RSS NEWS

  • ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 
    ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు – వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసి, సాధించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లో 1975-77 మధ్య కాలంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ భారత చరిత్రలోనే మర్చిపోలేని చీకటి అధ్యాయం. 25 జూన్ 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 21 మర్చి 1977 వరకు 21 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దేశంలో అస్థిరత […]
  • నియంతృత్వ ఎమర్జెన్సీకి 49 ఏళ్లు
    -ప్రదక్షిణ వరిష్ట పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహంగారి పుస్తకం `ఎమర్జెన్సీ జ్ఞ్యాపకాలు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం’ ఆధారంగా ఈ వ్యాసం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ విధించిన 25 జూన్ 1975 రాత్రి నుంచి తీవ్రమైన దమనకాండ ప్రారంభమైంది. ప్రజల పౌరహక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా అధికారికంగా హరించబడ్డాయి. పత్రికలపై పూర్తి స్థాయి సెన్సర్షిప్ విధించబడింది. అన్ని రాజ్యాంగ సంస్థలు పూర్తిగా, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె ఆంతరంగిక బృందం ఆధీనంలో ఉండి, […]
  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం […]
  • వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ – హిందూ సామ్రాజ్య దినోత్సవం
    1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన […]
  • వీరనారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి
    భారతదేశం ఎందరో వీరులను వీర మాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు వీర మాతలు ఈ గడ్డ పై జన్మించారు. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణపాయంగా ఎంచి తల్లిభారతి పాదాల చెంత సమ్పర్పించారు. తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యులారు ‘మణి’ కర్ణిక… మన రాణి ఝాన్సీ లక్ష్మీ భాయి. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి […]
  • శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్
    -అనంత్ సేథ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 5వ సర్ సంఘచాలక్ శ్రీ కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్ జీ ఆషాఢ శుద్ధ తృతీయ, 18 జూన్ 1931 నాడు రాయ్ పూర్ లో జన్మించారు. వారు 9 సం|| వయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళటం ప్రారంభించారు. వారు 6 దశాబ్దాలు సంఘ ప్రచారక్ గా సేవచేసి, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ్ జీ తర్వాత 2000 సం|| లో సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. చదువు రీత్యా ఇంజనీర్ అయిన వారు, శారీరిక దార్ఢ్యత మరియు […]
  • RSS Sarsanghchalak Late KS Sudarshan Birth Anniversary: Committed to swadeshi and economic self-reliance
    KS Sudarshan was directly associated with Swadeshi Jagran Manch (SJM) as Marg-darshak for about 7 years before taking up the responsibility of Sarsanghachalak. After the formation of SJM by Dattopant Thengadi in 1991, Swadeshi movement took off only after its national convention of 1993 in Delhi. With the support from karyakartas of Rashtriya Swayamsevak Sangh […]
  • ఐరోపాలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభం
    ఐరోపాలో అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతంలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభోత్సవం జరిగింది. జూన్‌ 4 న ఈ ఉత్సవాలు ప్రారంభమై… పదమూడో తేదీ వరకూ వైభవోపేతంగా జరిగాయి. దేవాలయ ప్రారంభోత్సవం, మహా కుంభాభిషేకం తమిళనాడుకి చెందిన భూపతి శివాచార్య స్వామిగల్‌, వెంకటేష్‌ జయరామ్‌ అనే అర్చకులు నిర్వహించారు. సంప్రదాయమైన ముఖ్య ఘట్టాలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత శివునితో పాటు శ్రీ కర్పగ నాధర్‌, బ్రహ్మంద్‌ […]
  • మోహన్ భాగవత్ అలా అనలేదు : క్లారిటీ ఇచ్చిన సంఘ్
    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌  వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా హిందీ పత్రిక దైనిక్‌ జాగరణ్‌ ఓ వార్త ప్రచురించింది. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆరెస్సెస్ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మోహన్‌ భాగవత్‌ స్పందించారని ఆ పత్రిక పేర్కొంది. “మన దేశంలోని ప్రతి పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్చ వుందని, నడ్డా […]
  • దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు
    మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలన్న (డీ లిస్టింగ్‌) ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. వనవాసీ సంఘాలు దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో డీ లిస్టింగ్‌ డిమాండ్‌ తో ‘‘పోస్ట్‌కార్డ్‌’’ ఉద్యమాన్ని కూడా చేస్తున్నారు. కొందరు గిరిజనులు మతం మారినా… ఇప్పటికీ గిరిజన సమాజానికి వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ:వ్యాప్తంగా ‘‘జనజాతి సురక్షా మంచ్‌’’ పేరుతో గిరిజనులందరూ ఏకమై పెద్ద […]

