RSS NEWS

  • ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 
    ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు – వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసి, సాధించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లో 1975-77 మధ్య కాలంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ భారత చరిత్రలోనే మర్చిపోలేని చీకటి అధ్యాయం. 25 జూన్ 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 21 మర్చి 1977 వరకు 21 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దేశంలో అస్థిరత […]
  • నియంతృత్వ ఎమర్జెన్సీకి 49 ఏళ్లు
    -ప్రదక్షిణ వరిష్ట పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహంగారి పుస్తకం `ఎమర్జెన్సీ జ్ఞ్యాపకాలు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం’ ఆధారంగా ఈ వ్యాసం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ విధించిన 25 జూన్ 1975 రాత్రి నుంచి తీవ్రమైన దమనకాండ ప్రారంభమైంది. ప్రజల పౌరహక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా అధికారికంగా హరించబడ్డాయి. పత్రికలపై పూర్తి స్థాయి సెన్సర్షిప్ విధించబడింది. అన్ని రాజ్యాంగ సంస్థలు పూర్తిగా, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె ఆంతరంగిక బృందం ఆధీనంలో ఉండి, […]
  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం […]
  • వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ – హిందూ సామ్రాజ్య దినోత్సవం
    1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన […]
  • వీరనారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి
    భారతదేశం ఎందరో వీరులను వీర మాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు వీర మాతలు ఈ గడ్డ పై జన్మించారు. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణపాయంగా ఎంచి తల్లిభారతి పాదాల చెంత సమ్పర్పించారు. తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యులారు ‘మణి’ కర్ణిక… మన రాణి ఝాన్సీ లక్ష్మీ భాయి. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి […]
  • శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్
    -అనంత్ సేథ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 5వ సర్ సంఘచాలక్ శ్రీ కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్ జీ ఆషాఢ శుద్ధ తృతీయ, 18 జూన్ 1931 నాడు రాయ్ పూర్ లో జన్మించారు. వారు 9 సం|| వయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళటం ప్రారంభించారు. వారు 6 దశాబ్దాలు సంఘ ప్రచారక్ గా సేవచేసి, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ్ జీ తర్వాత 2000 సం|| లో సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. చదువు రీత్యా ఇంజనీర్ అయిన వారు, శారీరిక దార్ఢ్యత మరియు […]
  • RSS Sarsanghchalak Late KS Sudarshan Birth Anniversary: Committed to swadeshi and economic self-reliance
    KS Sudarshan was directly associated with Swadeshi Jagran Manch (SJM) as Marg-darshak for about 7 years before taking up the responsibility of Sarsanghachalak. After the formation of SJM by Dattopant Thengadi in 1991, Swadeshi movement took off only after its national convention of 1993 in Delhi. With the support from karyakartas of Rashtriya Swayamsevak Sangh […]
  • ఐరోపాలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభం
    ఐరోపాలో అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతంలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభోత్సవం జరిగింది. జూన్‌ 4 న ఈ ఉత్సవాలు ప్రారంభమై… పదమూడో తేదీ వరకూ వైభవోపేతంగా జరిగాయి. దేవాలయ ప్రారంభోత్సవం, మహా కుంభాభిషేకం తమిళనాడుకి చెందిన భూపతి శివాచార్య స్వామిగల్‌, వెంకటేష్‌ జయరామ్‌ అనే అర్చకులు నిర్వహించారు. సంప్రదాయమైన ముఖ్య ఘట్టాలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత శివునితో పాటు శ్రీ కర్పగ నాధర్‌, బ్రహ్మంద్‌ […]
  • మోహన్ భాగవత్ అలా అనలేదు : క్లారిటీ ఇచ్చిన సంఘ్
    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌  వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా హిందీ పత్రిక దైనిక్‌ జాగరణ్‌ ఓ వార్త ప్రచురించింది. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆరెస్సెస్ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మోహన్‌ భాగవత్‌ స్పందించారని ఆ పత్రిక పేర్కొంది. “మన దేశంలోని ప్రతి పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్చ వుందని, నడ్డా […]
  • దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు
    మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలన్న (డీ లిస్టింగ్‌) ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. వనవాసీ సంఘాలు దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో డీ లిస్టింగ్‌ డిమాండ్‌ తో ‘‘పోస్ట్‌కార్డ్‌’’ ఉద్యమాన్ని కూడా చేస్తున్నారు. కొందరు గిరిజనులు మతం మారినా… ఇప్పటికీ గిరిజన సమాజానికి వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ:వ్యాప్తంగా ‘‘జనజాతి సురక్షా మంచ్‌’’ పేరుతో గిరిజనులందరూ ఏకమై పెద్ద […]

