
రజాకార్లు అడిగిన సొమ్మును గ్రామస్తులు చెల్లించకపోవడంతో లింగాపూర్ గ్రామం మొత్తం నిర్మానుష్యంగా మారింది. ఇళ్లకు నిప్పుపెట్టారు, పురుషులను హత్య చేశారు, మహిళలను అవమానించారు, పిరికిపందలలాగా పిల్లలు, వృద్ధులను చంపారు. ఈ భయంకరమైన వార్త సమీప గ్రామమైన భైరవునిపల్లికి వ్యాపించడంతో 30-40 మంది వ్యక్తులు కర్రలతో లింగాపూర్ వైపు పరుగెత్తారు, వారికి దోచుకున్న సంపద, ధాన్యంతో నిండిన బండ్లతో రజాకార్లు కనిపించారు. గ్రామస్థులపై బుల్లెట్ల వర్షం కురిపించినా జంకకుండా రజాకారులను వెంబడించడం ప్రారంభించారు. కొద్దిసేపటికే రజాకార్లు దోపిడీతో నిండిన బండ్లను మరియు వారి వద్ద ఉన్న తుపాకులను వదిలి పారిపోయారు.
ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత రజాకార్లు పెద్ద సంఖ్యలో భైరవునిపల్లికి వచ్చి దోపిడీ బండ్లతో పాటు రూ. 1200/- జరిమానా ఇవ్వాలని డిమాండ్ చేయగా గ్రామ పెద్దలు సున్నితంగా తిరస్కరించారు. రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడారని గ్రామస్తులపై ఆ ప్రాంత పోలీస్ అమీన్ కు ఫిర్యాదు చేశారు రజాకార్లు. ఈ సంఘటనల ఉధృతిని గమనించిన భైరవునిపల్లి గ్రామస్తులు, లింగాపూర్ ఉదంతం పునరావృతం కాకుండా, గ్రామాన్ని రక్షించడానికి పక్కా ప్రణాళికతో కూడిన రక్షణ అవసరమని ఏకగ్రీవంగా తీర్మానించారు. దీని ప్రకారం భైరవునిపల్లి టవర్ వద్ద వాచ్ ను ఏర్పాటు చేసి టవర్ వద్ద నిరంతరం కాపలా ఏర్పాటు చేశారు. ఆ గ్రామానికి ఏ ప్రమాదం జరిగినా, గ్రామస్తులందరూ చేతిలో ఉన్న పనిని వదిలేసి, కర్ర, కొడవలి, గొడ్డలి లేదా రాయితో పోరాడటానికి సంసిద్ధులుగా ఉండేవారు.
చుట్టుపక్కల ఉన్న ఎనిమిది గ్రామాలకు చెందిన 50 నుండీ 100 మంది గ్రామస్థులను రాళ్ళు, కర్రలతో కాపలాగా పెట్టి గ్రామస్తుల మనోధైర్యాన్ని కాపాడే పనిని అప్పగించారు. తదనుగుణంగా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆయుధాలు, పేలుడు పదార్థాలను కూడా సిద్ధంగా ఉంచేవారు. విశ్వనాథ భట్ జోషి అనే బ్రాహ్మణ యువకుడు తన సైకిల్ పైన తిరుగుతూ సాధారణ గొర్రెల కాపారుల ద్వారా వైర్లెస్ సేవలను ప్రారంభించాడు.
గ్రామస్తుల రక్షణ వ్యవస్థతో భైరవునిపల్లి శత్రుదుర్భేద్యమైనది. రజకారులు ముందుకు సాగే సూచనలు కనిపించకపోవడంతో భువనగిరి డిప్యూటీ కలెక్టర్ ఇక్బాల్ హాషీమ్ అసహనం వ్యక్తం చేశాడు. అందువలన ఈ పెద్దమనిషి సాయుధ బెటాలియన్ తో గ్రామంలో “శాంతిని” నెలకొల్పే వంకతో బయలుదేరాడు. అతను గ్రామ సరిహద్దులకు చేరుకున్న వెంటనే కేటిల్డ్రం మోగింది. వెంటనే గ్రామస్థులు తమకు కేటాయించిన స్థానాలనుండి ఇక్బాల్ హాషీమ్ మరియు అతని బెటాలియన్ రజాకార్లపై బుల్లెట్ల వర్షం కురిపించారు. సుమారు 8 గంటల పాటు కొనసాగిన ఈ ఘర్షణలో కేవలం నలుగురు గ్రామస్థులు మాత్రమే అమరులయ్యారు, అయితే 15 మందికి పైగా రజాకార్లు మరణించారు. ఈ ఓటమితో కోపోద్రిక్తుడైన పెద్దమనిషి ఇక్బాల్ హాషీమ్ ప్రతీకారం తీర్చుకుంటానని, భైరవునిపల్లి గ్రామస్తులకు తగిన గుణపాఠం నేర్పుతానని ప్రతిజ్ఞ చేశాడు.
