
భారతీయుల ప్రాచీన తాళపత్ర, శాసన సాహిత్యానంతటినీ అందుబాటులోకి తెచ్చే డిజిటల్ నిధి ఏర్పాటు
సా.శ.పూ. 2, 3 శతాబ్దాలకు చెందిన భారతీయ ప్రాచీన నాటకరచయిత భాస మహాకవి. ఇతడి నాటకాలే కవికులపతి కాళిదాసు నాటకాలకు ఒరవళ్ళు దిద్దాయని పండితులు చెబుతారు. ప్రాచీన అలంకారికులచే, పండిత కవులచే విస్తృతంగా ప్రస్తావించబడిన ఈ భాసుని నాటక ప్రతులు కొన్నివందలేళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాయి. మళ్ళీ దైవవశాన భాసుడి 13 నాటకాలు ప్రాయబడి ఉన్న తాళపత్ర ప్రతులు ‘మహామహోపాధ్యాయ’ టి. గణపతిశాస్త్రిగారికి 1910లో కేరళలోని తిరువనంతపురం సమీపంలోని ఒక గ్రామంలోని ఒక సంప్రదాయక గ్రంథాలయంలో దొరికాయి.
ఇలా ఎన్నో మన ప్రాచీన భారతీయ శాస్త్రగ్రంథాలు, కళలకు సంబంధించిన వాజ్మయం, అనంతమైన వైవిధ్యం కలిగిన సాహిత్యపు తాళపత్రగ్రంథాలు వేలకువేలు గత 150 సంవత్సరాల మన పరిశోధనలలో వెలుగుచూడగా, ఇంకా ఎన్నో లక్షల గ్రంథాలు ముద్రణలోకి రావలసిఉంది. వీటికి తోడు వేలాదిగా శాసనాలు మనకు వేల సంవత్సరాలుగా ఉన్నాయి. వీటి పరిశోధన, పరిష్కరణ కూడా పండిత పరిశోధకులచేత జరపబడుతూనే ఉంది. అయితే, ఆసక్తి గల సామాన్యులకు నేటి డిజిటల్ యుగంలోకూడా ఇవేవీ అందుబాటులోకి రాలేదు. ఈ లోపాన్ని చక్కదిద్దుతూ ఇప్పుడు మాన్యుస్క్రిప్ట్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ డిజిటలైజేషన్ ఫౌండేషన్ (MIDF) భారతీయులందరికీ అందుబాటులోకి వచ్చేందుకు ఒక మహానిధిలంటీ డిజిటల్ ప్రాజెక్ట్ ను చేపట్టింది.
భారతదేశంలో గ్రంథాలయాలకు కొరత లేదు. అయితే ఈ సంస్థ ఆశిస్తున్నది అంతకంటే ఎక్కువ. వారు స్థానిక సర్వర్లలో హోస్ట్ చేయబడిన ఒకే, అందరికీ అందుబాటులో ఉండే సెర్చ్ ఇంజిన్ ను నిర్మించాలనకుంటున్నారు – భారతదేశపు లిఖిత చరిత్రను ఎవరైనా వాస్తవంగా కనుగొని, చదివి, సరిపోల్చుకోగలిగే ఒక ప్రదేశం అది.
భారతదేశంలో సుమారు కోటి తాళపత్ర గ్రంథాలు, మూడు లక్షలకు పైగా శిలాశాసనాలు ఉన్నాయని అంచనా. ఇవి ఐదు వేల సంవత్సరాల కాలంలో, వందకు పైగా లిపులలో వ్రాయబడ్డాయి. పరిమాణం పరంగా ఇది ఏ నాగరికత అయిన సృష్టించిన అతిపెద్ద లిఖితపూర్వక రికార్డు, అయినప్పటికీ అందులో ఒక శాతం కన్నా తక్కువ మాత్రమే చదవడానికి లేదా శోధించడానికి వీలవుతుంది.