ఆయుర్వేద వ్యాప్తికర్త, వైద్యరత్న పండిత దీవి గోపాలాచార్యులు

ఆయుర్వేదం అంటే పిచ్చివాళ్ళ పంచాయతి అని దాన్ని నిషేధించాలని బ్రిటిష్ ప్రభుత్వం భావించి అది అశాస్త్రీయం అని నిరూపించటానికి కి ఒక సంఘం ఏర్పరచి ,దానితో అశ్వగంధ బలాతిబల మొదలైన మహా మూలికలను నిష్ప్రయోజనం అని నిరూపింప
జేసి ఆయుర్వేదాన్ని భూస్థాపితం చేసే తీవ్ర ప్రయత్నం చేసింది. అప్పుడు ప్రమాదం పసిగట్టి భారత వైద్య ప్రతినిధిగా ‘’ఏకాంగ వీరుడిగా’’ ఎదిరించి నిలిచి ‘’ఆయుర్వేద కాంగ్రెస్ ‘’ స్థాపించి ఆసేతు హిమనగం, బర్మా ,కాబూల్ లలో పర్యటించి, మహా పండితులను ఏకం చేసి ఉద్యమానికి బాసటగా మద్రాస్ లో ఆయుర్వేద కళాశాల స్థాపించి, అనేక ఆయుర్వేద గ్రంథాలకు సులభ వ్యాఖ్యలు రాసి ప్రచురించి ఆయుర్వేదం మహోన్నత వైద్య విధానం అని ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తీ పండిత దీవి గోపాలాచార్యులు గారు…

అటువంటి సమయంలో ఆయన చూపిన దార్శనికత మన దేశంలో ఆయుర్వేదానికి ఆయుష్షు పోసింది. యాభై సంవత్సరాలు కూడా జీవించని గోపాలాచార్యులు సాధించింది విశేషంగా ఉంది. ఆయన మరో రెండు మూడు దశాబ్దాలు జీవించి ఉంటే వారి కృషి ఆయుర్వేద రంగాన్ని దాటి మరింత విస్తృతమై ఉండేది. 1914లో ఆంధ్రపత్రిక సంస్థను (అప్పటి) బొంబాయి నుంచి (అప్పటి)చెన్నయ్ కి తరలించినపుడు కాశీనాధుని సాగేశ్వరరావు పంతులుగారికి గోపాలాచార్యులు అందించిన చేయూత చాలా కీలకమైంది. అంటే తెలుగు పత్రికా రంగానికి కూడా ఆయుష్షు పోసిన అద్భుత వ్యక్తి అనవచ్చు.

1872 అక్టోబరు 10వ తేదీన గోపాలాచార్యులు కృష్ణా మండలం భావ దేవరపల్లిలో రాజ్యలక్ష్మి, రామకృష్ణమాచార్యులకు జన్మించారు. తల్లి పుట్టింట ఆయుర్వేద వాతావరణం ఉండేది. బందరు పట్టణంలో 18 సం|| వయసు దాకా విద్య సాగింది. చదువు తృప్తినియ్యలేదు. రోగాల బారినపడిన వారిని ఎలా రక్షించాలనే ఆలోచన తరచు కలిగేది. 1888లో తిరుపతికి వెళ్ళి మహంతుపారి పాఠశాలలో చదువుకున్నారు. కొన్నాళ్ళు సాధువులతో వివిధ ప్రాంతాలు తిరిగారు. వైద్యం, ఆయుర్వేదం ద్వారా సామాజిక సేవ చేయవచ్చనే భావన కల్గింది. చివరకు 1888 లో మైసూరు ఆయుర్వేద కళాశాలలో వైద్య విద్యలో చేరారు. అక్కడ అగరం పుట్టస్వామి శాస్త్రులు వారికి గురువులు, కళాశాలకు కులపతులు. 1898లో ఆయుర్వేద వైద్య విద్య పూర్తయ్యాక కలకత్తా, వారణాసి, బొంబాయి వంటి నగరాలు సందర్శించారు. అప్పుడే కలరా, ప్లేగు వ్యాధి వ్యాపిస్తున్నాయి. 1895 లోమైసూరు మహారాజా ప్రత్యేక ప్లేగు వ్యాధి చికిత్సకులుగా గోపాలాచార్యులను నియమించారు.