శ్రీ అయ్యగారి సాంబశివరావు (A S Rao) ECIL వ్యవస్థాపక MD

తెలుగు వారికి ఎనలేని ఖ్యాతి గౌరవం తీసుకుని వచ్చిన మహనీయుడు గురించి ఈరోజు తెలుసుకుందాం.

పుట్టిన ఊరిలో ఒక వీధికి కూడా ఆయన పేరు లేదు. కానీ హైదరాబాద్ లాంటి ఒక మహా నగరంలో ఒక ఏరియా కి ఆయన పేరుని నామకరణం చేశారు. చరిత్రలో, ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఓ గొప్ప వ్యక్తి కథ ఇది !!

ఆ గొప్ప వ్యక్తి మన గోదావరి ప్రాంతానికి చేసిన వారు కావడం ఎంతో గర్వకారణం.

“కాలం మనిషిని పుట్టిస్తుంది, అదే కాలం మనిషిని తనలో ఐక్యం చేసుకుంటుంది.”

ఆ మనిషి పేదవాడైనా ధనవంతుడైనా సామాన్యుడైనా – అసమాన్యుడైనా అదే కాల ధర్మం. ఆ వ్యక్తి చేసిన పనులను బట్టి కొందరు చరిత్ర పుటల్లో మిగిలిపోతారు – మరి కొందరు ప్రజల హృదయాల్లో!

అలా చరిత్రలో మరియు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న అతి కొద్ది మంది వ్యక్తులలో, ఈయన కూడా ఒకరు. ఆయన మరెవరో కాదు మన గోదావరి తల్లి ముద్దుబిడ్డ… భారతదేశాన్ని_ఎలక్ట్రానిక్ రంగంలో అగ్రదేశాలతో సరిసమానంగా నిలిపిన మహోన్నతుడు, అంతకుమించి మానవతావాది, కర్మయోగి. ఆయన పేరుని ఆయన పుట్టిన ఊరికి కాక, వేరే ఒక ప్రాంతంలో, అది కూడా ఒక ప్రముఖ మెట్రో నగరంలో ఒక ఏరియా కి ఆయన పేరు పెట్టారంటే ఆయన ఏమి సాధిస్తే అలా పెడతారు? ఆ పేరు పలికితే రెండే పదాలు, కానీ ఆయన పేరు కన్నా ముందుగా ఆయన ఏం సాధించారో చెప్తే ఆ పేరుకున్న వెయిట్ అర్థం అవుతుంది, ఆ పేరు గల మనిషి బలం అర్ధం అవుతుంది.

“ఈ ప్రపంచంలో కనుగొనబడిన ప్రతిదీ కూడా ఈ భూమి ప్రసాదమే, అది మనం తినే అన్నమైనా ఒక సూపర్ కంప్యూటర్ అయినా. అలాగే తాను కనిపెట్టగలిగే వస్తువు ముడి సరుకు ఆ భూమిలోనే ఉంది అనే మేధస్సు కలిగిన వ్యక్తుల ఆలోచనల ఫలితమే ఈరోజు మనం ప్రపంచంలో అనుభవించే ప్రతి సుఖానికి, బద్ధకానికి నాంది.
**** **** ****