ఆ రోజుల్లో జనగామ గ్రామం తాలూకా కేంద్రంగా ఉండేది. నిజాం సైనికుల కంటోన్మెంట్ ఎప్పుడూ అక్కడే ఉండేది. డీఐజీ స్థాయి అధికారులు, పోలీసు శాఖకు చెందిన డీఎస్పీ, ఆర్మీకి చెందిన ఒక మేజర్, ఇద్దరు కెప్టెన్లు భైరవునిపల్లి పై దాడికి ప్రణాళికలో నిమగ్నమయ్యారు. ఆర్టిలరీ, గన్ పౌడర్ సామగ్రిని యుద్ధప్రాతిపదికన ట్రక్కుల్లో లోడ్ చేసుకుని అర్థరాత్రి వరంగల్-సిద్దిపేట రహదారి వైపు జీపులు బయలుదేరాయి. కాన్వాయ్ లో నిజాంకి చెందిన 500 మంది సైనికులు ఉన్నారు. సైన్యం, పోలీసు దళం మరియు రజాకార్లతో పాటు 200 మంది పౌర అధికారులు ఉన్నారు.
భైరవునిపల్లి గ్రామంలో సాయంత్రం అయింది. పొలాల్లో రోజంతా పనిచేసి ఇంటికి తిరిగి వచ్చే ప్రజలు, పశువుల కాపరులు తమ పశువులతో తిరిగి తమ గ్రామం వైపు వెళ్లిపోయారు. రాబోయే విపత్తు గురించి ఎవరికీ అవగాహన లేదు.
తెల్లవారు జాము సమయంలో విశ్వనాథ్ భట్ జోషి కాలకృత్యం తీర్చుకోవడానికి బయలుదేరాడు. తెల్లవారు జామున చీకట్లో నిజాం సైన్యానికి చెందిన సైనికులు అతడిని పట్టుకున్నారు. అక్కడికి అర మైలు పరిధిలో ఉన్న భైరవునిపల్లి గ్రామాన్ని రజాకార్ల బలగాలు చుట్టుముట్టాయి. విశ్వనాథ భట్ ని కాల్చి చంపాలనే నిర్ణయానికి వచ్చారు. కాని సివిలియన్ అధికారులలో ఒకరైన ఎం.ఎన్.రెడ్డి, విశ్వనాథ్ బ్రాహ్మణుడని, అహింసావాది అని, అందువల్ల అతన్ని విడిచిపెట్టమని వాదించాడు. గ్రామస్తులను అప్రమత్తం చేయడానికే జోషిని వదిలివేయమని ఆ సివిలియన్ అధికారి ప్రయత్నిస్తున్నాడనే అనుమానం వచ్చినప్పటికీ, సైనికులు అతన్ని గట్టిగా హెచ్చరించి వదిలేశారు. భైరవునిపల్లి చుట్టుపక్కల గ్రామాల మధ్య వైర్లెస్ సర్వీస్ ఉన్నదన్న విషయం ఆ సైనికులకు తెలియదు. ఇంచుమించు అదే సమయంలో యువ కార్పెంటర్ వెంకట నరసయ్య పట్టుబడ్డాడు కానీ అతను బాగా బలవంతుడైన వ్యక్తి అవడంతో సైనికులను తోసివేసి రాబోయే దాడి గురించి గ్రామస్తులను అప్రమత్తం చేస్తూ గట్టిగా పరిగెత్తాడు.
గొప్ప విప్లవకారుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ గా ఉరికంబంపై నిలబడి..
నాకు మునుపటి ఆశయాలు లేవు,
నాలో కోరికల గుంపు లేదు
బిస్మిల్ హృదయంలో మిగిలి ఉన్న ఏకైక కోరిక దేశం కోసం చావడమే!
ఆ స్పూర్తి నినాదాలే భైరవునిపల్లి గ్రామస్తులకు స్పూర్తి మంత్రాలయ్యాయి.
