సామాజిక సమత సాధనలో,,,,,,
అందరికీ,ప్రత్యేకముగా ఎస్సి లకు దేవాలయ ప్రవేశం కొరకు అనేక ఉద్యమాలు జరిగాయి,కొన్ని ఉద్యమాల వల్ల ఆశించిన లక్ష్యం నెరవేరింది,కొన్ని చోట్ల నెరవేర లేదు,
=కేరళలో:
1924,25 ల్లో వైకోం సత్యాగ్రహం 604 రోజుబు జరిగింది,
1931=32 గురవాయార్ సత్యాగ్రహము జరిగింది,ఈ రెండు ఉద్యమాలకు= టి,మాధవన్,కే,పి కెశవ మీనన్,కేలప్పన్
,ఇ,వి,రామస్వామి నాయక్ వంటి అన్ని కులాలకు చెందిన వారు పాల్గొన్నారు,
=12 నవంబరు 1936న తిరువాన్కూర్ మహరాజు శ్రీ చితిర తిరునాళ్ బలరామ వర్మ అందరికీ దేవాలయ ప్రవేశం కల్పిస్తూ ప్రకటన చేశారు,
=జమ్మూలో
రెండవ రౌండ్ టేబుల్ సమావేశం లో పాల్గొన్న మహరాజా హరి సింహ్ ,బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రసంగం విని ప్రేరితుడై 1932లో జమ్ములో ఉన్న రఘునాధ మందిరంలో అందరికీ ప్రవేశమునకు. అనుమతిని ఇస్తూ ప్రకటన జారీ చేశారు,
=ఆంధ్ర ప్రదేశ్ లో
1933,నవంబరు 2న కృష్ణ జిల్లా ఘంటసాల గ్రామంలో ఒక సం,పాటు 85% ఇండ్లలో ఇంటింట సంతకాలు సేకరించి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో గ్రామస్తుల సహకారంతో గొట్టిపాటి బ్రహ్మయ్య,వేముల కూర్మయ్య ఎస్సీలకు దేవాలయ ప్రవేశము చేయించారు,
= కాలారాం మందిర సత్యాగ్రహం
2మార్చి 1930 న మహరాష్ట్ర లోని నాసిక్ కాలారాం మందిరం లో ప్రవేశం కోరుతూ డా,బాబాసాహెబ్ అంబేడ్కర్ నేత్రుత్వంలో సత్యాగ్రహం ఒక సంవత్సరం జరిగింది అయినా సానుకూల ఫలితం రాలేదు,
=17 నవంబరు 1933 లో వార్ధా నుండి 9 నెలలు గాంధీజీ దేశవ్యాప్త ముగా హరిజన యాత్ర చేశారు ఈ యాత్ర లో అనేక చోట్ల దేవాలయ ప్రవేశం జరిగింది.
= తమిళనాడులో తంజావూరు బ్రుహదేశ్వర దేవాలయంలో ఉన్న ఒక బోర్డులో “మహాత్మా గాంధీ కోరిక మేరకు ఇక్కడి రాజు చుట్టు ప్రక్కల 96 దేవాలయాల్లోకి అందరికీ ప్రవేశం కల్పిస్తూ 1933 లో ప్రకటన చేశారు,”
=1939 లో మధురై దేవాలయ ప్రవేశ సత్యాగ్రహము,
=1939;,లో అంబాదేవి(అమరావతీ) సత్యాగ్రహ ము జరిగాయి,
=1947 లో మద్రాసు అసెంబ్లీ లో అన్ని బహిరంగ స్తలాల్లో అందరికీ ప్రవేశం ఉండాలని(Madras removal of civil disabilities (amendment) bill-1947 చట్టం అయింది
=1946లో నెల్లూరు లో శ్రీ వేనుగోపాల స్వామి దేవాలయ ప్రవేశం కొరకు శ్రీ పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేయగా దేవాలయ ధర్మకర్తలు అంగీకరించారు,
ఇలా అనేక ఉద్యమాలు,అనేక తీపి,చేదు అనుభవాలు వచ్చాయి,
12 నవంబరు 1936 లో తిరువాన్కూర్ మహరాజు చేసిన సానుకూల ప్రకటన చారిత్రాత్మక మైనది,కనుక
12 నవంబరును దేవాలయ ప్రవేశ దినోత్సవముగా నిర్వహించు కుందాం!
ఈ కార్యక్రమము ఎందుకు చేయాలి?
డా అంబేడ్కర్ దేవాలయ ప్రవేశ ము కొరకు సత్యాగ్రహం చేసారు,
హిందూ సమాజం నుండి సానుకూలత రాలేదు,కనుక వారు బౌద్ధ స్వీకరించారు,ఇది నిజమే!
మిగిలిన అనేక సందర్భాల్లో హిందూ సమాజం నుండి ఆ కాలంలోనే సానుకూల స్పందన వచ్చింది కదా! హిందూ సమాజాన్ని ఆడిపోసుకోవడం,హిందూ సమాజంలో అవసర మైన మార్పు రాదు అనే విశ్లేషణ సరికాదు,
కాలానుగుణంగా హిందూ సమాజం మార్పులను అంగీకరించే flexible society,
More Stories
మన ప్రాచీన విద్యా సంస్థలు
టిప్పు ను మట్టి కరిపించి ఓడించి, మరుగునపడిన హిందూ వీరుడి గాథ: తుకోజీరావు హోల్కర్
వీరాంగన ” నీరా ఆర్య” మొదటి మహిళా గూఢాచారి