మనకు చరిత్రలో కనపడని మనదైనా వారసత్వ సంపద శాసనాలలో తాళపత్ర గ్రంధాలలో కనిపిస్తుంది . అటువంటి వారసత్వ సంపదలో భాగ్యనగరానికి చేరువలో షాద్ నగర్ పట్టణానికి సమీపంలో రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలానికి చెందిన ఎలికట్ట గ్రామంలో గల శ్రీ అంబా భవాని మాత దేవాలయం. ఈ దేవాలయంలో అంబాభవాని మాతగా కీర్తింపబడుతున్న పార్వతీదేవి అమ్మవారు తేజస్సుతో ప్రకాశవంతంగా దర్శనమిస్తుంటారు .అమ్మవారికి ఇరువైపులా నల్లని మెరిసిపోతున్న గ్రానైట్ రాయితో చేయబడిన వినాయకుడు,కుమారస్వామి మరియు ఇరువైపులా రుద్ర నాయర్ల విగ్రహాలు ప్రతిష్టించ బడినాయి.
దేవాలయ స్థల పురాణం:
క్రీస్తు శకం 1042-1043 మధ్య ఈ ప్రాంతానికి రాజు అయిన మొదటి త్రైలోక్యమల్ల సోమేశ్వరుడు ప్రస్తుతం ఉన్న జడ్చర్ల పట్టణానికి సమీపంలో మాయాపురం గ్రామంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని నిర్మింప తలపెట్టాడు.దేవాలయ నిర్మాణానికి అవసరమైన పెద్ద పెద్ద శిలలు ఈ ప్రాంతం నుండే తరలిస్తుండేవారు.ఇదే ప్రాంతంలో శ్రీ అంబా భవాని మాత గుడి ఒక చెట్టు కింద ఉండేది.లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయ నిర్మాణానికి అవసరమైన శిలలు తరలిస్తున్న బండ్లు అంబాభవాని దేవాలయ సమీపానికి రాగానే చాలా చిత్రంగా పడిపోతు ఉండేవి . ఇది పరిపాటి కావడంలో త్రైలోక్యమల్ల సోమేశ్వరుడు చాలా వేదనకు లోనయ్యాడు. శ్రీ అంబ భవాని మాత రాజుకి కలలో కనిపించి తనకోసం ఒక భవ్యమైన దేవాలయము నిర్మించవలసిందిగా కోరింది. దీనితో రాజు ఎంతో ఉపశమనం పొంది శిల్పులను రప్పించి అంబ భవాని మాత కోసం ఒక అద్భుతమైన దేవాలయమును నిర్మించవలసిందిగా ఆదేశించినాడు.
దేవాలయ చరిత్ర ,వాస్తునైపుణ్యం:
శ్రీ అంభ భవాని మాత దేవాలయం కళ్యాణి ప్రాంతమును పాలించిన చాళుక్య రాజులు నిర్మించిన ద్రావిడ దేవాలయముల నిర్మాణ శైలిలో కట్టబడినది.”ఆహవమల్ల”బిరుదు కలిగిన మొదటి త్రైలోక్యమల్ల సోమేశ్వరుడు అతని తరువాత వచ్చిన బావ నైకమల్లు,త్రిభువనమల్లు పాలించే కాలంలో ఈ దేవాలయం నిర్మించబడినది. ఈ దేవాలయము పూర్తిగా అగ్నిపర్వతముల లావల ద్వారా ఏర్పడిన నల్లరాతితో కట్టబడినది. పిరమిడ్ రూపంలో ఉండే పైకప్పు ఐదు అంచేల్లో కట్టబడిన ఈ దేవాలయం శిల్పకళా అద్భుతమైనది. దేవాలయమునకు పైన చిన్న గోపురం నయనానందకరం .చాళుక్య రాజుల కాలంలో నిర్మింపబడిన చాలా దేవాలయము లు విష్ణువు, శివుడు, పార్వతి వివిధ అవతారములకు సంబంధించినవే.మనము చెప్పుకుంటున్న శ్రీ అంబాభవాని దేవాలయం కూడా ఈ కోవకు చెందినది.
ఈ దేవాలయం శిల్పకళ అద్భుతమైనది. చాళుక్య రాజులు నిర్మించిన దేవాలయం వలనే అ౦బాభవాని దేవాలయం కూడా ఏకకోట (ఒకే మండపం) దేవాలయం. ఈ దేవాలయం 40 శిలా స్తంభాల తో నిర్మింపబడినది .దేవాలయ మండపము గర్భగుడికి ఎదురుగా ఉంటుంది.ముఖ మండపముగా పిలవబడే నాలుగు శిలా స్తంభాలపైన ఈ మండపం నిర్మాణం జరిగింది.ఈ శిలా స్తంభాల నిర్మాణం అద్భుతమైన చెక్కడాలతో చాలా విశిష్టంగా ఉంటుంది.ప్రతి స్తంభానికి ఒకవైపు శంకు చక్రాల తో అమ్మవారు,మరోవైపు ఒకదానికి ఎదురుగా మరొక సింహాల చెక్కడాలు, మూడో వైపు ఎదురెదురుగా ఉన్న రెండు హంసలు,స్తంభానికి నాలుగు వైపు పద్మం లో మానవ ముఖం.
