
India’s first female writer AKKA MAHADEVI
మా అక్కమ్మ జయంతి ఈ రోజు, (12 ఏప్రిల్, 2025)
అక్కమ్మ ను గురించి చెప్పాలంటే ఈ జన్మ చాలదు,
అక్కమ్మ ను అనుసరించాలన్న, అక్కమ్మ చేసినవి ఆచరించాలన్న ఇక జన్మ జన్మల సమయం పడుతుందేమో,(Srii Vibhuti math)
ఉడుతడి లో పుట్టిన మహాదేవి స్త్రీ ల పట్ల విద్యా వివక్ష ఉన్న రోజుల్లోనే పట్టు పట్టి గురుకుల విద్య అభ్యసించింది,
కన్నడ, సంస్కృత, సంగీత విద్యల్లో ఆరితేరిన మహాదేవి బహు సుందర దేహం తో, శీలవంతమైన సంస్కార తో,పరమ శివుడి పట్ల మాటల్లో చెప్పలేనంత భక్తితో, ఆయన్నే భర్తగా భావించే భావ వైరాగ్యం తో,విరహం తో, అందమైన మాటలతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకునేది,
ఆ అందమే ఆ మహాదేవి కి ఇబ్బందిగా మారింది, ఆ ప్రాంతం రాజు కౌశికుడు వీరిని మోహించి, రాజ బలం తో పెండ్లి చేసుకొమ్మని వేధించాడు, తల్లి దండ్రులకు ఇబ్బంది కలగకూడదని, రాజు కి షరతులు పెట్టి రాజ స్థానం చేరింది,రాజు ఒక షరతు తప్పాడు కొద్దీ రోజులకి, ఇక అదే సమయంగా భావించి రాజ మందిరాన్ని వీడింది, విరహానికి, వైరాగ్యానికి ప్రతీక గా పూర్తి నగ్నంగా ప్రపంచ మొట్ట మొదటి పార్లమెంట్ అయిన “అనుభవ మంటపం” చేరి, అక్కడ అల్లమ ప్రభు దేవుల పరీక్ష లో నెగ్గి, వారి సలహా మేరకు, శ్రీశైలం పయనం అయింది, ఇక చెన్న మల్లికార్జునిదే తన జీవితం గా భావించి, జీవించి, కదళీ వనం లో ఆయన లోనే కలిసిపోయింది,
మహాదేవి అక్కమహాదేవి గా అనుభవ మంటపం లో మారింది, వారు మొట్ట మొదటి స్త్రీ రచయిత, వారి వచనాలు సంగీత యుక్తంగా ఉండేవి, వారి సంగీత ప్రతిభ అసాధారణం, వేదం, పురాణం, ఆగమాలు, ఉపనిషత్తులు, వ్యాకరణం ఇలా అన్నింటిలో అసాధారణ ప్రతిభ వీరి సొంతం, ఇది వారి వచనాలు చదివితే అర్ధమవుతుంది, ఇలా అనుభవ మంటపం లో అసాధారణ ప్రతిభ చూపారు కాబట్టే అక్కడ వేలాది శరణుల మధ్యలో గౌరవంగా “అక్క “అని పిలువబడ్డారు.
.(Srii Vibhuti math)
అలా మా అమ్మ అక్కమ్మ అయింది
జంగమమే ప్రాణం అనింది, బసవన్నే దేవుడంది,
అక్కమ్మ చూపిన బాటలో నడిస్తే చాలు,
అక్కమ్మ వచనాలు చదివితే చాలు,
లింగాంగ సామరస్యం కలుగుతుంది
Dr Pashupati sarmaa V
శ్రీ గురు లింగ జంగమేభ్యో నమః.
More Stories
వీణం వీరన్న మొదటి తరం భారతీయ ఇంజనీర్
చరితార్థుల కథలు-పద్మశ్రీ వనజీవి రామయ్య
బులుసు సాంబమూర్తి