RSS NEWS

  • ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 
    ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు – వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసి, సాధించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లో 1975-77 మధ్య కాలంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ భారత చరిత్రలోనే మర్చిపోలేని చీకటి అధ్యాయం. 25 జూన్ 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 21 మర్చి 1977 వరకు 21 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దేశంలో అస్థిరత […]
  • నియంతృత్వ ఎమర్జెన్సీకి 49 ఏళ్లు
    -ప్రదక్షిణ వరిష్ట పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహంగారి పుస్తకం `ఎమర్జెన్సీ జ్ఞ్యాపకాలు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం’ ఆధారంగా ఈ వ్యాసం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ విధించిన 25 జూన్ 1975 రాత్రి నుంచి తీవ్రమైన దమనకాండ ప్రారంభమైంది. ప్రజల పౌరహక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా అధికారికంగా హరించబడ్డాయి. పత్రికలపై పూర్తి స్థాయి సెన్సర్షిప్ విధించబడింది. అన్ని రాజ్యాంగ సంస్థలు పూర్తిగా, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె ఆంతరంగిక బృందం ఆధీనంలో ఉండి, […]
  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం […]
  • వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ – హిందూ సామ్రాజ్య దినోత్సవం
    1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన […]
  • వీరనారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి
    భారతదేశం ఎందరో వీరులను వీర మాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు వీర మాతలు ఈ గడ్డ పై జన్మించారు. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణపాయంగా ఎంచి తల్లిభారతి పాదాల చెంత సమ్పర్పించారు. తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యులారు ‘మణి’ కర్ణిక… మన రాణి ఝాన్సీ లక్ష్మీ భాయి. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి […]
  • శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్
    -అనంత్ సేథ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 5వ సర్ సంఘచాలక్ శ్రీ కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్ జీ ఆషాఢ శుద్ధ తృతీయ, 18 జూన్ 1931 నాడు రాయ్ పూర్ లో జన్మించారు. వారు 9 సం|| వయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళటం ప్రారంభించారు. వారు 6 దశాబ్దాలు సంఘ ప్రచారక్ గా సేవచేసి, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ్ జీ తర్వాత 2000 సం|| లో సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. చదువు రీత్యా ఇంజనీర్ అయిన వారు, శారీరిక దార్ఢ్యత మరియు […]
  • RSS Sarsanghchalak Late KS Sudarshan Birth Anniversary: Committed to swadeshi and economic self-reliance
    KS Sudarshan was directly associated with Swadeshi Jagran Manch (SJM) as Marg-darshak for about 7 years before taking up the responsibility of Sarsanghachalak. After the formation of SJM by Dattopant Thengadi in 1991, Swadeshi movement took off only after its national convention of 1993 in Delhi. With the support from karyakartas of Rashtriya Swayamsevak Sangh […]
  • ఐరోపాలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభం
    ఐరోపాలో అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతంలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభోత్సవం జరిగింది. జూన్‌ 4 న ఈ ఉత్సవాలు ప్రారంభమై… పదమూడో తేదీ వరకూ వైభవోపేతంగా జరిగాయి. దేవాలయ ప్రారంభోత్సవం, మహా కుంభాభిషేకం తమిళనాడుకి చెందిన భూపతి శివాచార్య స్వామిగల్‌, వెంకటేష్‌ జయరామ్‌ అనే అర్చకులు నిర్వహించారు. సంప్రదాయమైన ముఖ్య ఘట్టాలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత శివునితో పాటు శ్రీ కర్పగ నాధర్‌, బ్రహ్మంద్‌ […]
  • మోహన్ భాగవత్ అలా అనలేదు : క్లారిటీ ఇచ్చిన సంఘ్
    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌  వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా హిందీ పత్రిక దైనిక్‌ జాగరణ్‌ ఓ వార్త ప్రచురించింది. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆరెస్సెస్ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మోహన్‌ భాగవత్‌ స్పందించారని ఆ పత్రిక పేర్కొంది. “మన దేశంలోని ప్రతి పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్చ వుందని, నడ్డా […]
  • దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు
    మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలన్న (డీ లిస్టింగ్‌) ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. వనవాసీ సంఘాలు దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో డీ లిస్టింగ్‌ డిమాండ్‌ తో ‘‘పోస్ట్‌కార్డ్‌’’ ఉద్యమాన్ని కూడా చేస్తున్నారు. కొందరు గిరిజనులు మతం మారినా… ఇప్పటికీ గిరిజన సమాజానికి వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ:వ్యాప్తంగా ‘‘జనజాతి సురక్షా మంచ్‌’’ పేరుతో గిరిజనులందరూ ఏకమై పెద్ద […]