ఈ దేవాలయం పైకప్పు ఐదు అంచెలుగా అద్భుతమైన చెక్కడాల తో నిర్మితమైంది.పైకప్పులో అత్యంత శక్తివంతమైన శ్రీ చక్రం రూపొందించబడినది.గర్భగుడిలో శ్రీ అంబా భవాని మాత దేదివ్యమానంగా నాలుగు హస్తాల తో విరాజిల్లుతుంది. అమ్మవారి క్రింద ఎడమ చేతిలో మానవుని పుర్రె, మిగతా మూడు చేతుల్లో త్రిశూలం,దండం,డమరుకం ఉంటాయి.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ దేవాలయ నిర్మాణం హైదరాబాద్ అంబర్ పేటలోని అంబా దేవాలయం, జడ్చర్ల సమీపంలోని గంగాపురం గ్రామ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయం నిర్మాణ శైలిలో ఉంటుంది. ఈ దేవాలయ క్షేత్రపాలకుడు శ్రీ వీరభద్ర స్వామి. ప్రధాన ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ వీరభద్ర స్వామి ఆలయం అత్యంత అద్భుతమైన కట్టడమే .
ఇంతటి చారిత్రక ఆలయం పైకి 19 శతాబ్దంలో అప్పటి నిజాం రాజు దండిత్తి ఆక్రమించుకొని గుడి పైన నాలుగు మినార్లు నిర్మించాడు.అయితే ఆలయ పూజారులు దీన్ని ప్రతిఘటిస్తూ సుదీర్ఘ పోరాటం చేయగా ఈ మధ్యనే ఆ నాలుగు మినార్లను ఆలయం పై నుండి తొలగించి, దేవాలయ వైభవాన్ని పున ప్రతిష్టించారు. తద్వారా సనాతన ధర్మ పరిరక్షణ జరిగినది
ఆసక్తికర విషయం ఏమిటంటే 1899వ సంవత్వరం నిజాం ఉల్ ముల్క్ ఖాన్ ఇ ఖనన్ బహదూర్ వారి కార్యాలయ౦లో అప్పటి ఆలయ ధర్మకర్త శ్రీ గోవింద్ నాయక్ సాహెబ్ మరియు ఆలయ పూజారి శ్రీ G.వెంకన్న గార్ల మద్య వివాదం తలెతింది
1913సం:లో ఆలయ పూజారి వెంకన్న గారికి అనుకూలంగా తీర్పు రావడం తో దేవాలయం ఆలయ పూజారి కుటుంబ పర్యవేక్షణలో నే ఉంటూ వచ్చింది .ప్రస్తుతం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ అంబా భవాని శంకర్ ,శ్రీ వెంకన్న గారి ముని మనవడే.
దేవాలయంపై దాడి :
నిజాం తొత్తులైన రజాకారులు శ్రీ అంబా భవాని మాత దేవాలయంపై దాడి చేసి ఆలయ కుడి ప్రక్కగల శివాలయమును ధ్వంసం చేశారు. విగ్రహం లేని ఈ శిధిల శివాలయం నిజాం అరాచకాలకు ప్రత్యక్ష సాక్షి. ప్రధాన ఆలయం వెనుక ఉన్న ఎల్లమ్మ తల్లి ఆలయం కూడా రజాకార్లచే ధ్వంసం చేయబడింది. 1947-48సంవత్సరములలో శ్రీ అంబా భవాని దేవాలయమునకు 4కిలోమీటర్ల దూరంలో గల మొగిలిగడ్డ గ్రామానికి చెందిన రాజాకర్ నాయకుడు కాజీమియా, ఎల్లమ్మతల్లి విగ్రహం తల నరికివేసి దేవాలయమును పూర్తిగా ధ్వంసం చేసినాడు.దేవాలయ భూములు అన్యాక్రాంతమైనాయి. దేవాలయ ఆచారాలు,పండుగలు :
శ్రీ అంబా భవాని మాతకు పూర్వ రోజులలో రాతి పాత్రలో నైవేద్యం సమర్పించేవారు. శాకారులైతే పెసరపప్పు,తాటికల్లు అదేవిధంగా మాంసారులైతే మాంసము,తాటికల్లు నైవేద్యముగా తల్లికి సమర్పించేవారు.దేవికి విశిష్ట విశేషమైన శక్తులు ఉన్నాయని, భక్తుల కోరికలు తీర్చే తల్లి అని ప్రజల విశ్వాసం.తమ కోరికలు తీరడం కోసం భక్తులు ఒక ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయ,కుంకుమ,పసుపు మరియు తమ కోరికలను తెలుపుతూ ఒక చీటీ ముడుపుగా గుడిలో కట్టేవారు.తమ కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు శ్రీ అంబాభవాని మాతకు విశేష పూజలు చేసేవారు.శ్రీ అంబా భవాని మాత దేవాలయంలో ప్రతి సంవత్సరం నవరాత్రి, బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఉత్సవాల సమయంలో జాతరలు ఏర్పాటు చేస్తారు. ప్రాణదానంగా భావించే అన్నదానం ఈ ఉత్సవం సమయంలో నిర్వహించడం విశేషం.
2018 సంవత్సరంలో రాష్ట్ర దేవాదాయశాఖ ఆధీనంలోకి వచ్చిన శ్రీ అంబా భవాని ఆలయమునకు 10ఎకరాల 21గుంటల మాన్యం ఉ౦ది.ఈ భూములన్నీ సర్వే నెంబర్ .265(1A-29g),325(1A-24G),326(3A-11G),327(1A-33G),332(1A-14G),338(0A-30G) లో దేవాలయం నిర్వహించేదుకు ఉన్నాయి .
Translated by Sri Ramakrishna Vellanki
More Stories
ఐనవోలు మల్లన్న దేవాలయం
దక్షిణాపథ వార్తావని ( వైశాఖ మాసం ) మే 2024
ఛాయా సోమేశ్వరాలయం