RSS NEWS

  • ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 
    ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు – వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసి, సాధించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లో 1975-77 మధ్య కాలంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ భారత చరిత్రలోనే మర్చిపోలేని చీకటి అధ్యాయం. 25 జూన్ 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 21 మర్చి 1977 వరకు 21 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దేశంలో అస్థిరత […]
  • నియంతృత్వ ఎమర్జెన్సీకి 49 ఏళ్లు
    -ప్రదక్షిణ వరిష్ట పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహంగారి పుస్తకం `ఎమర్జెన్సీ జ్ఞ్యాపకాలు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం’ ఆధారంగా ఈ వ్యాసం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ విధించిన 25 జూన్ 1975 రాత్రి నుంచి తీవ్రమైన దమనకాండ ప్రారంభమైంది. ప్రజల పౌరహక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా అధికారికంగా హరించబడ్డాయి. పత్రికలపై పూర్తి స్థాయి సెన్సర్షిప్ విధించబడింది. అన్ని రాజ్యాంగ సంస్థలు పూర్తిగా, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె ఆంతరంగిక బృందం ఆధీనంలో ఉండి, […]
  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం […]
  • వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ – హిందూ సామ్రాజ్య దినోత్సవం
    1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన […]
  • వీరనారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి
    భారతదేశం ఎందరో వీరులను వీర మాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు వీర మాతలు ఈ గడ్డ పై జన్మించారు. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణపాయంగా ఎంచి తల్లిభారతి పాదాల చెంత సమ్పర్పించారు. తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యులారు ‘మణి’ కర్ణిక… మన రాణి ఝాన్సీ లక్ష్మీ భాయి. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి […]
  • శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్
    -అనంత్ సేథ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 5వ సర్ సంఘచాలక్ శ్రీ కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్ జీ ఆషాఢ శుద్ధ తృతీయ, 18 జూన్ 1931 నాడు రాయ్ పూర్ లో జన్మించారు. వారు 9 సం|| వయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళటం ప్రారంభించారు. వారు 6 దశాబ్దాలు సంఘ ప్రచారక్ గా సేవచేసి, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ్ జీ తర్వాత 2000 సం|| లో సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. చదువు రీత్యా ఇంజనీర్ అయిన వారు, శారీరిక దార్ఢ్యత మరియు […]
  • RSS Sarsanghchalak Late KS Sudarshan Birth Anniversary: Committed to swadeshi and economic self-reliance
    KS Sudarshan was directly associated with Swadeshi Jagran Manch (SJM) as Marg-darshak for about 7 years before taking up the responsibility of Sarsanghachalak. After the formation of SJM by Dattopant Thengadi in 1991, Swadeshi movement took off only after its national convention of 1993 in Delhi. With the support from karyakartas of Rashtriya Swayamsevak Sangh […]
  • ఐరోపాలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభం
    ఐరోపాలో అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతంలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభోత్సవం జరిగింది. జూన్‌ 4 న ఈ ఉత్సవాలు ప్రారంభమై… పదమూడో తేదీ వరకూ వైభవోపేతంగా జరిగాయి. దేవాలయ ప్రారంభోత్సవం, మహా కుంభాభిషేకం తమిళనాడుకి చెందిన భూపతి శివాచార్య స్వామిగల్‌, వెంకటేష్‌ జయరామ్‌ అనే అర్చకులు నిర్వహించారు. సంప్రదాయమైన ముఖ్య ఘట్టాలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత శివునితో పాటు శ్రీ కర్పగ నాధర్‌, బ్రహ్మంద్‌ […]
  • మోహన్ భాగవత్ అలా అనలేదు : క్లారిటీ ఇచ్చిన సంఘ్
    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌  వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా హిందీ పత్రిక దైనిక్‌ జాగరణ్‌ ఓ వార్త ప్రచురించింది. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆరెస్సెస్ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మోహన్‌ భాగవత్‌ స్పందించారని ఆ పత్రిక పేర్కొంది. “మన దేశంలోని ప్రతి పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్చ వుందని, నడ్డా […]
  • దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు
    మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలన్న (డీ లిస్టింగ్‌) ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. వనవాసీ సంఘాలు దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో డీ లిస్టింగ్‌ డిమాండ్‌ తో ‘‘పోస్ట్‌కార్డ్‌’’ ఉద్యమాన్ని కూడా చేస్తున్నారు. కొందరు గిరిజనులు మతం మారినా… ఇప్పటికీ గిరిజన సమాజానికి వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ:వ్యాప్తంగా ‘‘జనజాతి సురక్షా మంచ్‌’’ పేరుతో గిరిజనులందరూ ఏకమై పెద్ద […]

