్ల కార్డులు కుండల రూపంలో
చక్రాల రూపంలో బోర్డుల రూపంలో ఉంటాయి.

▪️ప్రకృతి పరిజ్ఞానం

రామయ్యకు ప్రకృతిలోని మొక్కలపై చెట్లపై, వాటి ప్రయోజనాలపై అపారమైన పరిజ్ఞానం ఉండేది. సహజంగా అందరికీ తెలిసిన చెట్ల గురించే కాకుండా
ఎన్నో అటవీ వృక్ష సంపద గురించి, వన మూలికల గురించి , మౌఖిక పాఠాలే చెప్పేవాడు. అట్లా దాదాపుగా వందల చెట్ల గురించిన అవగాహన రామయ్య సొంతం.

▪️పురస్కారాలు – గౌరవాలు

తన జీవితాన్ని పర్యావరణానికి అంకితం చేసిన రామయ్యకు అనేక పురస్కారాలు వరించాయి.

1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవా పురస్కారం.
2005 సెంటర్‌ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ నుంచి వనమిత్ర పురస్కారం.
2017లో కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ సత్కారం..
‘యూనివర్సల్‌ గ్లోబల్‌ పీస్‌ ‘ అంతర్జాతీయ సంస్థ నుంచి గౌరవ డాక్టరేట్‌.
ఖమ్మం రోటరీ క్లబ్ అవార్డు
మొత్తం 3000 లకు పైగా అవార్డులు అందుకున్నాడు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారంలో రామయ్యను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది

▪️పాఠ్యాంశంగా రామయ్య జీవితం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో వనజీవిగా రామయ్య చేసిన కృషిని
పాఠ్యాంశంగా బోధిస్తున్నది.

మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి తెలుగు విద్యార్థుల కోసం 9వ తరగతి తెలుగు పుస్తకంలో వనజీవిగా రామయ్య జీవితం ఏ విధంగా ఆదర్శమో పాఠ్యాంశంగా బోధిస్తున్నది.

▪️కుటుంబం – ప్రకృతి ప్రేమ

రామయ్య భార్య జానమ్మ. ఈ దంపతులకు నలుగురు సంతానం. ముగ్గురు కొడుకులు. ఒక కూతురు.

ప్రకృతి మీద తన ప్రేమకు గుర్తుగా తన మనవరాళ్లకు చందనపుష్ప, హరిత లావణ్య. కబంధపుష్ప వనశ్రీ అని చెట్ల పేర్లే పెట్టుకున్నాడు. ఇది అతడి అదృష్టం. ఎందుకంటే… సమాజంలో తమ పిల్లల పేర్లు తామే పెట్టుకుంటామని వాదించే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు.

▪️కాలధర్మం

వనంలో వనమై
వనమంతా తానై…
చివరకు వ్రణమై కొంత కాలంగా అనారోగ్యంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 12 , 2025 న కాలధర్మం పొందారు..