RSS NEWS

  • ఎమర్జెన్సీ: ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మహిళా కార్యకర్తల పోరాటం 
    ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం, స్వీయ పరిపాలన, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు – వీటినే మనం చేసిన స్వాతంత్య్ర పోరాటం ద్వారా, రాసుకున్న  రాజ్యాంగం ద్వారా పొందే అత్యున్నత విలువలు. కానీ స్వాతంత్య్రనంతరం కూడా ఎన్నో సందర్భాల్లో నియంతృత్వ పోకడల ద్వారా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేసి, సాధించుకున్న సందర్భాలున్నాయి. అలాంటి సందర్భాల్లో 1975-77 మధ్య కాలంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీ భారత చరిత్రలోనే మర్చిపోలేని చీకటి అధ్యాయం. 25 జూన్ 1975 నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 21 మర్చి 1977 వరకు 21 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. దేశంలో అస్థిరత […]
  • నియంతృత్వ ఎమర్జెన్సీకి 49 ఏళ్లు
    -ప్రదక్షిణ వరిష్ట పాత్రికేయులు, రచయిత శ్రీ వేదుల నరసింహంగారి పుస్తకం `ఎమర్జెన్సీ జ్ఞ్యాపకాలు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం’ ఆధారంగా ఈ వ్యాసం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అత్యవసర పరిస్థితి/ ఎమర్జెన్సీ విధించిన 25 జూన్ 1975 రాత్రి నుంచి తీవ్రమైన దమనకాండ ప్రారంభమైంది. ప్రజల పౌరహక్కులు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పూర్తిగా అధికారికంగా హరించబడ్డాయి. పత్రికలపై పూర్తి స్థాయి సెన్సర్షిప్ విధించబడింది. అన్ని రాజ్యాంగ సంస్థలు పూర్తిగా, ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె ఆంతరంగిక బృందం ఆధీనంలో ఉండి, […]
  • ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1
    క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం […]
  • వివేచనతో కూడిన శౌర్యమే వీరశివాజీ – హిందూ సామ్రాజ్య దినోత్సవం
    1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం. శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన […]
  • వీరనారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి
    భారతదేశం ఎందరో వీరులను వీర మాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు వీర మాతలు ఈ గడ్డ పై జన్మించారు. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణపాయంగా ఎంచి తల్లిభారతి పాదాల చెంత సమ్పర్పించారు. తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యులారు ‘మణి’ కర్ణిక… మన రాణి ఝాన్సీ లక్ష్మీ భాయి. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి […]
  • శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్
    -అనంత్ సేథ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 5వ సర్ సంఘచాలక్ శ్రీ కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్ జీ ఆషాఢ శుద్ధ తృతీయ, 18 జూన్ 1931 నాడు రాయ్ పూర్ లో జన్మించారు. వారు 9 సం|| వయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళటం ప్రారంభించారు. వారు 6 దశాబ్దాలు సంఘ ప్రచారక్ గా సేవచేసి, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ్ జీ తర్వాత 2000 సం|| లో సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. చదువు రీత్యా ఇంజనీర్ అయిన వారు, శారీరిక దార్ఢ్యత మరియు […]
  • RSS Sarsanghchalak Late KS Sudarshan Birth Anniversary: Committed to swadeshi and economic self-reliance
    KS Sudarshan was directly associated with Swadeshi Jagran Manch (SJM) as Marg-darshak for about 7 years before taking up the responsibility of Sarsanghachalak. After the formation of SJM by Dattopant Thengadi in 1991, Swadeshi movement took off only after its national convention of 1993 in Delhi. With the support from karyakartas of Rashtriya Swayamsevak Sangh […]
  • ఐరోపాలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభం
    ఐరోపాలో అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతంలోని ఎస్టోనియాలో అతిపెద్ద శివాలయం ప్రారంభోత్సవం జరిగింది. జూన్‌ 4 న ఈ ఉత్సవాలు ప్రారంభమై… పదమూడో తేదీ వరకూ వైభవోపేతంగా జరిగాయి. దేవాలయ ప్రారంభోత్సవం, మహా కుంభాభిషేకం తమిళనాడుకి చెందిన భూపతి శివాచార్య స్వామిగల్‌, వెంకటేష్‌ జయరామ్‌ అనే అర్చకులు నిర్వహించారు. సంప్రదాయమైన ముఖ్య ఘట్టాలతో పాటు సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత శివునితో పాటు శ్రీ కర్పగ నాధర్‌, బ్రహ్మంద్‌ […]
  • మోహన్ భాగవత్ అలా అనలేదు : క్లారిటీ ఇచ్చిన సంఘ్
    రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌  వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా హిందీ పత్రిక దైనిక్‌ జాగరణ్‌ ఓ వార్త ప్రచురించింది. దీనిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆరెస్సెస్ విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మోహన్‌ భాగవత్‌ స్పందించారని ఆ పత్రిక పేర్కొంది. “మన దేశంలోని ప్రతి పౌరుడికీ తన మనసులోని భావాలను వ్యక్తపరిచే స్వేచ్చ వుందని, నడ్డా […]
  • దేశ వ్యాప్తంగా ఊపందుకున్న ”డీ లిస్టింగ్‌” డిమాండ్… ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తున్న గిరిజనులు
    మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్‌ తెగల జాబితా నుంచి తొలగించాలన్న (డీ లిస్టింగ్‌) ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. వనవాసీ సంఘాలు దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో డీ లిస్టింగ్‌ డిమాండ్‌ తో ‘‘పోస్ట్‌కార్డ్‌’’ ఉద్యమాన్ని కూడా చేస్తున్నారు. కొందరు గిరిజనులు మతం మారినా… ఇప్పటికీ గిరిజన సమాజానికి వచ్చే ప్రయోజనాలను పొందుతున్నారని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ:వ్యాప్తంగా ‘‘జనజాతి సురక్షా మంచ్‌’’ పేరుతో గిరిజనులందరూ ఏకమై పెద్ద […]