రాంజీ గోండు (పుణ్యతిథి, ఏప్రిల్ 9)

సహ్యాద్రి పర్వత శ్రేణుల నడుమ కోటబురుజులతో, 13గొలుసుకట్టు చెరువులతో, పచ్చని అడవులతో అలరారే ప్రాంతం నిర్మల్ నగరం. ఇప్పుడది ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొయ్యబొమ్మల నిలయం కూడా. కేవలం కోట బురుజులు, కొయ్యబొమ్మలే కాదు భారత స్వాతంత్ర్య  సంగ్రామ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించ బడ్డ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని వేయి మంది వనవాసీ వీరులను అందించినది కూడా నిర్మల్ నగరమే.

వనవాసీ వీరుల నాయకుడే  రాంజీగోండు.
కొండల్లో, గుట్టల్లో, అడవుల్లో ఉండేవారు కూడా దేశమాత స్వేచ్చ కోసం తిరుగుబాటు చేసి తమ దేహాన్ని ఆహుతిచ్చారని ఋజువు చేసిన ఉదంతానికి ప్రత్యక్ష సాక్షి వేయి ఉరుల  మర్రి.
దాదాపు రెండు వందల ఏండ్ల  కిందటే ఇక్కడి బిడ్డలకు పోరాట పాఠాలు నేర్పిన వీరుడు రాంజీగోండు.  1857లో ఉత్తర భారతంలో ప్రారంభమైన ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామాన్ని నేలన నడిపిన గోండు వీరుడే రాంజీగోండు. వీరుని నాయకత్వంలోనే ఏకకాలంలో అటు ఆంగ్లేయులు, ఇటు స్థానిక నైజాం పాలకులతో పోరాటం కొనసాగింది. చెల్లాచెదురుగా చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న పూర్వ ఆదిలాబాదు ప్రాంత వనవాసులందరినీ ఏకం చేసి బ్రిటిష్ కలెక్టరు నివాసప్రాంతమైన నిర్మల్ నగరాన్నే తన యుధ్ధభూమిగా ఎంచుకున్న ధీరుడు రాంజీగోండు. ఈవీరుని నేతృత్వంలో పనిచేసిన వనవీరులను రోహిల్లాలు అంటారు. చారిత్రకమైన ఈ రోహిల్లాల పోరాటానికి మన కుహనా చరిత్రకారులు అసలు స్థానం కల్పించలేదు.

మధ్యభారతంలోని మహారాష్ట్ర, ఒడిశా, మధ్య ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నివసించే అనేకమంది గిరిజన తెగల సమూహాల్లో గోండ్వానా రాజ్యం బ్రిటిష్ పాలకులు  రాక పూర్వమే ఏర్పడి ఉన్నది. గోండుల పాలన సా.శ. 1240-1750 వరకు సుమారు 5 శతాబ్దాలపాటు కొనసాగింది. 9 మంది గోండు రాజులలో చివరివాడైన నీల్‌కంఠ్‌షా (సా.శ. 1735- 49) ని మరాఠీలు బంధించి చంద్రాపూర్‌ను ఆక్రమించుకున్నారు. దీంతో గోండ్వానా ప్రాంతం మరాఠీల ఆధీనమై, వారు బ్రిటిష్ వారికి తలొగ్గి గోండ్వానాను తెల్లదొరలకు అప్పగించారు. దీంతో గోండుల పాలన అంతమై, ఆంగ్లేయుల, నైజాం పాలన ఆరంభమైంది. వీరి పీడనకు వ్యతిరేకంగా గిరిజనుల తిరుగుబాటు మొదలైంది.

ఆదిలాబాద్ జిల్లాలోని రాంజీగోండు 1860 ప్రాంతంలో నాటి జనగాం (అసిఫాబాద్)ని  కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ సైన్యాలను ధీటుగా ఎదుర్కొన్న తొలి గిరిజన పోరాట యోధుడు. బ్రిటిష్ సైన్యంతో ఎదురొడ్డి ఝాన్సీ లక్ష్మిబాయి వీరమరణం పొందిన తర్వాత నానాసాహెబ్, తాంతియాతోపే, రావు సాహెబ్‌లు తమ బలగాలతో విడిపోయారు. తాంతియా అనుచరులైన రోహిల్లా సిపాయిలు పెద్ద సంఖ్యలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీదర్, పర్బనీ, ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించారు. వీరు అజంతా, బస్మత్, లాథూర్, మఖ్తల్, నిర్మల్‌లను పోరాట కేంద్రాలుగా చేసుకున్నారు. వీరి నేతగా ప్రకటించుకున్న రంగారావు నిజాం ప్రభుత్వాన్ని పడగొట్టి, బ్రిటిష్ వాళ్లను తరిమేయాలని పోరాటానికి పూనుకున్నాడు. సైనిక బలగాల శిక్షణలో ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసే క్రమంలో బ్రిటిష్ సైన్యానికి పట్టుబడ్డాడు. యావజ్జీవశిక్ష అనుభవిస్తూ అండమాన్ జైలులో 1860 లో మరణించాడు. పిమ్మట రాంజీ నేతృత్వంలో పోరాటం తీవ్రమైంది.