బహుభాషా చక్రవర్తి డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు జీవిత చరిత్ర

సేకరణ:- చందమూరి నరసింహారెడ్డి

తాను రచించిన కావ్యాన్నే తానే పాఠ్యపుస్తకంగా చదివి పరీక్ష రాసిన అరుదైన కవి సరస్వతీపుత్ర పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు. పదునాలుగు భాషలలో పాండిత్య శోభతో ఒక్క గొంతుకై అబ్బురపరచిన బహుభాషా చక్రవర్తి ఆయన. తెలుగు ప్రబంధాలలోని ప్రబంధ నాయికలకు సాహిత్య చరిత్రలో సముచిత సమయోచిత స్థానం పదిలపరచిన సాహిత్య విమర్శకుడాయన. ప్రాచీన సాహిత్యంతోపాటు ఆధునిక సాహిత్యం సమదృష్టితో అధ్యయనం చేసిన సాహిత్యజీవి ఆచార్యులు. పద్యం గద్యం ఇరుకారుల సేద్యంగా శతాధిక గ్రంథాలు రచించిన శక్తత గల రచయిత ఆయన. గొప్ప వక్త. సమర్థుడైన విమర్శకుడు. శక్తత గల అనువాదకుడు. ఛాందసభావాలు గిట్టనివాడు. సంప్రదాయం మరువనివాడు. ఆధునికాన్ని అభిమానించేవాడు.

పుట్టపర్తి నారాయణాచార్యులు 1914, మార్చి 28, న అనంతపురం జిల్లా అనంతపురం మండలంలోని చియ్యేడు గ్రామంలో జన్మించారు. అతను తండ్రి శ్రీనివాసాచార్యులు, తల్లి లక్ష్మిదేవి (ķóndamma) గొప్ప సంస్కృత ఆంధ్ర పండితులు. అసలు వారి ఇంటి పేరు తిరుమల వారు. శ్రీకృష్ణదేవరాయల రాజగురువు తిరుమల తాతాచార్యుల వంశం వారిది. తాతాచార్యులు గొప్ప శాస్త్ర పండితుడు. అతను గురించి కొందరు అల్పబుద్ధుల వల్ల హాస్యకథలు పుట్టాయి. ఆ తర్వాత వారి వంశీయులు చిత్రావతీ తీరంలో పుట్టపర్తిలో ఉండడం వల్ల ఇంటిపేరు పుట్టపర్తి అయింది.

తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. వాళ్లది విద్వత్వంశం. ఆచార్యులు గారు పుట్టిన కొన్ని రోజులకే తల్లి మరణించింది. తండ్రికి ఉద్యోగ ఒత్తిడి. పైగా భార్య మరణించిన దు:ఖంలో ఉన్నారు. అటువంటి స్థితిలో ఆచార్యులు గారు దేనికీ పనికిరాని పరిస్థితిలో ఉండగా, ఆ కుటుంబ సన్నిహితుడొకడు ఆచార్యులుగారిని తన వెంట పెనుగొండకు తీసుకొని వెళ్లి పిట్ దొరసానికి పరిచయం చేసాడు. ఆమె పెనుగొండ సబ్ కలెక్టర్ గారి భార్య. ఆమె గొప్ప ఆంగ్ల విద్వాంసురాలు. ఆమె నారాయణాచార్యుల గారిని ఆంగ్లభాషలో గొప్ప ప్రవీణునిగా చేసింది. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు ఈయనకు స్వయానా మేనమామ. శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు బాల్యంలోనే భారత, భాగవతాది గ్రంధాలను అభ్యసించటంతో పాటుగా సంగీత, నాట్య శాస్త్రాలలో కూడా శిక్షణ తీసుకున్నారు. అలా ఆయన సంగీత, సాహిత్య, నాట్య శాస్త్రాలతో సమలన్క్రుతు లయ్యారు. సుప్రసిద్ధ నర్తకి రంజకం మహాలక్షుమ్మ గారి వద్ద వీరు సంగీత, నృత్యాలను అభ్యసించారు. ఇవే కాకుండా నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించారు. రంగస్థలంపై నాట్యప్రదర్శనలిచ్చారు. ఎన్నో ప్రదేశాలను తిరిగారు. చివరకు కడపలో స్థిరపడ్డారు. అక్కడే చాలాకాలం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి తన ఇంటిని సాహితీ మాగాణంగా మార్చుకున్నారు.

నారాయణాచార్యులు చిన్న వయసులోనే భారతం, భాగవతం, పురాణాలతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నారు. అతను తిరుపతి సంస్కృత కళాశాలలో సంస్కృతం నేర్చుకున్నారు. కపిలస్థానం కృష్ణమాచార్యులు, డి.టి. తాతాచార్యులు లాంటి గొప్ప సంస్కృత పండితుల వద్ద వ్యాకరణం, ఛందస్సు, తదితరాలు నేర్చుకున్నారు. పెనుగొండలో రంజకం మహాలక్ష్మమ్మ దగ్గర భరత నాట్యం నేర్చుకున్నారు. సంగీతం, సాహిత్యం, నాట్యం అతనులో త్రివేణీ సంగమంలా మిళితమయ్యయి. చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేయడమే గాక సన్నివేశాల మధ్య తెర లేచేలోపు నాట్యం చేసే వారు. పెనుగొండలో పిట్ దొరసాని వద్ద ఆంగ్లసాహిత్యం నేర్చుకున్నారు.

ప్రొద్దుటూరు వీరి అత్తగారి ఊరు. మొదట అతను పనిచేసింది అనంతపురంలో. అప్పటికింకా స్వాతంత్ర్యం రాలేదు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ మీనన్ కి సమయం దొరికితే చాలు, ఆంగ్లేయుల్ని తనివితీరా పొగడడం, గాంధీ వంటి వారిని తిట్టడం పరిపాటిగా ఉండేది. అది సహించలేని పుట్టపర్తి అతనుతో వాగ్యుద్ధానికి సిద్ధపడడమే గాక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కొన్నాళ్ళు తిరువాన్కూర్ లోనూ, కొన్నాళ్ళు ఢిల్లీ లోనూ, ప్రొద్దుటూరు లోనూ పనిచేసి చివరకు కడపలో స్థిరపడ్డారు. కడపలో శ్రీ రామకృష్ణా ఉన్నత పాఠశాలలో అతను ఉపాధ్యాయుడుగా పనిచేశారు. సాహితీ సృష్టి అంతా కడపలోనే జరిగింది.

అతను బహుభాషావేత్త, అనేక భాషల్లో పండితులు. తుళు, ఫ్రెంచి, పర్షియన్ లాంటి 14 భాషలు నేర్చుకున్నారు. అతనుకి పాలీ (బౌద్ధ, జైన సాహిత్యాలు) భాషలో మంచి ప్రావీణ్యం ఉండేది. వారి కుమార్తె పుట్టపర్తి నాగపద్మిని ఇచ్చిన సమాచారంప్రకారం అతను చేసిన అనువాదాలు – అవధీ భాషనుండి తులసీదాస్ రామయణం, బ్రజ్ భాషనుండి సూరదాస్, రసఖాన్ మొదలైన వారి రచనలు, పాత అవధీ, బ్రజ్ భోజ్ పురీ భాషల మిశ్రమంనుండి కబీర్ దోహాల హింది. పుట్టపర్తి ఆనేక ప్రసిద్ధ తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ కావ్యాలను తెలుగులోనికి అనువదించారు.