కొద్దిసేపటికే కెటిల్ డప్పు మోగింది, ఊరంతా యుద్ధ కేకలు ప్రతిధ్వనించాయి, గ్రామస్థులు తమ తమ స్థానాలను చేపట్టడానికి పరిగెత్తారు, మహిళలు పిల్లలను, వృద్ధులను రక్షించారు, గ్రామంలో నగారా మ్రోగింది, యుద్ధం ఆరంభమైంది.
తెల్లవారు జామున రజాకార్ల దాడి జరిగిన సమయంలో గ్రామస్తులు చూపిన ధైర్యసాహసాలు, వారు చూపించిన మానవ నిబబామ్, తెగువ మనను రోమాంచితులను చేస్తాయి.
నిజామీ దళాల నిర్దాక్షిణ్యమైన షెల్లింగ్, కాల్పులతో గ్రామస్తులు తమ సంప్రదాయ ఆయుధాలతో ఎక్కువసేపు నిలబడలేకపోయారు . రజాకార్ల బలాన్ని తెలుసుకునేందుకు టవర్ ఎక్కిన రామయ్య కోలి, భూమయ్య బంజారా అనే ఇద్దరు బాలురను కాల్చి చంపారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న గ్రామస్తులు సంధికి సంకేతంగా తెల్లజెండా ఎగురవేసినా అనాగరిక శక్తులు వెనక్కి తగ్గలేదు. వారు గ్రామంలోకి ప్రవేశించి చరిత్రలో కనీవినీ ఎరుగని రక్తపాతాన్ని సృష్టించారు . పురుషులు, యువకులకు కళ్లకు గంతలు కట్టి తాళ్లతో కట్టేసి జంతువుల్లా గ్రామం నుంచి బయటకు లాక్కెళ్లి మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువకులు, వృద్ధులు, బలహీనులు, రోగగ్రస్తులు ఎవరినీ ప్రాణాలతో వదలలేదు .
ఇంత అరరాచకం సృష్టించినా అనాగరికుల రక్తదాహం ఇంకా తీరలేదు. కళ్లకు గంతలు కట్టిన యువతీ యువకులను రప్పించి ఓ ప్రయోగానికి తలపడ్డారు. నిజామీ ఆర్మీ అధికారులువిశ్రాంతి తీసుకుంటూ చర్చించుకుంటున్నారు. ఒకే వరుసలో నిలబెడితే ఎంతమంది గుండా 303 బుల్లెట్లు వెళతాయి అనే అనుమానాలను తీర్చుకునేందుకు కళ్ళకు గంతలు కత్తివేయబడ్డ యువతీ యువకులను ఎంచుకుని, ఓ యువ పోలీస్ అధికారి ముందుకు వచ్చి వెంటనే ఒకే బుల్లెట్ తో నలుగురిని హతమార్చాడు. దీంతో సంతృప్తి చెందని భువనగిరి డిప్యూటీ కలెక్టర్ ఇక్బాల్ హషీమ్ ముందుకు వచ్చి పేల్చిన బుల్లెట్ మరో 10 మంది వ్యక్తులను దాటింది, అందరూ మరణించారు. సుమారు 150 మంది మరణించే వరకు దుర్మార్గమైన, క్రూరమైన ఆటలు అల్లాగే కొనసాగాయి. 90 మంది హరిజనులను చంపి సామూహిక సమాధిలో ఖననం చేశారు.
దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న సమయంలో భైరవునిపల్లిలో (ఆగస్టు 27, 1948) జరిగిన రక్తపాతం ఒక విస్తుపోయే నిజం.
పిమ్మట ఆ దుష్ట రజాకార్లు భైరవునిపల్లి గ్రామాన్ని కొల్లగొట్టారు, పొలాలు ధ్వంసమయ్యాయి, రక్తపు మడుగులు ప్రవహించాయి, తెల్లవారు జామున పక్షుల కిలకిలారావాలతో పాటు భయంకరమైన కేకలు ప్రతిధ్వనించాయి, ఇళ్ల నుంచి వెలువడే దట్టమైన పొగ ఉదయపు ఎండను కప్పేసింది. వివేకవంతుడైన మానవ మేధస్సుకు ఆ సన్నివేశం అర్థంకానిది. వినాశనం పూర్తయింది.
సేకరణ శ్రీ వెల్లంకి రామకృష్ణ
More Stories
ఉద్గిర్ పోరాటం (జనవరి 03)
వెల్లూరు తిరుగుబాటు (జులై 10)