అది 1914 వ సంవత్సరం సెప్టెంబర్ 20వ తారీకు విక్రమ నామ సంవత్సరం, భాద్రపద బహుళ దశమి, సోమవారం మేష లగ్నం, భీమవరానికి పది కిలోమీటర్ల దూరంలో ‘మోగల్లు’ అనే చిన్న పల్లెటూరు, సమయం సరిగ్గా రాత్రి తొమ్మిది కావస్తోంది అప్పుడే అయ్యగారి వారింట ఒక నిండు గర్భిణీ ఐన సుందరమ్మకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యయి, హాస్పిటల్ కి వెళ్ళాలన్నా పది కిలోమీటర్ల పోవాలి, ఊళ్లో పురుడు పోసే ఒక ముసలమ్మను వెంటనే తీసుకొచ్చారు, లోపలికి వెళ్లి తలుపులు మూసింది, మళ్లీ అదే ముసలమ్మ తలుపులు తెరిచి ఆ రాములోరి నక్షత్రంలో నీకు మగ బిడ్డ జన్మించాడు వెంకటాచలం అంటూ శుభవార్తను తెలియజేసింది.

ఆ బిడ్డ పెరిగి పెద్దవాడు అవుతున్నాడు, చిన్నప్పటి నుంచి చదువు అంటే ఎంతో ప్రేమ, అలాంటి ఇలాంటి ప్రేమ కాదు, ప్రతి పరీక్షలోనూ అతడే అగ్రగణ్యుడు.
ఆ మొగల్లులోనే ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు. అంతకుమించి అతనికి చదవాలని ఆశ ఉన్నా, స్కూలు అయితే లేదు. అప్పట్లో ఐదవ తరగతి దాటి చదవాలంటే వేరే ఊరు వెళ్లాలి, తన కుటుంబాన్ని ఎంతగానో బ్రతిమాలాడు, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, చివరికి తణుకు కు చెందిన వంగూరి వారు అతనికి చదువు మీద ఉన్న ప్రేమను చూసి వసతి, మరియు వారంలో ఒక రోజు భోజనం పెట్టడానికి ఒప్పుకున్నారు, మొత్తం మీద తణుకు హైస్కూల్లో తన యొక్క సెకండరీ విద్యను ప్రారంభించి ప్రతిరోజు భోజనానికి వారాలబ్బాయిగా మారాడు, ఒకరోజు భోజనం అంటే ఏదోలా కష్టపడొచ్చు కానీ ఎస్.ఎస్.ఎల్.సి పూర్తయ్యేంతవరకు భోజనం అంటే మాటలా, కొంతమంది నువ్వు మా వాడివి కాదని, మరి కొంతమంది మీ శాఖ వేరని అలా చాలామంది భోజనం పెట్టేవారు కాదు, ఒక్కోసారి కొన్ని వారాల పాటు కూడా భోజనం చేసే అవకాశం ఉండేది కాదు, చివరికి ఒక్కోసారి తన ఆకలిని తీర్చుకోవడానికి మినుములను నానబెట్టి వాటిని తింటూ ఉండేవాడు. మొత్తానికి కష్టపడి దాతల సహకారంతో #తణుకులోనే ఎస్.ఎస్.ఎల్.సి ని విజయవంతంగా పూర్తి చేశారు, చదువుకోవాలి అనే తృష్ణ ఆయనలో రోజురోజుకీ పెరిగిందే తప్ప ఎన్నడూ తగ్గలేదు.*

“నీ సంకల్పం గొప్పదైతే ప్రపంచంలో ప్రతి అణువణువు కూడా నీకు సహకరిస్తుంది!”

ఎలాగో అలా ఎస్.ఎస్.ఎల్.సి అయితే పూర్తి చేశాడు కానీ తర్వాత ఇంటర్మీడియట్ కూడా చదవాలి అనే తన ఆశని తన అన్నలకి వ్యక్తం చేయడంతో వారు కూడా సరే అని విజయనగరం మహారాజా కాలేజీలో జాయిన్ చేశారు. జాయిన్ అయితే అయ్యాడు కానీ మళ్ళీ అదే ఆర్థిక సమస్యలు.* చివరికి ప్రతి రోజు ఆ విజయనగరంలో* దేవాలయాల వద్ద వచ్చే భక్తులకు తనకు సాయం చేయమని కూడా అడిగేవాడు.*
“కడుపు కోసం చెయ్యి చాచేవాడిని చూసి ఉంటాము, కానీ చదువు కోసం చేయి చాచిన వ్యక్తులు చాలా అరుదు కదా!”“`
అలా కష్టపడి చదువును నెట్టుకొస్తున్న సమయంలో ఇతని ప్రతిభను గుర్తించినటువంటి ఆ విజయనగరం మహారాజా వారు కొంతవరకు సాయం చేయడంతో మొత్తానికి విజయవంతంగా తన ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.