హృషీకేశ్ లో అతను పాండిత్యాన్ని పరీక్షించిన శివానంద సరస్వతి అతనుకు “సరస్వతీపుత్ర” బిరుదునిచ్చారు. అతనుకు లెక్కలేనన్ని సత్కారాలు జరిగినా, ఎన్ని బిరుదులు వచ్చినా ఈ ఒక్క బిరుదునే గొప్ప గౌరవంగా భావించి అతను ఉంచుకున్నారు.

తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. వాళ్లది విద్వత్వంశం. ఆచార్యులు గారు పుట్టిన కొన్ని రోజులకే తల్లి మరణించింది. తండ్రికి ఉద్యోగ ఒత్తిడి. పైగా భార్య మరణించిన దు:ఖంలో ఉన్నారు. అటువంటి స్థితిలో ఆచార్యులు గారు దేనికీ పనికిరాని పరిస్థితిలో ఉండగా, ఆ కుటుంబ సన్నిహితుడొకడు ఆచార్యులుగారిని తన వెంట పెనుగొండకు తీసుకొని వెళ్లి పిట్ దొరసానికి పరిచయం చేసాడు. ఆమె పెనుగొండ సబ్ కలెక్టర్ గారి భార్య. ఆమె గొప్ప ఆంగ్ల విద్వాంసురాలు. ఆమె నారాయణాచార్యుల గారిని ఆంగ్లభాషలో గొప్ప ప్రవీణునిగా చేసింది. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు ఈయనకు స్వయానా మేనమామ. శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు బాల్యంలోనే భారత, భాగవతాది గ్రంధాలను అభ్యసించటంతో పాటుగా సంగీత, నాట్య శాస్త్రాలలో కూడా శిక్షణ తీసుకున్నారు. అలా ఆయన సంగీత, సాహిత్య, నాట్య శాస్త్రాలతో సమలన్క్రుతు లయ్యారు. సుప్రసిద్ధ నర్తకి రంజకం మహాలక్షుమ్మ గారి వద్ద వీరు సంగీత, నృత్యాలను అభ్యసించారు. ఇవే కాకుండా నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించారు. రంగస్థలంపై నాట్యప్రదర్శనలిచ్చారు. ఎన్నో ప్రదేశాలను తిరిగారు. చివరకు కడపలో స్థిరపడ్డారు. అక్కడే చాలాకాలం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి తన ఇంటిని సాహితీ మాగాణంగా మార్చుకున్నారు.

‘సరస్వతీ పుత్ర’ శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు – టీవీయస్. శాస్త్రి  ఒక మనిషి ఒక భాషలో పరిపూర్ణుడు కావటానికే ఒక జీవితకాలం సరిపోదు. అలాంటిది ఒక వ్యక్తి 15 భాషలను నేర్చుకోవటమే కాకుండా వాటన్నిటిలో పాండిత్యాన్ని పొందటం చాలా అరుదైన, అసాధ్యమైన విషయం. అట్టి అసాధ్యమైన విషయాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి, మహామనీషి, బహుభాషాకోవిదుడు, ‘సరస్వతీ పుత్రుడు’ శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యుల గారిని గురించి నాకు తెలిసిన, నేను సేకరించిన విషయాలను మీకు సగర్వంగా తెలియచేయటానికి సంతోషిస్తున్నాను అని టీవీయస్ శాస్త్రి గారన్నారు.. ఆయనకు ఛాందస భావాలు గిట్టవు. దైవంతో పాటు మానవుడు కూడా కావాలనే మానవతావాది ఆయన. నూట యాభై గ్రంథాలు రచించినా, నిత్య విద్యార్థిలాగే ప్రవర్తించే నిగర్వి ఆయన.