మన దేశాన్ని, డేటా-లేమి ఉచ్చులో చిక్కుకున్న ఒక నాగరికతా బిలియనీర్ గా MIDF అభివర్ణి స్తోంది. అది చాలా సరైన వర్ణన. పాత వ్రతప్రతులను పరిరక్షించే విషయానికి వస్తే, శిధిలమైపోతున్న పేజీలు నాశనమవకముందే వాటిని కాపాడటమే ముఖ్యమని మన మొదటి సహజ స్పందన. గత దశాబ్దకాలంలో జరిగిన భారీ డిజిటల్ ఉద్యమానికి సరిగ్గా ఇదే ఆలోచన కారణం. కానీ అది బోలెడంత పనిని సృష్టించినప్పటికీ, వాస్తవానికి చాలా తక్కువ సమస్యను పాక్షికంగా పరిష్కరించింది. ఆ సంస్థలు కేవలం ఆ వ్రాతప్రతుల హై-రిజల్యూషన్ ఫోటోలు, స్కాన్ లు తీసుకుని, పని పూర్తయిందని ప్రకటించాయి.
“ఏదైనా తాళపత్రపు నాణ్యమైన చిత్రాన్ని తీసిన ఎవరైనా దీన్ని డిజిటలైజ్డ్ కాపీగా ప్రచారం చేయవచ్చు. కానీ ఆ చిత్రం ప్రయోజనాన్ని మేము ప్రశ్నిస్తున్నాము” అంటున్నారు MIDF కు C.E.O గా ఉన్న పూజా పోర్వాల్, దానని శోధించలేకపోతే, అందుబాటులోకి తీసుకురాలేకపోతే, మూసివేయబడిన ఒక గిడ్డంగిలో, ఎవరూ ప్రశ్నించలేని హార్డ్ డ్రైవ్ లోని ఒక ఫైల్ గా మిగిలిపోతుంది. ఏదేమైనా, నాణ్యమైన స్కానింగ్ అనేది ఒక ముఖ్యమైన మొదటి అడుగు.
తాను సరిచేస్తున్న దానిని పరిరక్షణ సమస్యగా కాకుండా మౌలిక సదుపాయాల సమస్యగా ఈ సంస్థ అభివర్ణిస్తుంది. ఒకే ఒక్క చారిత్రకపత్ర వారసత్వ సంపదను అధ్యయనం చేయాలనుకునే పరిశోధకుడు, దానిని కలిగిఉన్న ఆర్కైవ్ ను భౌతికంగా కనుగొని, అక్కడికి ప్రయాణించి, అది కేటలాగ్ చేయబడిందని ఆశించాల్సివుంటుంది. కానీ చాలా వరకు అలా చేయబడలేదు. జ్ఞానం, ఉనికిలో ఉంటుంది, కానీ అదే సమయంలో అదృశ్యంగా ఉంటుంది. ఆచరణలో, ఇది అసలు ఉనికిలో లేకపోవడంతో సమానం.
ఆ అదృశ్యత మూల్యం మొదట పండితులపై పడుతుంది. ఎందుకంటే కేంద్ర సూచీకలేనప్పుడు, ఈ రంగంలోని పరిశోధనలన్నీ వేర్వేరు విభాగాలుగా జరుగుతాయి. ఉదాహరణకు, దేశంలోని వివిధ ప్రాంతాలలోని నిల్వ కేంద్రాలలో ఒకే ప్రాచీన గ్రంథానికి చెందిన అనేక చేతివరాట ప్రతులు ఉన్నాయి. ఈ గ్రంథంపై పరిశోధన చేయాలనుకునే పండితుడు, ఈ మాన్యుస్క్రిప్ట్ లను పొందటానికి, ఈ నిల్వ కేంద్రాలలో ప్రతిదానికి స్వయంగా ప్రయాణించి, కాలం చెల్లిన కేటలాగ్ లను తిరగేయడమో లేదా ప్రాచీన సాంకేతిక పరిజ్ఞానంతో శ్రమించడమో చేయాలి.