కొడుకుకి చదువు మీద ఉన్న ప్రేమను చూసి ముగ్దురాలైన ఆయన తల్లిగారు, తన పట్టు చీరలు అమ్మేసి తన కొడుకుని బీఎస్సీలో చేర్చడానికి సహకరించారు. వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో బ్యాచిలర్ గా తన జీవితాన్ని ప్రారంభించిన ఆయన జాయిన్ అయిన మొదటి రోజు నుంచే ఎంతో కష్టపడి చదివేవారు.

అప్పట్లో పండిత మదన్ మోహన్ మాలవ్య ఆ కాలేజీ యొక్క ప్రిన్సిపాల్ గా ఉండేవారు.
జాయిన్ అయితే అయ్యాడు కానీ మొదటి సంవత్సరం ఫీజు కూడా కట్టలేని పరిస్థితి. అతని పరిస్థితి చూసి పండిత్ మదన్మోహన్ మాలవ్య గారు కనీసం రెండో సంవత్సరం అయినా ఫీజు కట్టమని చెప్పారు, మళ్లీ రెండో సంవత్సరం కూడా అదే పరిస్థితి. కానీ అతనికి చదువు మీద ఉన్న ప్రేమకు ఆనంద భరితుడైన ఆ ప్రిన్సిపాల్ గారు కనీసం మూడో సంవత్సరం అయినా పరీక్ష ఫీజు కట్టమని చెప్పి ఆ సంవత్సరం కూడా పరీక్షలు రాయనిచ్చారు. కనీసం కొనుక్కోవడానికి పుస్తకాలు కూడా లేని పరిస్థితి, పరీక్ష సమయంలో పుస్తకాలు కూడా ఎవర్నో ఒకరిని అప్పు అడిగి తెచ్చుకొని చదివేవారు, చివరికి మూడో సంవత్సరం రానే వచ్చింది, కానీ ఈసారి ప్రిన్సిపాల్ గారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. చివరికి చేసేది ఏమీ లేక ఇంటికి టెలిగ్రామ్ పంపారు, “మీరు కనుక డబ్బు పంపగలిగితే రెండు రోజుల్లో నేను ఫీజు కట్టగలను లేదంటే రెండు రోజులలో ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాను” అని దాని సందేశం.

ఆరోజు ‘మోగల్లు’లో డ్యూటీలో ఉన్న #పోస్టుమాస్టర్ పైడిమర్రి వెంకట రామయ్య గారు, ఈ యొక్క విషయాన్ని చదివి చలించిపోయి, వాళ్ల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి భార్య 120 తులాల బంగారు గొలుసును అమ్మేసి ఆ డబ్బులు అతనికి మనీ ఆర్డర్ చేశారు.
“నిజంగా అటువంటి దాతృత్వం కలిగిన వెంకటరామయ్య గారు ఆ రోజు డ్యూటీలో లేకపోయి ఉంటే ఈరోజు భారతీయ ఎలక్ట్రానిక్ పరిస్థితి వేరే రకంగా ఉండేదేమో.”

మొత్తానికి మనీ ఆర్డర్ తో ఫీజు కట్టి మూడో సంవత్సరం పరీక్ష కూడా మొట్టమొదటి స్థాయిలో ఉత్తీర్ణతను సాధించాడు ఆ యువకుడు.