“లీవ్స్ ఇన్ ది విండ్”, దుర్యోధనుడి కథ ఆధారంగా వ్రాసిన “ది హీరో” ఆంగ్లంలో అతను స్వంత రచనలు. అతను ఆంగ్లంలో మరిన్ని రచనలు చేసి ఉండేవారే. అతనుకు ఆంగ్లం నేర్పిన వి.జే. పిట్ అనే దొరసాని అప్పటి పెనుగొండ సబ్ కలెక్టర్ భార్య. ఆమె కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో బ్రౌనింగ్ పై రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొందింది. అప్పట్లోనే ఇతను వ్రాసిన లీవ్స్ ఇన్ ది విండ్ కావ్యం చూసి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ పెద్ద కితాబు ఇచ్చారు.
అయితే పిట్ దొరసాని మాత్రం “ఇంగ్లీషులో వ్రాయడానికి అనేక మంది ఇండియన్స్ ప్రయత్నించి ఫెయిలైనారు. మీరెంత కష్టపడినా మిమ్మల్ని క్లాసికల్ రైటర్స్ ఎవరూ గౌరవించరు. అందుకే బాగా చదువుకో. కానీ ఇంగ్లీషులో వ్రాసే చాపల్యం పెంచుకోవద్దు.” అని చెప్పింది. దాంతో అతను చాలా రోజులు ఆ ప్రయత్నమే చేయలేదు. అయితే ఆ తర్వాత చాలా కాలానికి భాగవతాన్ని And ఇంగ్లీషులోకి అనువదించడంతో బాటు ది హీరో నాటకాన్ని వ్రాశారు. కథంతా స్వీయ కల్పితమే.
సాధనా సంపత్తి.. పుట్టపర్తి సాహితీ సుధ

సాహిత్యాకాశంలో పుట్టపర్తి ధ్రువతారగా ఎలా నిలిచారో సాధనాపరంగానూ వారిస్థాయి అంతే ఎత్తులో ఉంది..కేవలం యే ఆధ్యాత్మిక అనుభూతి కలగలేదని సంసారాన్ని విడచి సాధువులను వెతుక్కుంటూ హిమాలయాల దారి పట్టి అక్కడ స్వామి శివానంద సరస్వతిని భగవత్సంకల్పితంగా కలిసి వారిచే సరస్వతీ పుత్రా అనిపించుకుని నడిచేదైవం కంచి పరమాచార్యులు చంద్రశేఖరులచే అమితంగా ప్రేమింపబడి నీ అంత్యకాలంలో కృష్ణ దర్శనమౌతుంది అని వారిచే ఆశీర్వాదమందిన పుణ్య చరితులు పుట్టపర్తి. నా గత జన్మ యేమిటి ఈ జన్మలో నా స్థితి యేమి కృష్ణ సాక్షాత్కారం అవుతుందా..ఇదే ప్రశ్న పుట్టపర్తి తోటే పుట్టి పెరిగి పుట్టపర్తిని నడిపించి చివరికి తనలోనే కలిపేసుకుంది.. ఈ వివరాలు భవిష్యత్తులో పుట్టపర్తిపై పరిశోధన చేసేవారికీ,ఆరాధించేవారికీ, ఎంతో మార్గదర్శకంగా ఉంటాయి ఎవ్వరి జేవితం లోనూ కనిపించని వైవిధ్యాలు పుట్టపర్తిలో ఉన్నాయి జ్యోతిష్య పండితులు పుట్టపర్తి పాండిత్యానికీ ‘సంగీత నాట్య సాహిత్య ఇవే కాక మరెన్నో కళలలో అభినివేశానికీ ముఖ్యంగా వారి జీవన సూత్రమైన సాధనమయ ప్రపంచంలోని రహస్యాలను కనుగొనడానికి శ్రీవారి జాతకం బయల్పరచటం జరిగింది