ఇక ఈ సమస్య విద్యాపరమైన అంశం ఏమాత్రం కాదు, అది సర్వభౌమత్వానికి సంబంధించినది. దేశీయంగా ఒక నిధి లేకపోవడంతో, భారతీయ పండితులు తమ సొంత చరిత్రను అధ్యయనం చేయడానికి విదేశీ యాజమాన్యంలోని డేటాబేస్ లపై ఆధారపడుతున్నారు. దీని పర్యావసనాన్ని పోర్వాల్ ఇలా పేర్కొన్నారు: “ఏదైనా భౌగోళిక రాజకీయ సమస్య తలెత్తినప్పుడు, ఈ నిధులను భారతీయ వినియోగదారులకు మూసివేయవచ్చు.” దేశం తన సొంత నాగరికతా చరిత్రను తెలుసుకునే వీలు, అది నియంత్రించలేని, హామీ ఇవ్వలేని సర్వర్ ల ద్వారానే సాధ్యమవుతుంది. మరో దేశం అనుమతి లేకుండా తన గతాన్ని తాను చదవలేని దేశం తీవ్రమైన బలహీనతను ఎదుర్కొంటుంది.
MIDF దీని ఆవశ్యకతనిలా చెబుతోంది: ‘కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఆర్థిక వ్యవస్థలో, ఒక యంత్రం చదవలేని సమాచారం ఆచారణాత్మకంగా అంతరించిపోయినట్లే.’ ఈ మౌలికసదుపాయాలు లేకుండా గడిచే ప్రతిఏటా, చర్య తీసుకోకపోవడంవల్ల కలిగే నష్టం పెరుగుతూనే ఉంది. అంటే, పరిశోధకులు అసంపూర్ణ సమాచారం ఆధారంగా తమ పరిశోధనలను ప్రచురించడం, AI వ్యవస్థలు భారతదేశం గురించి కేవలం విదేశీ ఆర్కైవ్ ల నుండి మాత్రమే తెలుసుకోవడం, భారతదేశ చరిత్ర పూర్తిగా ఇతరుల నిబంధనల ప్రకారమే రాయబడటం జరుగుతుంది.
యూరప్ రెండు వందల మిల్లియన్ లకు పైగా శోధించదగిన పేజీలను డిజిటలైజ్ చేసింది. పెద్ద భాషా నమూనాలకు శిక్షణా డేటాగా తన వారసత్వ సంపదకు లైసెన్సులు ఇస్తోంది. చైనా, సాంప్రదాయ లిపులపై ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (OCR) కచ్ఛితత్వాన్ని తొంభై ఏడు శాతానికి పైగా పెంచింది.
మానవ చరిత్రకు సంబంధించిన ప్రశ్నలకు వ్యవస్థీకరించి, సమాధనమివ్వడానికి ఇప్పుడు నిర్మిస్తున్న నమూనాలు, ఆ చరిత్రను యంత్రాలు చదవగలిగేలా చేసినవారి నుండే నేర్చుకుంటున్నాయి. అన్నిటికంటే పెద్ద లిఖితపూర్వక రికార్డును కలిగి ఉన్న భారతదేశం, అటువంటి సమాచారాన్ని దాదాపుగా అందించడంలేదు. భారతీయవైద్యం, ఖగోళశాస్త్రం, చట్టం-పరిపాలన చరిత్రను, ఇతరులు నిర్మించి, సూచికీకరించి, నియంత్రించే ఆర్కైవ్ ల ద్వారానే ఎక్కువగా అన్వయిస్తున్నారు. ప్రపంచంలోని మిగతా జ్ఞానం యంత్రాలకు సొంతమైపోతుండగా, భారతదేశపు జ్ఞానం అలా జరగకపోవడంతో, ప్రతి ఏడూ ఈ అంతరం పెరుగుతూనే ఉంది.