తర్వాత 1938లో అన్నపూర్ణమ్మ గారిని వివాహం చేసుకున్నారు. భౌతిక శాస్త్రంలో తన యొక్క మాస్టర్స్ కూడా కంప్లీట్ చేశారు. ఆ తర్వాత టాటా సంస్థ వారి యొక్క సహకారంతో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో తన యొక్క మాస్టర్స్ పట్టా కూడా పొందారు. అక్కడ ఎలక్ట్రానిక్ రంగంలో నిష్ణాతులైన డేవిడ్ ప్యాక్యార్డ్ వంటి వారి నుండి అద్భుతమైన జ్ఞానాన్ని పొందారు. అక్కడే వారికి ఉద్యోగాన్ని ఆశ చూపినా, తన జ్ఞానాన్ని భారతదేశ కోసం మాత్రమే ఉపయోగించాలని నిశ్చయించుకుని తిరిగి తనకి సహకారం చేసిన టాటా సంస్థలోనే జాయిన్ అయ్యారు.
హోమో జహంగీర్_బాబా, సివిరామన్, విక్రమ్_సారాభాయ్ వంటి ఎంతోమంది ప్రముఖులతో కలిసి పని చేశారు.

అప్పటివరకు భారతదేశం కనీ వినీ ఎరుగని ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేయడం ప్రారంభించారు, 1956 లో దేశీయంగా తయారుచేసిన #అప్సర అనే పరమాణు రియాక్టర్ నిర్మాణంలో కూడా విశేషమైన కృషి చేశారు. ఆయన యొక్క ప్రతిభ తెలియడానికి భారతదేశానికి ఎంతో సమయం పట్టలేదు 1960 వ సంవత్సరంలోనే భారత ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీని, 1972వ సంవత్సరంలో పద్మ భూషణ్ తో సత్కరించింది.

అది 1962 సంవత్సరం భారతదేశం చైనా యుద్ధం లో మన దేశానికి కొంత ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలోనే స్వీయ ఆయుధాల తయారీ అనేటువంటిది భారతదేశానికి అత్యవసరంగమని బాబా గారు గుర్తించారు. దానికోసం ఒక ప్రత్యేక సంస్థను నెలకొల్పాలి అని నిశ్చయించుకున్నారు అదే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. కానీ దాన్ని ఎలాగైనా తెలుగు రాష్ట్రాల్లోనే నెలకొల్పాలి అనేటువంటిది మన హీరో గారి బలమైన సంకల్పం.

చివరికి ప్రభుత్వాన్ని, ఆ సంస్థలో వారిని ఏదో విధంగా ఒప్పించి ఆ సంస్థని 1967లో హైదరాబాదులో స్థాపించడం జరిగింది. దానికి చైర్మన్ గా డాక్టర్ విక్రంసారాభాయ్ గారిని అలాగే MD గా మన కథలోని నాయకుణ్ణి నియమించడం జరిగింది.

ఈ యొక్క ఈ ECIL లో భారత దేశంలో మొట్టమొదటి కంప్యూటర్ సిస్టమ్స్, అలాగే వాటికి కావాల్సిన సాఫ్ట్ వేర్స్ ని కూడా అక్కడే తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎంతోమంది సైంటిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆ యొక్క కంప్యూటర్ల మీద మరియు సాఫ్ట్ వేర్ తయారీలో ప్రత్యేక ట్రైనింగ్ కూడా నిర్వహించేవారు. భారత దేశంలో మొట్టమొదటిగా రిజర్వేషన్ సిస్టమ్స్, షేర్ మార్కెట్స్ , బ్యాంకింగ్ సాఫ్ట్ వేర్, మొదటి ఈవీఎం మిషన్, కాక్ పీట్ వాయిస్ రికార్డర్, ఎయిర్ పోర్ట్ స్కానింగ్ సిస్టమ్స్, అలాగే ఆర్మీకి సంబంధించి ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలను మరియు సాఫ్ట్ వేర్లను అన్ని కూడా ఈసీఐఎల్ లో తయారయ్యాయి.

ఒకరకంగా ఈరోజు హైదరాబాద్ సాఫ్ట్ వేర్ హబ్ గా తయారయ్యింది అంటే దానికి కారణం కూడా #ఈసీఐఎల్ సంస్థ. సంస్థలో పనిచేసిన ఇద్దరు వ్యక్తులు కలిసి హైదరాబాదులో మొట్టమొదటి సాఫ్ట్ వేర్ కంపెనీని కూడా ప్రారంభించడం జరిగింది.

ఈయన సాధించిన విజయ పరంపర అనిర్వచనీయం, ఒక ఉద్యోగిగా తాను గొప్ప వ్యక్తే అలాగే ఒక మనిషిగా కూడా ఆయన అంతే మహనీయుడు.