భాగ్యరెడ్డి వర్మ

పంచములుగా పరిగణింపబడిన వర్గపు అభివృద్ధి, అభ్యున్నతి కోసం కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ 1906 – 1935 మధ్య కాలంలో సామాజిక సంస్కరణకు బాటలు వేశారు. మాదరి వెంకయ్య, రంగమాంబలకు మే 22, 1888 జన్మించిన ఆయనకు వారి గురువు సలహా మేరకు బాగ్యరెడ్డి అని పేరు పెట్టారు.

మాల కులానికి చెందిన వారి వెనుకబాటుతనం, కష్టాలను అందరి దృష్టికి తీసుకువెళ్ళేందుకు భాగ్యరెడ్డి వర్మ 1906లో జగన్మిత్ర మండలిని స్థాపించి ఉపన్యాసాలు, హరికథ కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. ఇదే తరువాత 1911లో మాన్య సంఘం గా రూపొందింది. సంఘానికే తరువాత కాలంలో ఆది హిందూ సామాజిక సేవ సంస్థగా పేరు పెట్టారు. స్త్రీ విద్యను ప్రోత్సహించడం, బాల్యవివాహాలను నివారించడం వంటివి సంస్థ చేపట్టిన కార్యక్రమాలు. 1910లోనే హైదారాబాద్ లోని ఇసామియా బజార్, బొగ్గులకుంట తదితర ప్రదేశాలలో తెలుగు మాధ్యమ పాఠశాలలు ప్రారంభించారు భాగ్యరెడ్డి వర్మ. కొద్ది కాలానికే మొత్తం 21 పాఠశాల్లో రెండు వేలకు పైగా విద్యార్ధులు చేరారు. 1929లో పాఠశాలలను సందర్శించిన మహాత్మా గాంధీ వీటిలో హింది భాషా బోధన కూడా ప్రారంభించాలని సూచించారు. అయితే 1931లో అనారోగ్య కారణాల వల్ల పాఠశాలల నిర్వహణను భాగ్యరెడ్డి వర్మ నిజాం ప్రభుత్వానికి అప్పగించవలసివచ్చింది. అయినా తెలుగు మధ్యమంలోనే బోధన సాగాలనే షరతుపై ఆయన పని చేశారు. 1948 సంవత్సరం వరకు నిజాం ప్రభుత్వం తెలుగు మధ్యమ పాఠశాలలను నడిపింది.