వీటన్నిటికీ భిన్నంగా MIDF ప్రతిపాదించేది చాలా ప్రతిష్ఠాత్మకంగా కనిపిస్తోంది. వారు ‘స్మృతి’ అనే ఒక ఏకీకృత వేదికను నిర్మిస్తున్నారు. ఇది ఇప్పటికే ఒక వర్కింగ్ ప్రోటోటైపుగా ఉంది. దీని కేవలం డేటాను నిల్వచేయడానికి కాకుండా, ప్రత్యేకంగా శోధించడానికి రూపొందించారు. ఇందులో కీవర్డ్ సెర్చింగ్, సంబంధిత పాఠాల మధ్య క్రాస్-లింకింగ్, మరియు ఒక చిత్రాన్ని శోధించదాగిన డేటాగా మార్చే సెమీ-ఆటోమేటిక్ ట్రాన్స్ క్రిప్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ ట్రాన్స్క్రిప్షన్ సాధనం రెడీమేడ్ గా దొరికే సాఫ్ట్వేర్ కాదు. ఒక పండితుడు వాటిని అంగీకరిస్తాడు లేదా సరిదిద్దుతాడు. ప్రతి సవరణ మోడల్ కు శిక్షణ ఇస్తుంది. కాలక్రమేణా దానిని మరింత మేధాశక్తి కలిగినదిగా మరియు కచ్ఛితమైనదిగా చేస్తుంది.
ఈ డిజైన్ లోని రెండవభాగం చాలా డిజిటలైజేషన్ కార్యక్రమాలలో కొరవడుతుంది. MIDF స్వయంగా క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పనిచేయాలని ప్రతిపాదించడం లేదు, బదులుగా ఒక నిధులు మరియు ప్రమాణాల సంస్థగా పనిచేస్తుంది. సేకరణలను కలిగి ఉన్న సంరక్షకులు, భాగస్వాములకు, వారు ఒకే నిర్దేశాల ప్రకారం డిజిటలైజ్ చేయాలనే షరతు పై ఇది గ్రాంట్ లను జారీ చేస్తుంది. ఆ నిర్దేశాలే ఈ మొత్తం ప్రాజెక్ట్ కు నిశ్శబ్ద కేంద్రం.
భారతదేశం అంతటా వందలాది డిజిటలైజేషన్ పధ్ధతులు ఉన్నాయి. వారిలో ఒక రిపోజిటరీ ఐదు మెటాడేటా ఫీల్డ్ లను సంగ్రహిస్తే, మరొకటి (సరిపోలని) ఏడు ఫీల్డ్ లను, ఇంకొకటి ఇరవై మూడు ఫీల్డ్ లను సంగ్రహిస్తాయి. దీని ఫలితంగా వచ్చే అవుట్ పుట్ నిర్మాణాత్మకంగానే పొంతనలేకుండా ఉంటుంది. శాసనాలు, చేతివ్రతాల కోసం సమగ్రమైన మెటా డేటా ఫీల్డ్ లను నిర్ధారించే ISO తరహా ప్రమాణాల హ్యాండ్బుక్ తో దీన్ని పరిష్కరించాలని MIDF యోచన. భారతదేశంలోని ప్రతి డిజిటలైజేషన్ ప్రయత్నం దేశవ్యాప్త పరస్పరానుకూలత కోసం ఈ ప్రమాణాన్ని అందుకోవాలనేది దీని లక్ష్యం.
దీనిని శాసనాల ద్వారా కాకుండా, గ్రాంట్ లు మరియు ప్రమాణాల ద్వారా చేయవలసిరావడంవల్ల ప్రభుత్వం ఈ పనిని చేపట్టలేదు. యాజమాన్యం తరతరాలుగా ఈ వారసత్వాన్ని కపడుతున్న సాంప్రదాయ సంరక్షకులు దానిని బేషరతుగా వదులుకోరు. MIDF నమూనా సంరక్షణ బాధ్యతను ఉన్నచోటనే వదిలివేస్తుంది, తద్వారా సంరక్షకుడు వ్రతప్రతిని, దాని డిజిటల్ కాపీ హక్కులను తనవద్దే ఉంచుకుంటాడు. అదే సమయంలో MIDF మూలధనాన్ని, ప్రమాణాన్ని, దానిని సులభంగా కనుగొనగలిగేలా ఒక స్థలాన్ని అందిస్తుంది. సంస్థలు సాధారణంగా (సరైన కారణాలతోనే) బయటి వ్యక్తుల పట్ల అనుమానంతో ఉండే రంగంలో, ఈ విధానం నమ్మకాన్ని పెంచుతుంది. వారిని దోపిడీచేసేవారుగా కాకుండా భాగస్వాములుగా పరిగణించి, తమ ఆర్కైవ్ లను పంచుకోవడానికి విముఖంగా ఉన్న సేకరణకర్తలను ఒప్పించగలదు.