మానవత్వానికి, సింప్లిసిటీకి ఆయన ఒక ఎగ్జాంపుల్. 1978 సంవత్సరంలో తనకు తానుగానే సెల్ఫ్ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన అంత సాధించినా కూడా ఎప్పుడూ కూడా సాధారణ వ్యక్తిలా ఆర్టిసి బస్సుల్లో, ఆటోల్లో తిరిగేవారు. చివరికి తన దగ్గర పనిచేసిన ఒక వ్యక్తికి ఆటో కొనిచ్చారు, తాను ఎక్కడికి వెళ్లాలన్నా కూడా అదే ఆటోలో వెళ్లేవారు. అది సన్మానాలైనా మీటింగ్ లైనా. అది కూడా డబ్బులు తీసుకుంటేనే ఎక్కేవారుట.

ఇంతకీ ఆయన పేరు మీకు చెప్పలేదు కదా! ఆయన ఒక రోజు ఎక్కడికో పని మీద వెళ్లి తిరిగి వస్తూ ఆర్టీసీ బస్సులో ‘ASరావు నగర్ వచ్చాక ఆపండి’ అని కండక్టర్ కి చెప్పారట, మళ్లీ పది నిమిషాలు పోయాక ‘బాబూ ఏఎస్ రావు నగర్ వచ్చేసిందా’ అని అడిగారట. అప్పుడు ఆ కండక్టర్ చిరాకుపడుతూ ఎదర వచ్చే స్టాపే ఏఎస్ రావు నగర్ అని చెప్పాడు.
ఆ స్టాప్ రాగానే ఆయన దిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత బస్సులో ఉన్న వాళ్ళందరూ ఆ కండక్టర్ కి చెప్పారు ఆయనే “పద్మశ్రీ గ్రహీత, శాంతి స్వరూప్ బట్నాకర్ గ్రహీత డాక్టర్. అయ్యగారి సాంబశివరావు” అని!(A S Rao)

ఆరోజు ఆయన నాటిన ఈసీఐఎల్ అనే వట వృక్షం నేడు కొన్ని లక్షల మందికి ఉపాధి. అందుకోసమే ఈసీఐఎల్ ప్రాంతాన్ని మొత్తం ఆయన గుర్తుగా “ఏఎస్ రావు నగర్” గా నామకరణం చేశారు.

ఎప్పుడైనా మన గోదారి ప్రాంతాల నుంచి ఎవరైనా వెళ్తే చాలా ఆప్యాయంగా వారందరికీ కూడా భోజనాలు పెట్టి పంపించేవారు. అంతేకాకుండా భోజనానికి ఇబ్బంది పడే వారికి ఆయన ఇంటి దగ్గరే చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేసేవారు. ఎందుకంటే వారాలబ్బాయి గా చేసిన ఆయనకి తిండి, ఆకలి విలువ బాగా తెలుసు కాబట్టి.

ఈయన గురించి చెప్పుకుంటూ పోతే రాయాల్సింది చాలానే ఉంది కానీ ఎక్కడో చోట ఆగాలి కాబట్టి ఇక్కడే ఆగుతూ….

ఒక సాధారణ మధ్యతరగతి విద్యార్థిగా తన జీవన ప్రయాణాన్ని ప్రారంభించి చదువుకు డబ్బు లేక, కడుపుకు తిండి లేక ఎంతో ఇబ్బంది పడుతూ, కొన్ని వందల మందికి విద్యా దానాలు, కొన్ని వేల మందికి ఆకలి తీర్చే చేసే స్థాయికి ఎదిగి, భారత దేశాన్ని ఎలక్ట్రానిక్ విభాగంలో ప్రపంచ స్థాయి సంస్థలతో సమానంగా నిలిపి, కర్మను మాత్రమే చేసి వాటి ఫలితాన్ని విడిచిపెట్టిన అసలు సిసలైన కర్మయోగి మన ఆంధ్ర ముద్దుబిడ్డ శ్రీ అయ్యగారి సాంబశివరావు (A S Rao)గారికి శతకోటి వందనములు🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Social Media నుండి సేకరణ