శతధాతఘృతం, హైమాది పానకంతో ఈ రెండు వ్యాధులకు కళ్ళెం వేయడంతో వారి పేరు మారు మ్రోగిపోయింది. అనతికాలంలోనే చెన్న పట్టణానికి వచ్చారు. కన్యకాపరమేశ్వరి దేవస్థానం వారి ఉచిత ఆయుర్వేద వైద్యశాలలో ప్రధాన చికిత్సకులుగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి రెండున్నర దశాబ్దాలు వారు గతించే దాకా మద్రాసు వారి కార్యస్థానమైపోయింది. దాదాపు ఈ పాతికేళ్ళలో ఆయుర్వేదానికి ఇచ్చిన చేయూత ఎనలేనిది. వారు చేపట్టిన ప్రతి పని విశిష్టమైనది. తొలుత ఆయుర్వేదా శ్రమాన్ని స్థాపించారు. 1901లో మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో తొలి ఆయుర్వేద కళాశాలను స్థాపించారు. 1902లో చెన్నపురి ఆయుర్వేద ప్రచారిణి సభ ప్రారంభించారు. 1905 లో ఆయుర్వేద కళాశాల తొలి పట్టభద్రుల బృందం బయటికి వచ్చింది. ఒకవైపు వైద్యం, మరోవైపు బోధన, ఇంకోవైపు పర్యటనలు మాత్రమేకాక ఆయుర్వేద గ్రంథాలను వెలికి తేవాలనుకున్నారు. అలా 1911లో ‘మాధవ నిదానము’ తెలుగులో వెలువడింది. ఆయుర్వేద గ్రంథమాల పేరున 22 గ్రంథాలను ప్రచురించారు. మాధవ నిదానంతో పాటు అర్క ప్రకాశిక ఆయుర్వేద పరిభాష, రన ప్రదీపిక, భీషజకల్పము మొదలైన గ్రంథాలను చక్కటి వ్యాఖ్యలతో రాశారు. వారు అలా ప్రచురించి ఉండకపోతే తర్వాతి కాలంలో ఆయుర్వేదానికి అంత వ్యాప్తి ఉండేది కాదు.

ఇక ఆయుర్వేద కళాశాల వ్యవహారం వేరు. కళాశాల నిర్వహణా భారం అంతా ఒక్కరే భరించేవారు. ఉచిత భోజన వసతి విద్యార్థులందరికీ కల్పించారు. సభలకు, సమావేశాలకు విద్యార్థులను బృందాలుగా తన ఖర్చుతో తీసుకువెళ్ళవారు. బ్రిటీషు ప్రభుత్వం ఎటువంటి నిధులు ఇచ్చేది కాదు. తన పలుకుబడితో శాసనసభలో ప్రశ్నలు వేయించేవారు. తర్వాత తర్వాత అప్పటి ప్రభుత్వం ధోరణిలో మార్పు రాసాగింది. అయితే విద్యార్థులపై చూపిన వాత్సల్యం తర్వాత ఆయుర్వేద వ్యాప్తికి, ప్రజల ఆరోగ్యానికి ఎంతో దోహదపడింది.

1919 జులై 11న దీవిగోపాలాచార్యులు ‘శ్రీధన్వంతం’ పక్ష పత్రికను ప్రారంభించారు. ఈ పత్రిక ప్రారంభించడానికి ముందు ధన్వంతరీ వ్రతం జరిపపారు. ఊరేగింపుగా ఆయుర్వేదం కోసం యాచన చేసేవారు. ప్రజలు ఆనందంగా దానం చేసేవారు. కనకవర్షం కురిసేది. ఈ ధనాన్ని ప్రజల ఆరోగ్యానికి వెచ్చించారు. ప్రేమ పూర్వకమైన ప్రవర్తనతో పాటు వారి ఆకారం, పెద్ద గడ్డం ఆకర్షణగా ఉండేవి. హిమాలయాల నుంచి కన్యాకుమారి దాకా ఎక్కడ ప్రయాణించినా గోపాలాచార్యులకు విశేష ఆదరణ ఉండేదని ఆచంట లక్ష్మీపతి పేర్కొవడం గమనార్హం. అప్పట్లో మదరాసు నగరంలో గోపాలాచార్యులు, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, వావిళ్ళ ప్రెస్ వెంకటేశ్వరశాస్త్రిగార్లు బహుళ గౌరవం పొందిన ప్రముఖులు. ఆయనకు ఐదారు భాషలు ధారాళంగా వచ్చేవి..ఇంగ్లీషు తప్ప. అనిబిసెంట్ అంటే ఎంతో అభిమానం. ఆవిడతో మంచి స్నేహం కూడా ఉండేది. ఆవిడ ఎక్కడ ప్రసంగించినా తొలి వరుసలో కూర్చొని విని ఆనందించేవారు.