అతను చరిత్రను ఎంత లోతుగా అధ్యయనం చేశాడంటే చరిత్రకారులకు అతని పట్ల గొప్ప గౌరవముండేది. ఒకసారి అతనికి కమ్యూనిస్టులు సన్మానం చేసినప్పుడు ఆంధ్రుల చరిత్రలో గాఢమైన అభినివేశమున్న మల్లంపల్లి సోమశేఖరశర్మ “అతను్ను కవిగా కంటే చారిత్రకునిగా గౌరవిస్తానని” సందేశం పంపాడు. తర్వాత పుట్టపర్తి చారిత్రకులను ఇరుకున పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకసారి అనంతపురం కళాశాలలో చరిత్ర అధ్యాపకుణ్ణి ఒకరిని ఒక శాసనం గురించి ప్రస్తావిస్తూ “సంపెట నరపాల సార్వభౌముడు వచ్చి సింహాద్రి జయశిల జేర్చునాడు అని ఉంది కదా వీడెవడు ఈ సంపెట నరపాల గాడు?” అని అడిగి, అతను దిగ్భ్రాంతుడై నిలబడి పోతే, తనే సమాధానం చెప్పాడు~: “కృష్ణదేవరాయలేనయ్యా, వాళ్ళ వంశం తుళు వంశం, ఇంటివాళ్ళు సంపెట వాళ్ళూ” అని.

పుట్టపర్తి వారు కేవలం పన్నెండేళ్ళ వయసులోనే విజయనగర రాజుల రెండవ రాజధాని ఐన పెనుగొండ దీనావస్థను చూసి హృదయం ద్రవించేలా “పెనుగొండ లక్ష్మి” అనే గేయ కావ్యం రాశాడు. చిత్రంగా తర్వాత అతను విద్వాన్ పరీక్షలు వ్రాసేటప్పుడు తాను చిన్నతనంలో వ్రాసిన ఈ కావ్యాన్నే చదివి పరీక్ష వ్రాయవలసి రావడం ఒక కమనీయ ఘట్టం. చమత్కారమేమిటంటే ఆ పరీక్షలో అతను ఉత్తీర్ణుడు కాలేక పోయాడు. దానికి కారణం “పెనుగొండ లక్ష్మి” కావ్యం నుంచి వచ్చిన ఒక రెండు మార్కుల ప్రశ్నను ముందుగా మొదలు పెట్టి ఆ ఒక్క సమాధానమే 40 పేజీలు వ్రాస్తూఉండిపోవడంతో సమయం అయిపోవడం. ఆ ప్రశ్నకు “పూర్తి” మార్కులు (అంటే 2 మార్కులు) వచ్చినా ఆ మార్కులతో అతను పాస్ కాలేకపోయారు. అతను బడికి వెళ్ళే రోజుల్లోనే షాజీ, సాక్షాత్కారము అనే కావ్యాలు వ్రాశారు.

తాను కేరళ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు విశ్వనాథ సత్యనారాయణ నవల ఏకవీరను మలయాళం లోనికి అనువదించాడు. పండితులు ఒకరి పాండిత్యాన్ని మరొకరు మెచ్చరని అంటారు. కాని పుట్టపర్తివారి విషయంలో మాత్రం దీనికి విరుద్దం. ఒక సారి విజయవాడలో పుట్టపర్తి తన “శివతాండవం” గానం చేసినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ ఆనంద పరవశుడై అతనును భుజాలపైన కూర్చోబెట్టుకుని ఎగిరాడు. ఇంకొక సారి వైజాగ్ యూనివర్సిటీలో ప్రాకృత భాషల గురించి మాట్లాడుతున్నప్పుడు ఉపన్యాసం ఐపోయాక ప్రాకృత భాషలలో పాండిత్యం గల పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి సభికులలో నుంచి వచ్చి పుట్టపర్తికి సాష్టాంగనమస్కారం చేశారు.