శాకాహారాన్ని ప్రోత్సహించిన భాగ్యరెడ్డి వర్మ మద్యపాన నివారణకు కూడా బాగా కృషి చేశారు. దివాన్ బహదూర్ ఎస్. ఆర్. మలని స్థాపించిన జీవ రక్షా జ్ఞాన ప్రచారక మండలిలో కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేశారు. సేఠ్ లాల్జీ మేఘ్ జీ కార్యదర్శిగా ఉండేవారు. మద్యపాన నివారణకోసం యువకుల బృందాల ద్వారా భజన మందిరాలు ఏర్పాటు చేశారు. మద్యపానానికి ఖర్చు చేసే సొమ్మును తమకు ఇవ్వాల్సిందిగా కార్యకర్తలు భిక్షాటన చేసేవారు. అలా సేకరించిన మొత్తాన్ని దాతలకు బంగారం రూపంలో తిరిగి ఇచ్చేవారు. ఉద్యమంలో మహిళలను బాగా ప్రోత్సహించేవారు. ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా సాగిన మద్యపాన నివారణ ఉద్యమం మంచి ఫలితాలనే ఇచ్చింది.

ఆర్యసమాజ్ తో సన్నిహిత సంబంధం కలిగిన భాగ్యరెడ్డి వర్మ హిందువులను ఇస్లాంలోకి మతం మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. హిందూ సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా 1913లో ఆర్యసమాజ్ మాదరి భాగ్యరెడ్డిని `వర్మఅనే బిరుదుతో సత్కరించింది. అలాగే ఒక ప్రత్యేక సభలో ధర్మవీర్ వామన్ నాయక్ ఆయనకు `శివశ్రేష్టిఅనే బిరుదు ప్రదానం చేశారు.

నిజాంకు చెందిన హైదారాబాద్ లో కులీనులు, మేధావుల వివరాలతో రూపొందిన `పిక్టొరల్ హైదరబాద్అనే పుస్తకంలో భాగ్యరెడ్డి వర్మ గురించిన సమాచారం కూడా ఉంది. పుస్తకంలో ప్రస్తావించిన ఏకైక హరిజన నాయకుడు ఆయనే. పుస్తకాన్ని వ్రాసిన కృష్ణస్వామి ముదిరాజ్ ఇలా అన్నారు – “హిందువులు, హిందుత్వపు చరిత్ర వ్రాసినప్పుడు అణగారిన వర్గాల ఉన్నతికి కృషి చేసిన భాగ్యరెడ్డి పేరు తప్పకుండా వస్తుంది.’’

భాగ్యరెడ్డి వర్మ మంచి వక్త. 1906 – 1931 మధ్య కాలంలో ఆయన 3,348 ఉపన్యాసాలు ఇచ్చారు. 1917లో జరిగిన అఖిల భారత హిందూ సంస్కరణ సమావేశాల్లో మొదట ఆయనకు మాట్లాడటానికి కేవలం 10 నిముషాల సమయమే ఇచ్చారు. కానీ సమావేశాలకు హాజరైన ప్రతినిధులు ఎంతగా ముగ్ధులయ్యారంటే భాగ్యరెడ్డి వర్మ ఏకంగా అరగంటపాటు ఉపన్యాసం ఇచ్చారు. తరువాత మాట్లాడిన మహాత్మా గాంధీ ఆయన చెప్పిన విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా. సంస్కరణ గురించి భాగ్యరెడ్డి వర్మ వ్యక్తపరచిన అభిప్రాయాలు, సూచించిన మార్గాలు ఆచరణయోగ్యంగా ఉన్నాయని భావించిన జగద్గురు శంకరాచార్య (కుర్తకోటి) ఒక సందర్భంలో వేదికపై తనతోపాటు భాగ్యరెడ్డి వర్మకు కూడా స్థానం కల్పించారు. అదే వేదికపై రాజా ధనరాజ్ గిరి కూడా ఉన్నారు. 1925లో ఆది హిందూ భవన్ ను ప్రారంభించడానికి కూడా శంకరాచార్య సుముఖత వ్యక్తం చేసినా, కొందరు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆలోచనకు స్వస్తి చెప్పారు. ఆది హిందూ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమానికి ప్రముఖ కవి, పండితుడు, సనాతన సంస్కరణవాది అయిన కావ్యకంఠ గణపతి శాస్త్రి (ముని) హాజరయ్యారు.