రోహిల్లాల పోరాటం ప్రధానంగా నాటి అసిఫాబాద్ తాలూకా నిర్మల్ కేంద్రంగా జరిగింది. అది ప్రధానంగా గోండులు, కోలాము, కోయ తెగల గిరిజనుల ప్రాంతం. రాంజీగోండ్ సారథ్యంలో తిరుగుబాటు ఉధృతంగా మారింది. తిరుగుబాటు తుది కీలక ఘట్టం 1860 మార్చి ఏప్రిల్‌లో జరిగింది. బానిస బతుకులు వెళ్లదీస్తున్న గోండు గిరిజనులు వెట్టికి ప్రతిఫలం ఆశించడాన్ని తెల్లదొరలు, వారి తాబేదారు నైజాం నవాబు సహించలేకపోయారు. ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాలు బ్రిటిష్ వారి దౌర్జన్యంతో అల్లకల్లోలంగా మారాయి. రాంజీ నాయకత్వంలో వెయ్యి మంది రోహిల్లాలు, గోండులు కలసి నిర్మల్ సమీపంలోని కొండలను కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ పాలకులను ముప్పుతిప్పలు పెట్టారు. నిర్మల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిజాం బలగాలు వారిపై దాడులు చేసాయి. ఆధునిక ఆయుధాల ముందు, బ్రిటిషు వారి కుటిల యుక్తుల ముందు ఆదివాసులు నిలవలేకపోయారు. తెగించి పోరాడుతున్న ఆది వాసులను వెనకనుండి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. కడదాకా పోరాడిన రాంజీగోండుతో సహా వెయ్యి మందిని పట్టుకుని నిర్మల్ ఎల్లపెల్లి మార్గంలో ఉన్న మర్రి చెట్టుకు 1860 ఏప్రిల్ 9 ఉరితీశారు. మర్రి చెట్టే వెయ్యి ఉరుల మర్రిచెట్టుగా ప్రసిద్ధి చెందింది. ఇలాంటి చారిత్రక ఘటనలు దేశ చరిత్రలో మునుపెన్నడూ జరిగిన దాఖలాలు లేవు. ఒకేసారి ఒకేచెట్టుకు వెయ్యిమందిని ఉరితీసిన ఘటన మన చరిత్ర పుట‌ల్లో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. కానీ మాతృభూమి కోసం చిరునవ్వులతో ఉరికొయ్యలను  ముధ్ధాడిన ఆ వీరుల స్పూర్తి తర్వాతితరం స్వతంత్ర యోధులకు ప్రేరణగా నిలచింది.

తెల్లదొరల దురాగతాలకు చిహ్నంగా నిలిచిన మర్రిచెట్టు తర్వాతి కాలంలో అంటే 1995లో వచ్చిన పెద్ద వడగళ్ల వానకు నేలకు ఒరిగింది. ఆతర్వాత అప్పటి భా..పా. నాయకులు శ్రీ సీ.హెచ్. విద్యాసాగర్ రావు గారి నేతృత్వంలో అదే ప్రదేశంలో మర్రి మొక్క నాటితేకొందరు ముస్లిం దురాక్రమణ దారులు స్థలం మాది అంటూ మొక్కను తొల‌గించారు. స్థలానికి దగ్గరలోనే రోడ్డుపై తర్వాత కాలంలో ఒక స్థూపం పెట్టారు. అదే విధంగా నిర్మల్ నగరంలో గొలుసుల దర్వాజ ప్రాంతంలో రాంజీ గోండు విగ్రహం పెట్టారు. రాంజీగోండ్ నాయకత్వంలో సాగిన వీరోచిత పోరాటాన్ని చరిత్రకారులు నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ పోరాట మూలాలను వెతుక్కుంటూ తనదైన చరిత్రను పునర్నిర్మించుకుంటున్న తరుణంలో రాంజీ చరిత్రను వెలుగులోకి తేవాలి. రాంజీ గోండ్ పోరాటాన్ని, త్యాగాల్ని భావితరాలకు అందించాలి. అదే ఆవీరునికి మనమిచ్చే ఘన నివాళి.

వి ఎస్ కే తెలంగాణ సౌజన్యంతో