ఆయుర్వేద వైద్యంతో గోపాలాచార్యులకు లభించిన గౌరవం, పేరు కూడా విశేషమైనవి. కలకత్తా ప్రజలు ‘భాషజ్మణి’ అంటే, సానిక్ పౌరులు ‘ఆయుర్వేద మార్తాండ అన్నారు. బ్రిటీషు ప్రభుత్వం “వైద్యరత్న” బిరుదునిచ్చింది. 1918లో బొంబాయిలో జరిగిన అఖిల భారత మహాసమ్మేళనానికి, 1917లో హరిద్వారంలో ఆయుర్వేద మహాసభకు, బెజవాడలో జరిగిన ప్రథమాంధ్ర ఆయుర్వేద సమ్మేళనంలో, లాహోర్, తిరువనంతపురం సభలకు అధ్యక్షత వహించారు. ఇంతటి మహాశయుడు 1920 సెప్టెంబర్ 29న మధుమేహంతో గతించారు. ఎంతో మందికి ఆరోగ్యాన్నిచ్చిన గోపాలాచార్యులు తన ఆరోగ్యం పట్ల ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యకరం. తన సంపాదనంతా సంస్థలకు వెచ్చించారు.

మద్రాస్ లోని కన్యకాపరమేశ్వరి ఆయుర్వేద కాలేజి లో వైద్యులుగా పనిచేస్తూ గుర్రబ్బండీ మీద మాత్రమె ప్రయాణం చేసేవారు. అప్పుడు ఆంగ్లేయ సివిల్ సర్జన్ల ఫీజు అయిదు రూపాయలు. వీరుకూడా అదే ఫీజు తీసుకొనే వారు సమానంగా. ఆ ఆయుర్వేద కాలేజిలో దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్ధులు ఉండేవారు. ఆయన చనిపోవటానికి ముందు రామ చంద్ర వారిని సందర్శించి ధన్యులయారు. తలపాగా ఊర్ధ్వ పుండ్రాలతో మహా వర్చస్సుతో వెలిగి పోయే వారట. గాంభీర్యం కరుణ ముఖంలో కనిపించేవి. ఆధునిక ధన్వంతరి దీవి గోపాలాచార్యులవారు.

ఆయుర్వేదాచార్యులు చింతపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రిగారు దీవి వారికి మొదటితరం శిష్యులు. ఒకరోజు సుమారు పదిహేను మంది విద్యార్ధులను వెంట తీసుకొని ఓషధీ విజ్ఞాన యాత్రకోసం కపిల తీర్ధం కొండ ఎక్కించారు. అక్కడ ఒక చోట తన చేతిలో ఉన్న బాణాకర్రతో చిన్న పొన్నగంటి ఆకుల్లాగా ఉన్న పొదను చూపించారు .ఆ ఆకులు తినమన్నారు అలాగే తిన్నారు అందరూ…అవి బాగా తియ్యగా ఉన్నాయి. అతిమధురం కన్నా తీపి. రసం మింగగానే కొత్త బలం శక్తి వచ్చి నట్లు అందరికీ అనిపించింది. అందర్నీ కూర్చోబెట్టి దాని కథ చెప్పారు శాస్త్రిగారు .

‘’దీని పేరు అల్లి ఆకు .అల్యాకు అంటారు. తిరుపతిలోని హాథీరాం మఠం లో ’’ హథీ రాంజీ’’ మహంతు గారు సుందర బాలాఢ్యుడు. తిరుపతికి పడమరగా రెండుమైళ్ళ దూరంలో ఒక రింగు తోట ఉండేది. అక్కడ రాతి గుండ్లు ఉంటాయి మీరు చూసేఉంటారు వాటిని బంతిలాగా ఎగరేస్తూ వ్యాయామం చేసేవాడు. ఈ అల్యాకు గుప్పెడు నోట్లో వేసుకొని, నమిలి రసం మింగి నెలరోజులు ఆహారం లేకుండా తపస్సు చేసేవాడు .తర్వాత మరో గుప్పెడు నమిలి రసం మింగి యోగ సమాధిలో నెలల తరబడి ఉండేవాడు .రెండు మూడాకులు తింటే ఆకలే వెయ్యదు..అని చెప్పారు శాస్త్రి గారు.

“పది జన్మలకు తగినంత కృషిని స్వల్పకాలంలో చేయగలిగినవారు దీవి గోపాలాచార్యులు” అని కృష్ణాపత్రిక రాయడం ఆనందదాయకం.

– గబ్బిట దుర్గాప్రసాద్ & శర్మ గారి సేకరణ