ఏమానందముభూమీతలమున
శివతాండవమటశివలాస్యంబట
తెలుగులో అతను వ్రాసిన “శివతాండవం” అతనుకు ఎనలేని కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది. దీనిని అనేకమంది పండితులు ఆధునిక మహా కావ్యంగా అభివర్ణిస్తారు. ఇది ఆరు భాగాలుగా ఉంది. దేశవ్యాప్తంగా అతను ఎక్కడికి వెళ్ళినా అందరూ శివతాండవం గానం చేయమనే వారు. తెలుగు అర్థం కాని వారు సైతం ఆ మాత్రాచ్ఛందస్సు లోని శబ్దసౌందర్యానికి పరవశులయ్యేవారు. అతను గాత్ర మాధుర్యం ఎటువంటిదంటే శివతాండవాన్ని అతను స్వయంగా గానం చేయగా విన్న వాళ్ళు “ఆ శివుడు ఆడితే చూడాలి-ఆచార్యులవారు పాడితే వినాలి” అని భావించేవారు.

మచ్చుకు :

“ కైలాసశిఖర మల గడగి ఫక్కున నవ్వ
నీలిమాకాశంబు నిటలంబుపై నిల్వ
నందికేశ్వర మృదంగ ధ్వానములు బొదల
తుందిలా కూపార తోయపూరము దెరల
చదలెల్ల కనువిచ్చి సంభ్రమత దిలకింప
నదులెల్ల మదిబొంగి నాట్యములు వెలయింప
వన కన్యకలు సుమాభరణములు ధరియింప
వసుధ యెల్లను జీవవంతంబై బులకింప
ఆడెనమ్మా శివుడు ! పాడెనమ్మా భవుడు!”

అతను 140 పైగా గ్రంథాలు రచించారు. అందులో నవలలు, నాటకాలు, కావ్యాలు, సాహిత్య విమర్శనము, చారిత్రక రచనలు మొదలైనవి ఉన్నాయి. ఇటీవల అతను రచనల్లో కొన్ని “వ్యాసవల్మీకం”, మహాభారత విమర్శనము (2 భాగాలు), ప్రాకృత వ్యాసమంజరి, స్వర్ణగేయార్చనం (సతీమణి కనకమ్మతో కలిసి రచించిన భక్తి గీతమాల) మొదలైనవి ప్రచురితమయ్యయి.

అతను వ్రాసిన అనేక కృతుల్లో కొన్ని దిగువ ఇవ్వబడినవి.

తెలుగులో స్వతంత్ర రచనలు *సవరించు
*పద్యకావ్యాలు సవరించు
*పెనుగొండ లక్ష్మి
*షాజీ
*సాక్షాత్కారము
*గాంధీజీ మహాప్రస్థానము,
*శ్రీనివాస ప్రబంధం
*సిపాయి పితూరీ
*బాష్పతర్పణము
*పాద్యము
*ప్రబోధము
*అస్త సామ్రాజ్యము
*సుధాకళశము
*తెనుగుతల్లి
*వేదనాశతకము
చాటువులు
గేయకావ్యాలు సవరించు
*అగ్నివీణ
*శివతాండవము
*పురోగమనము
*మేఘదూతము
*జనప్రియ రామాయణము
*ద్విపద కావ్యము సవరించు
*పండరీ భాగవతమ్ (ఓరియంటల్ లిటరరీ అవార్డ్)
వచన కావ్యాలు సవరించు
*ప్రబంధ నాయికలు
*వ్యాస సౌరభము
*రాయలనాటి రసికతా *జీవనము
*రామకృష్ణుని రచనా వైఖరి
*విజయాంధ్రులు
*భాగవతోపన్యాసాలు
*విజయతోరణము
*సమర్థ రామదాసు
*తెనుగు తీరులు
*ఆంధ్రమహాకవులు
*విప్లవ యోగీశ్వరుడు
*శ్రీసాయిలీలామృతము
*సరోజినీదేవి
*నవ్యాంధ్ర వైతాళికులు
*ఆంధ్రుల చరిత్ర
*కర్మయోగులు
*రాయల నీతికథలు (5 భాగాలు) మొదలైనవి.
నవలలు సవరించు
*అభయప్రదానం
*ప్రతీకారము
*హరిదాసి
*ఆంగ్లంలో స్వతంత్ర రచనలు సవరించు
*Leaves in the Wind
*Vain Glorions
*The Hero
మలయాళంలో స్వతంత్ర రచనలు *సవరించు
*మలయాళ నిఘంటువు
సంస్కృతంలో స్వతంత్ర రచనలు సవరించు
*త్యాగరాజ స్వామి సుప్రభాతం.
*మార్కాపురం చెన్నకేశవ సుప్రభాతం.
*శివకర్ణామృతము
*అగస్త్యేశ్వర సుప్రభాతం
*మల్లికార్జున సుప్రభాతం
అనువాదాలు సవరించు
హిందీ నుండి
* కబీరు వచనావళి,*విరహ సుఖము, *గాడీవాలా (నవల)
మరాఠీ నుండి:
*భగవాన్ బుద్ధ, *స్వర్ణపత్రములు, *భక్తాంచేగాథా, ఉషఃకాల్ (నవల)
మలయాళం నుండి:
*శ్మశానదీపం, *కొందియిల్‌క్కురు సిలైక్కు (నవల), *మిలట్రీవాడలో జీవితచక్రం, *దక్షిణ భారత కథాగుచ్ఛం, *తీరనిబాకీ (నాటిక),*సెట్రక్కాడు కథలు
మలయాళం లోకి:
*ఏకవీర
ఇంగ్లీషు నుండి:
*మెఱుపులు – తలపులు, *అరవిందులు
ఇంగ్లిషు లోకి:
*భాగవతం