బెజవాడలో జరిగిన(1917) మొదటి ఆంధ్ర దేశ పంచమ సమావేశాలకు భాగ్యరెడ్డి వర్మ హాజరయ్యారు. జనాభా లెక్కల సేకరణలో మద్రాస్ ప్రభుత్వం, నిజాం ప్రభుత్వం హరిజనులను ఆది ఆంధ్రులు, ఆది హిందువులుగా గుర్తించాయి. ఏలూరులో జరిగిన(1921) ఆది ఆంధ్ర సమావేశాల్లో భాగ్యరెడ్డి వర్మను `సంఘమాన్యఅనే బిరుదుతో సత్కరించారు.

అనవసరమైన విధానపరమైన పద్దతులు తొలగించి సామాజిక భావనను పెంపొందించడం కోసం పంచాయతీ వ్యవస్థను మోహల్లా పంచాయత్ ద్వారా సంస్కరించే ప్రయత్నం చేశారు. దీనికి కొత్వాల్ రాజ బహదూర్ వెంకట్రామ రెడ్డి ఎంతో నైతిక మద్దతు అందించారు. దీని వల్ల వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడమే కాక దురాచారాలను రూపుమాపడానికి సాధ్యపడింది. సత్ఫలితాలను ఇచ్చిన కొత్త వ్యవస్థ దురదృష్టవశాత్తు ఎక్కువ కాలం నిలబడలేదు.

పేద ప్రజానీకంలో ఆరోగ్య అవగాహన పెంచడం కోసం 1912లో స్వస్తి దళ్ ను నిర్వహించారు. ప్లేగ్ వంటి అంటువ్యాధులు వ్యాపించినప్పుడు వాటి నివారణలో దళ్ ఎంతో అద్భుతంగా పనిచేసింది.

మంచి చిత్రకారుడు కూడా అయిన భాగ్యరెడ్డి వర్మ ఒక సారి తన చిత్రాలను రవీంద్రనాథ్ టాగూర్ కు చూపించారు. అలాగే 1925లో చేతి వృత్తుల ఉత్పత్తులు, చిత్రాలు, శిల్పాల ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు. ప్రదర్శనను సందర్శించిన ఒక ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బాగున్న కళాఖండాలకు పురస్కారాలు కూడా అందజేశారు.

`భాగ్యనగర్ పత్రికద్వారా కూడా భాగ్యరెడ్డి వర్మ తన సామాజిక సంస్కరణను ప్రచారం చేశారు. అలాగే జక్కుల సత్తయ్య సహకారంతో 1918లో `ది పంచమఅనే ఆంగ్ల మాసపత్రికను కూడా ఆయన ప్రారంభించారు.

సామాజిక సంస్కరణ కోసం ఆయన చేసిన కృషిని గుర్తించి, ప్రశంసిస్తూ హిందువులలో అన్ని వర్గాలకు చెందినవారు ఆయనకు మద్దతు తెలిపారు. ఆది హిందూ సామాజిక సేవా సంస్థ ను స్థాపించిన తరువాత అందులో అధ్యక్ష పీఠంతోపాటు మూడువంతుల సభ్యులు సవర్ణులకు కేటాయిస్తూ భాగ్యరెడ్డి వర్మ నిర్ణయం తీసుకున్నారు. దీనినిబట్టి ఆయన చేపట్టిన కార్యం అన్ని వర్గాల వారిని కలుపుకుని పోయే విధంగా ఉండేదని అర్ధమవుతుంది.

1930లో క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డ భాగ్యరెడ్డి వర్మ 18 ఫిబ్రవరి, 1939లో శివరాత్రి రోజున తుది శ్వాస విడిచారు.

– రాహుల్ శాస్త్రి