ఆ విధానంతో, ఒక నెలలోపే, ఎటువంటి నిధులు సమీకరించకుండానే, MIDF బృందం ఒక పని చేసే నమూనా నిర్మించింది. అంతర్జాతీయ లెగసి ప్లాట్ ఫామ్ లు చేయని పనిని ఇప్పటికే భారతదేశం కోసం చేస్తోంది. ఇది క్రాస్-లింకు లను కలిగి ఉంటుంది, నిర్మాణాత్మక మెటాడేటాను మోస్తుంది. ఇది కేవలం బ్రౌస్ చేయడానికి కాకుండా శోధించడానికి వీలుగా నిర్మించబడింది. కేవలం నాలుగు లేదా ఐదు నెలల్లో, కేవలం ముగ్గురు గ్రాంట్ భాగస్వాముల సహాయంతో పనిచేస్తూ, ఈ బృహత్ ప్రయత్నం సుమారు 14 హార్డ్ డ్రైవ్ ల డేటాను తరలించింది. అందులో 2 కోట్లకు పైగా పేజీలు, 91,000 తాళపత్ర గ్రంథాలు, 1,000 శాసనాలు, 50 లక్షల సున్నితమైన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. అరువు తెచ్చుకున్న కార్మికులు, ఒక పార్ట్ టైమ్ ఇంజనీర్ మాత్రమే దీన్ని సాధించగలిగారు. ఈ కార్యాన్ని శాశ్వతంగా చేయడానికి MIDF 15 కోట్ల రూపాయల నిధిని సమీకరిస్తోంది.
మొదటి దశకు సాంకేతికత, హోస్టింగ్ ఖర్చులు, డిజిటలైజేషన్ భాగస్వాములకు గ్రాంట్ ల కోసం 5 కోట్ల రూపాయలు అవసరం. ఈ ప్లాట్ ఫామ్ నిర్మించబడిన తరువాత, ఇది పూర్తిగా భారతీయ సర్వర్ లపై హోస్ట్ చేయబడి, ఎవరైనా ఉచితంగా ఉపయోగించుకోవడానికి వీలుగా తరతరాలకు శాశ్వత మౌలిక సదుపాయంగా ఉపయోగపడుతుందని ఈ ఫౌండేషన్ చెబుతోంది. ఒక మధ్య స్థాయి సినిమా మార్కెటింగ్ బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో, భారతదేశం తన స్వంత చరిత్రను భద్రపరచుకోవడానికి విదేశాలపై ఆధారపడతాన్ని ఎట్టకేలకు ఆపగలదు. (ఈ ప్రయత్నానికి మద్దతు ఇవ్వాలనుకునేవారు విరాళం ఇవ్వవచ్చు.)
ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఎన్నో గ్రంథాలు ప్రస్తుతం జాబితా చేయని కుప్పలలో, క్షీణిస్తూ, వాటి ఉనికిని గుర్తించే సూచిక లేకుండా, వాటిని ఎప్పటికీ కనుగొనలేని శోధనలేకుండా పడిఉన్నాయి. వీటిని ఈ ఫౌండేషన్ భారతీయుల పరిశీలనకు, అధ్యయనానికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది.
—శ్రీ కౌండిన్య
More Stories
Dakshinapatha Telugu bulletin – Ayshwayuja masam (October 2026)
దక్షిణాపథ వార్తవని -భాద్రపద మాసం (సెప్టెంబర్ 2026)
దక్షిణాపథ వార్తవని-శ్రావణమాసం 2026