భారత ప్రభుత్వం అతనుకు పద్మశ్రీ పురస్కారాన్నిచ్చింది. ఆయితే అతను నిజానికి జ్ఞానపీఠ అవార్డు పొందడానికి అన్నివిధాలా అర్హులనీ, అతనుకు ఆ అవార్డు రాకపోవడం తెలుగువారి దురదృష్టమనీ పలువురు పండితులు భావిస్తారు. గుర్రం జాషువా “పుట్టపర్తి నారాయణాచార్యుల కంటే గొప్పవాడెవ్వడు?” అని ప్రశ్నించాడు. దేశంలోని అన్ని ప్రాంతాలలో, హైదరాబాదు, చెన్నై, కలకత్తా లాంటి అన్ని నగరాలలో అతను సత్కారాలు పొందారు. శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు అతనుకు డి.లిట్. ప్రదానం చేశాయి.

పుట్టపర్తి నారాయణాచార్యులు (మార్చి 28, 1914 – సెప్టెంబర్ 1, 1990) తెలుగు పదాలతో ‘‘శివతాండవం’’ ఆడించిన కవి . ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానం ఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం అతనుది. అతను పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది. ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యం యొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు పుట్టపర్తి నారాయణాచార్యులు. నారాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతున్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో అతను సాధించిన లయాత్మక సౌందర్యం అనితరసాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణిస్తారు.

ఒకసారి అనంతపురంలో జరిగిన ఒక సభలో వారు మాట్లాడుతూ, “నేను 14 భాషలలో పండితుడను. నన్ను మించిన పండితుడు మరెవ్వరులేరు. నాకు అహంకారముంది. అందులో న్యాయముంది.” అని సగర్వంగా ప్రకటించుకున్న దైర్యశాలి! ఈ సరస్వతీపుత్రుని నందమూరి తారకరాముడు మనసారా సత్కరించి ఆనందభరితుడయ్యాడు. ప్రతిభకు తగిన గుర్తింపు లభించని ఈ సరస్వతీ పుత్రుడు 01-09-1990, శనివారం, ఏకాదశి నాడు తెలవారుతుండగా భాగవత సారాన్ని వివరిస్తూ మృత్యువు కౌగిట్లోకి జారిపోతూ చెప్పిన మాటలివి, “భక్తుడు, భగవంతుడు ఒకటేరా!” అంతే, ‘శ్రీనివాసా!’ అంటూ గుండె పట్టుకొని ఒక పక్కకు ఒరిగిపోయారు. శివైక్యం చెందారు. అంతకు మునుపే నిర్వాణషట్కాన్ని తెప్పించుకొని చదివారు.